వివేక చూడామణి - 146 / Viveka Chudamani - 146
🌹. వివేక చూడామణి - 146 / Viveka Chudamani - 146🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 31. ఆత్మ దర్శనం -1 🍀
481. ‘నా మనస్సు మాయమైనది. దాని పనులన్ని కరిగిపోయినవి. నేను బ్రహ్మమును స్వయం ఆత్మను తెలుసుకొన్నాను. నాకు ‘ఇది’ ‘అది’ అనేది ఏది తెలియదు. అది ఏమిటి ఎంత అనేది తెలియదు. అది అంతములేని సమాధి స్థితి. బ్రహ్మానంద స్థితి’.
482. ఉన్నతమైన బ్రహ్మము అనే మహా సముద్రము, ఆత్మానందము యొక్క అమృతము ప్రవహించినట్లు, అది మాటలలో వ్యక్తము చేయుట అసాధ్యము. మనస్సుతో గ్రహించుటకు వీలులేనిది. గుర్తించుటకు వీలులేనిది. సూక్ష్మమైన కాలము, మనస్సు, సముద్రములో పడిన నీటి చుక్క సముద్రములో కలసినట్లు బ్రహ్మములో కలసిపోయినది. ఆ ఆనంద స్థితి వలన నేను ఇపుడు తృప్తి చెందినాను.
483. ఎపుడైతే విశ్వము మాయమవుతుందో, ఎవరి వలన అది తొలగించబడుతుందో, అది ఎచ్చట విలీనమైందో, అదంతా ఇపుడు నాచేత చూడబడింది. అది స్థిరముగా ఉంటుందా? ఆశ్చర్యకరంగా అదంతా కనుమరుగవుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 146 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 31. Soul Realisation - 1 🌻
481. My mind has vanished, and all its activities have melted, by realising the identity of the Self and Brahman; I do not know either this or not-this; nor what or how much the boundless Bliss (of Samadhi) is !
482. The majesty of the ocean of Supreme Brahman, replete with the swell of the nectar-like Bliss of the Self, is verily impossible to express in speech, nor can it be conceived by the mind – in an infinitesimal fraction of which my mind melted like a hailstone getting merged in the ocean, and is now satisfied with that Essence of Bliss.
483. Where is the universe gone, by whom is it removed, and where is it merged ? It was just now seen by me, and has it ceased to exist ? It is passing strange !
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
03 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment