మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 98
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 98 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయవలసినది- చేయదలచినది - 14 🌻
మొదటలో మనం వైరాగ్యం వచ్చింది మనకు అని అనుకుంటాం. ఈ విషయంలోనే అర్జునుడు కూడా కృష్ణునితో "శిష్యస్తేహంశాధి మాం త్వాం ప్రపన్నం" " నీకు నేను శిష్యుడిని నీవు చెప్పినట్లుగా నేను వింటాను. నన్ను శాసించు నేను ప్రసన్నుడిని నీకు శరణాగతుడిని" అని అన్నాడు.
ఈ మాటలు ఎం తోచనపుడు, బాధగా ఉన్నప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు అందరం అంటూనే ఉంటాం "నాకు ఆ పరమాత్మే దిక్కు" అని కూడా అంటూ ఉంటాం. కాని ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకడంటే ఒకడికి పడదు. ఒకళ్ళంటే ఒకడికి పడనపుడు ఇంక ఆ పరమాత్మ దిక్కు ఏమిటి? ఒకళ్ళంటే ఒకడికి పడకుండా ఉండటం, ఒక మతం వాడంటే మరొక మతం వాడికి పడకుండా ఉండటం లాంటిది.
మళ్ళీ మనకు కొంచెం మంచి రోజులు వచ్చేటపప్పటికి, అవతలివాడి మీద మన అభిప్రాయాలు మనకు (వేరుగా) ఉన్నాయే? అలాంటిది మాకు పరమాత్మయే దిక్కు అనే మాట ఎంతవరకు నిజం? (Correct) మనకు ఎటువంటి అభిప్రాయం లేనపుడు పరమాత్మ దిక్కు అని అర్థం. అప్పుడే నిజంగా మనం పరమాత్మను నమ్మినట్లు. వాడిని (పరమాత్మను) నమ్మాలి. మన జాగ్రత్త మీద మన ప్రయత్నం మీద మనము ఉండాలి. అనంటే అది నమ్మకం ఎలా అవుతూంది? ఇది కూడా తెలిసికోవాలి.
కనుక శరణాగతి చెందానన్న అర్జునుడు "ఒరేయ్ నువ్వు యుద్ధం చేయరా" కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని కృష్ణుడు అనగా,
"జ్యాయాసీ చేత్కర్మణస్తే మతాబుద్ధి ర్జనార్దన తత్కిం కర్మణే ఘేరామాం నియోజయసికేశవ"
కర్మకన్నా జ్ఞానం గొప్పదని అన్మావు కదా నన్ను మళ్ళీ ఆ ఘేరమైన కర్మలోనికి ఎందుకు పంపిస్తున్నావు?" అని అడిగాడు.
......✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
03 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment