మైత్రేయ మహర్షి బోధనలు - 29


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 29 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 19. నిజమైన విశ్రాంతి-1 🌻

విశ్రాంతి అనగా సమతుల్యమే. విపరీతశ్రమ విశ్రాంతి కాజాలదు. శ్రమలేమి కూడ విశ్రాంతి కాదు. ఏమీచేయకుండుట విశ్రాంతి నివ్వదు. చేయువారి కన్న చేయనివారికే నిస్సత్తువ ఎక్కువ. వారు నిస్పృహను కూడ పొందుదురు. నిస్పృహ, నిస్సత్తువ చేయువారి కుండదు. చేయనివారికే నెక్కువగ నుండును. పనిచేయుటలోనే విశ్రాంతి యున్నదని తెలియుట వివేకము.

సమస్త సృష్టి అనుస్యుతము కదలుచునే యున్నది. నదీ ప్రవాహము అనుస్యుతము గమనము నందే వున్నది. గమనము ఎక్కువైనపుడు వరదయగును. గమనమాగినచో నదీజలములు మురిగిపోవును. నదికి గమనమెట్లు సహజమో జీవమునకు చేత అట్లు సహజము. చేతలు మానినవారు రోగములు నాహ్వానింతురు. విశ్రాంతి కోరుట దురభ్యాసము. కార్యముల యందు నిమగ్నమై అవసరమైన విశ్రాంతి అప్రయత్నముగ లభించు చుండును.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


18 Nov 2021

No comments:

Post a Comment