శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀
🌻 324-1. 'కళ్యాణీ' 🌻
మంగళకరమైన వాక్కులను పలుకునది శ్రీదేవి యని అర్థము. 'కల్య' అనగా శుభాత్మకమైన వాక్కు, 'అణతి' అనగా శబ్దించునది అని అర్థము. శుభాత్మకమైన వాక్కులను శబ్దించునది కళ్యాణి. మానవుడొక్కడే మాటాడువాడు. వాక్కు అతనికి మాత్రమే అనుగ్రహింపబడినది. వాక్కు రూపమున శ్రీదేవియే యున్నది. ఆమెయే పలికినచో మంగళకరముగ నుండును. వారినే సరస్వతీ పుత్రులందురు. వారి నుండి సరస్వతి ప్రవహించుచు నుండును.
మలినములగు భాషణ ములు వారినుండి వ్యక్తము కావు. పరుషమగు వాక్కులు కూడ వ్యక్తము గావు. వారి భాషణము ద్వారా ఇతరులకు ప్రీతియే కలుగును గాని మరి ఏ విధమగు సంచలనము కలిగించదు. వారు కేవలము ప్రీతికే పలుకరు. వారి వాక్కున సత్యము కూడ యుండును. జ్ఞానము సహజ ముగ నుండును. భాషణమున దివ్యత్వము ఆవిష్కరింపబడును. వాక్కును ఎంత కళ్యాణముగ మానవుడు తీర్చిదిద్దుకొనునో అంతమేరకు అతని జీవితము కల్యాణమయ మగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻
🌻 324-1. Kalyāṇī कल्याणी (324)🌻
She is the embodiment of auspiciousness. Kalyāṇa means illustrious, noble, generous, virtuous, good etc. Rig-Veda (ऋग्वेद) I.31.9 uses the word Kalyāṇa. The Veda says, “तनूक्र्द बोधि परमतिश्च कारवे तवं कल्याण वसु विश्वमोपिषे tanūkrda bodhi paramatiśca kārave tavaṃ kalyāṇa vasu viśvamopiṣe”, where Kalyāṇa is used to mean worthy. The same nāma appears in Lalitā Triśatī as nāma 2. The power of auspiciousness in the form of positive energy can be realised through powerful vibrations.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment