మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 107
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 107 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. కృతజ్ఞతయే మోక్షమార్గము 🌻
నిద్రించుచున్న వాడు తనకు తానుండడు. మేల్కొని చూచువానికి మాత్రముండును.
అట్లే జీవరాశులు , బ్రహ్మయు సృష్టికి ముందు తమకు తాముండరు. నారాయణునకుందురు. వారు మేల్కాంచుటయే సృష్టి. వెంటనే తమ అస్తిత్వమును, పరిసరములను , అటుపైన నారాయణుని గుర్తింతురు.
ఇట్టి స్ఫురణ కలిగించిన దేవుని యందు కృతజ్ఞుడు కాని సజ్జనుడుండడు. కృతజ్ఞత తెలుపుట యనగా అతని యునికి యందు యేమరుపాటు చెందకుండుటయే.
ఈ కృతజ్ఞతయే మోక్షమార్గము.
భగవంతుని కరుణతో నిండారిన కటాక్షములచే లభించిన జ్ఞానదీపము వలన సమస్త దోషములనబడు చీకటులును తొలగుచున్నవి. దాని వలన నిరంతరమును వానిని స్మరించు భావము నిలచియుండును. దానితో ఎల్లప్పుడును యదార్థస్థితి దర్శనమగును.
....... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹
21 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment