30-NOVMEBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 30, నవంబర్ 2021 మంగళ వారం, భౌమ వారము, కార్తీక మాసం 26వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 121 / Bhagavad-Gita - 121 3-02🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 518 / Vishnu Sahasranama Contemplation - 518 🌹
4) 🌹 DAILY WISDOM - 196🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 35🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 102 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*30, నవంబర్‌ 2021, భౌమవారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 26వ రోజు 🍀*

*నిషిద్ధములు : సమస్త పదార్ధాలు*
*దానములు : నిలవ వుండే సరుకులు*
*పూజించాల్సిన దైవము : కుబేరుడు*
*జపించాల్సిన మంత్రము : ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా*
*ఫలితము : ధనలబ్ది, లాటరీ విజయం, సిరిసంపదల అభివృద్ధి*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం 
తిథి: కృష్ణ ఏకాదశి 26:15:37 
వరకు తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: హస్త 20:34:28 వరకు 
తదుపరి చిత్ర
యోగం: ఆయుష్మాన్ 24:03:02 
వరకు తదుపరి సౌభాగ్య
 కరణం: బవ 15:13:42 వరకు
వర్జ్యం: 05:42:51 - 07:14:15
దుర్ముహూర్తం: 08:43:25 - 09:28:08
రాహు కాలం: 14:52:16 - 16:16:06
గుళిక కాలం: 12:04:36 - 13:28:26
యమ గండం: 09:16:57 - 10:40:47
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 14:51:15 - 16:22:39
సూర్యోదయం: 06:29:17
సూర్యాస్తమయం: 17:39:55
వైదిక సూర్యోదయం: 06:33:09
వైదిక సూర్యాస్తమయం: 17:36:05
చంద్రోదయం: 02:10:46
చంద్రాస్తమయం: 14:32:41
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 
20:34:28 వరకు తదుపరి ధ్వాoక్ష 
యోగం - ధన నాశనం, కార్య హాని
పండుగలు : ఉత్పన్న ఏకాదశి, 
Utpanna Ekadashi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత -121 / Bhagavad-Gita - 121 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 2 🌴*

2. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మెహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో(హమాప్నుయామ్ ||

🌷. తాత్పర్యం :
*అనేకార్థములు కలిగిన నీ భోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయుము.*

🌷. భాష్యము :
 భగవద్గీత ఉపోద్ఘాతముగా గడచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచే ఇంద్రియనిగ్రహము, ఫలాపేక్షరహిత కర్మము, ప్రారంభదశలో గల సాధకుని స్థితులనెడి వివిధ విషయములు వర్ణింపబడినవి. కాని అవియన్నియును ఒక క్రమపద్దతిలో వివరింపబడలేదు. వాని సంపూర్ణావగాహనకు మరియు ఆచరణకు ఒక క్రమపద్ధతి అత్యంత అవసరమై యున్నది. 

కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను సంపూర్ణముగా తెలియనెంచెను. తద్ద్వారా సాధారణవ్యక్తి సైతము వాటిని ఎటువంటి కల్పనలు మరియు వ్యతిరేకవివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పదప్రయోగాముచే అర్జుని అర్జునుని తన ప్రశ్నల ద్వారా భగవద్గీత అంతరార్థమును తెలిసికొనగోరు నిష్టాపూర్ణులకు కృష్ణభక్తిరసభావనా మార్గము సుగమము చేయుచున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 121 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 3 - Karma Yoga - 02 🌴*

2. vyāmiśreṇeva vākyena buddhiṁ mohayasīva me
tad ekaṁ vada niścitya yena śreyo ’ham āpnuyām

🌷Translation :
*My intelligence is bewildered by Your equivocal instructions. Therefore, please tell me decisively which will be most beneficial for me.*

🌷 Purport :
In the previous chapter, as a prelude to the Bhagavad-gītā, many different paths were explained, such as sāṅkhya-yoga, buddhi-yoga, control of the senses by intelligence, work without fruitive desire, and the position of the neophyte. This was all presented unsystematically. A more organized outline of the path would be necessary for action and understanding. 

Arjuna, therefore, wanted to clear up these apparently confusing matters so that any common man could accept them without misinterpretation. Although Kṛṣṇa had no intention of confusing Arjuna by any jugglery of words, Arjuna could not follow the process of Kṛṣṇa consciousness – either by inertia or by active service. In other words, by his questions he is clearing the path of Kṛṣṇa consciousness for all students who seriously want to understand the mystery of the Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 518 / Vishnu Sahasranama Contemplation - 518 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻518. అనన్తాఽఽత్మా, अनन्ताऽऽत्मा, Anantā’’tmā🌻*

*ఓం అనన్తాత్మనే నమః | ॐ अनन्तात्मने नमः | OM Anantātmane namaḥ*

అనన్తాత్మేతి సమ్ప్రోక్తో దేశతః కాలతోఽపివా ।
వస్తుతశ్చాపరిచ్ఛిన్నో విష్ణుర్వేదాన్తిభిర్బుధైః ॥

*దేశముచే గానీ, కాలముచే గానీ, వస్తువుగా కానీ ఏర్పరచదగు పరిమాణము అంతము; అట్టి అంతము లేనిది అనంతము. పరమాత్మ తత్త్వమునకు ఈ మూడు విధములలో దేని చేతనూ పరిమితి నిర్ణయింప శక్యము కాదు. అనంతమగు ఆత్మ స్వరూపము ఎవనికి కలదో అట్టివాడు. లేదా అనంతమగు ఆత్మ ఎవనిదో అట్టివాడు అనన్తాత్మా.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 518 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 518. Anantā’’tmā 🌻*

*OM Anantātmane namaḥ*

अनन्तात्मेति सम्प्रोक्तो देशतः कालतोऽपिवा ।
वस्तुतश्चापरिच्छिन्नो विष्णुर्वेदान्तिभिर्बुधैः ॥

Anantātmeti samprokto deśataḥ kālato’pivā,
Vastutaścāparicchinno viṣṇurvedāntibhirbudhaiḥ.

*That which is confined by space, time or as an object has 'anta'. That which has no anta is Ananta. He who cannot be determined by space, time and causation is Anantātmā.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 196 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 14. There Seems to be a Ray of Light on the Horizon 🌻*

*Before the Universal takes possession of us, it burnishes us and cleanses us completely. This process of cleansing is the mystical death of the individual spirit. There it does not know what happens to it. That is the wilderness; that is the dark night of the soul; that is the suffering, and that is where we do not know whether we will attain anything or not. We weep silently, but nobody is going to listen to our wails. But the day dawns, the sun shines and there seems to be a ray of light on the horizon. That is towards the end of the Virata Parva of the Mahabharata.*

*After untold suffering for years, which the human mind cannot usually stomach, a peculiar upsurge of fortune miraculously seems to operate in favour of the suffering spirit, and unasked help comes from all sides. In the earlier stages, it appeared that nothing would come even if we asked. We had to cry alone in the forest, and nobody would listen to our cry. Now the tables have turned and help seems to be pouring in from all directions, unrequested.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 35 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 24. ఓర్పు 🌻*

*ఓర్పు, ఓర్పు, ఓర్పు! సాధకుని జీవితమున ఈ పదము అర్థరహితము కారాదు. ఓర్పునకు భూమియే గురువు. ఓర్పు వహించలేని సమయమున భూమిని చూసి మరల స్ఫూర్తి చెందవలెను. ఓర్పు లేనివారికి వాతావరణము నందలి దివ్యశక్తులు సహకారము నందించజాలవు. ఓర్పు గల వానికి కాల క్రమమున సమస్తము అనుకూలింప గలవు. సాధన యందు ఓర్పు వహించుటయే పెద్ద పరీక్ష, ఓర్పును కోల్పోయినచో సమస్తమును కోల్పోయెదవు. అనంత శక్తికి ముఖద్వారము ఓర్పుయే.*

*ఓర్పుతోనే నలుడు, హరిశ్చంద్రుడు, యుధిష్ఠిరుడు కోల్పోయిన వైభవమును తిరిగి పొందిరి. ఓర్పు వలన మూడు లోకముల యందు జయము లభింపగలదు. ఓర్పు గలవాడే నిజమైన బలవంతుడు. ఓర్పుతో నీ కందించిన సద్విషయములను నిర్వర్తించుచుండుము. మా సోదర బృందముతో పనిచేయుటకు వలసిన నేర్పు, ఓర్పు మాత్రమే.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 102 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. 🍀*

*పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పన్లేదు. నిశ్శబ్దంగా వుండు. నిర్మలంగా వుండు. అన్వేషించు. నువ్వు గుంపుగా వున్న ఆలోచనల గుండా. కోరికల గుండా ప్రయాణించాలి. కానీ ఆ గుంపు బయటి నించే కనిపించినంత పెద్దది కాదు. నువ్వు కొద్దిగా సందు చేసుకుని తలదూర్చాలి.*

*కానీ అది అందమైన ఆట. తమాషా ఆట. ధ్యానించడం వుల్లాసం కలిగించే ఆట. ఒకసారి కోరికల గుండా విశాలమయిన ఆకాశంలోకి అడుగు పెడితే నువ్వు జ్వాలని చూస్తావు. ఆ జ్వాల అనంత అస్తిత్వ జ్వాలలో భాగంగా చూస్తావు. ఆ జ్వాల నీలో వెలగడాన్ని చూస్తావు. అనంత విశ్వంలో చూస్తావు.*

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 324-1. 'కళ్యాణీ' 🌻* 

మంగళకరమైన వాక్కులను పలుకునది శ్రీదేవి యని అర్థము. 'కల్య' అనగా శుభాత్మకమైన వాక్కు, 'అణతి' అనగా శబ్దించునది అని అర్థము. శుభాత్మకమైన వాక్కులను శబ్దించునది కళ్యాణి. మానవుడొక్కడే మాటాడువాడు. వాక్కు అతనికి మాత్రమే అనుగ్రహింపబడినది. వాక్కు రూపమున శ్రీదేవియే యున్నది. ఆమెయే పలికినచో మంగళకరముగ నుండును. వారినే సరస్వతీ పుత్రులందురు. వారి నుండి సరస్వతి ప్రవహించుచు నుండును. 

మలినములగు భాషణ ములు వారినుండి వ్యక్తము కావు. పరుషమగు వాక్కులు కూడ వ్యక్తము గావు. వారి భాషణము ద్వారా ఇతరులకు ప్రీతియే కలుగును గాని మరి ఏ విధమగు సంచలనము కలిగించదు. వారు కేవలము ప్రీతికే పలుకరు. వారి వాక్కున సత్యము కూడ యుండును. జ్ఞానము సహజ ముగ నుండును. భాషణమున దివ్యత్వము ఆవిష్కరింపబడును. వాక్కును ఎంత కళ్యాణముగ మానవుడు తీర్చిదిద్దుకొనునో అంతమేరకు అతని జీవితము కల్యాణమయ మగును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 324-1. Kalyāṇī कल्याणी (324)🌻*

She is the embodiment of auspiciousness. Kalyāṇa means illustrious, noble, generous, virtuous, good etc. Rig-Veda (ऋग्वेद) I.31.9 uses the word Kalyāṇa. The Veda says, “तनूक्र्द बोधि परमतिश्च कारवे तवं कल्याण वसु विश्वमोपिषे tanūkrda bodhi paramatiśca kārave tavaṃ kalyāṇa vasu viśvamopiṣe”, where Kalyāṇa is used to mean worthy. The same nāma appears in Lalitā Triśatī as nāma 2. The power of auspiciousness in the form of positive energy can be realised through powerful vibrations.

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment