ఆచార్య రజనీష్ ను అతని అనుచరులలో ఒకరు ఇలా ప్రశ్నించారు.
ప్రశ్న - దయచేసి ఇళ్ళు మరియు ఆస్తులు దహనం చేయబడు తున్నప్పుడు, జిహాదీల ద్వారా హత్యలు జరుగుతున్నప్పుడు మనం ఏమి చేయాలి? మేము హిందూ ముస్లిం సౌభ్రాతృత్వం అంటూ ..భాయీ భాయీ అంటూ ఉండాలా ? లేదా మన స్వంత భద్రత కోసం ఏదైనా ప్రయత్నం చేయాలా ? దయచేసి మాకు తెలియ చేయండి.
సమాధానం - మీ ప్రశ్న మీ మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది, మీరు చరిత్ర నుండి ఏమీ నేర్చుకున్నట్లు అనిపించదు. మహ్మద్ గజనీ మన సోమనాథ్ ఆలయంపై దాడి చేసినప్పుడు, సోమనాథ్ ఆ సమయంలో భారతదేశంలో అతి పెద్ద మరియు ఎక్కువ సంపద కలిగిన దేవాలయం.ఆ ఆలయంలో పూజించే 1200 మంది హిందూ పూజారులు మేము పగలు రాత్రి తేడా లేకుండా ధ్యానం, భక్తి, దైవ ఆరాధనలో నిమగ్నమై ఉన్నాము.కనుక దేవుడు మనల్ని రక్షిస్తాడు కదా అనుకున్నారు. స్వంత మాన ప్రాణాల , దేవాలయ రక్షణ కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదు. ఇంకా దారుణం ఏమిటంటే తమను తాము రక్షించుకోగల క్షత్రియులు కూడా యుధ్ధం చేయడానికి నిరాకరించారు.
ఫలితంగా,మహమద్ గజని వేలాది మంది నిరాయుధులైన హిందూ పూజారులను అతి తేలికగా చంపాడు, విగ్రహాలు మరియు దేవాలయాలను పగలగొట్టాడు మరియు చాలా సంపద, వజ్రాలు, ఆభరణాలు, బంగారం మరియు వెండిని దోచుకుని తీసుకెళ్లాడు.
దేవుని యందు ధ్యానం మరియు భక్తి ఆరాధన వారిని రక్షించలేక పోయాయి
నేడు, వందల సంవత్సరాల తరువాత కూడా, అదే మూర్ఖత్వం కొనసాగుతోంది, మీ యొక్క గొప్ప వ్యక్తుల జీవితాల నుండి మీరు ఏమీ నేర్చుకున్నట్లు అనిపించదు.
ధ్యానానికి దుర్మార్గుల హృదయాన్ని మార్చగలిగేంత శక్తి ఉంటే, శ్రీరాముడు ఎల్లప్పుడూ అతనితో విల్లు మరియు బాణాలని ఎందుకు ధరించి తిరిగాడు.
ధ్యాన శక్తితో అతను రాక్షసుల మరియు రావణుడి హృదయాన్ని మార్చ గలిగి ఉండేవాడు కదా, సోదర భావం సౌభ్రాతృత్వం అంటూ కబుర్లు చెప్పి దుర్మార్గుడైన శతృవును మంచిగా మార్చ వచ్చు కదా. యుద్ధం మరియు శతృత్వం ముగిసిపోయి ఉండేవి కదా., కానీ రాముడు కూడా ఇలాగ ఏనాడూ చేయలేదు. మరియు రామ-రావణ యుద్ధం ఆయుధాల ప్రయోగం తోనే భీకర యుద్ధం తోనే ముగించ వలసి వచ్చింది. శ్రీ రాముని నుంచి వెళ్లిన అంగదుని రాయబారం కానీ సన్మార్గుడైన విభీషణుడి హితబోధ కానీ విఫలమైన విషయం మనకు తెలిసిందే. పచ్చి దుర్మార్గులని దారిలో పెట్టటానికి ఆయుధం ధరించక తప్ప లేదు.
ధ్యానానికి చాలా శక్తి ఉంటుంది కానీ అది ఇతరుల మనస్సును మార్చగలగేది కాదు. కాబట్టి అవతార పురుషుడైన శ్రీ కృష్ణుడు కంస మరియు జరాసంధులను ఎందుకు చంపవలసి వచ్చింది ? శ్రీ కృష్ణుడు వారిని ధ్యానంతో ఎందుకు మార్చలేడు?
ధ్యానానికి మరొకరి మనసు మార్చే శక్తి ఉంటే, మహాభారత యుద్ధం ఉండేది కాదు, కృష్ణుడు తన ధ్యాన శక్తితో దుర్యోధనుడిని మార్చేవాడు మరియు యుద్ధం కూడా నివారించబడి ఉండేది కదా. కానీ దానికి విరుద్ధంగా, కృష్ణుడు ధ్యానానికి వెళ్లాలనుకున్న అర్జునుడిని ఆపి యుద్ధానికి సిద్ధం చేశాడు.
మహాభారత యుద్ధం చరిత్రలో అతిపెద్ద యుద్ధం, దీనిలో కోటి మంది మృత్యువాత పడ్డారు,గత 1200 సంవత్సరాలలో భారతదేశంలో ఎంత మంది మహర్షులు సాధువులు ఉన్నారు, గోరఖ్ నాథ్ నుండి రైదాస్ మరియు కబీర్ నుండి గురు నానక్ వరకు గురు గోవింద్ సింగ్ వరకు, వీరందరి ధ్యానం కానీ,శక్తి కానీ, దైవ భక్తి కానీ ముస్లిం ఆక్రమణదారుల మరియు బ్రిటిషర్ల దోపిడీ నుంచి కాపాడలేక పోయింది.. ఈ సమయంలో కోట్ల మంది హిందువులను ఊచకోత కోశారు, మరియు మరణ భయం చూపించి, కత్తి అంచు కొన మీద లక్షల మంది హిందువుల మతం బలవంతంగా మార్చబడింది.
దొరికిన వారిలో మతం మారని వారిని చంపేశారు.
ఆ సాధువుల బోధనలు విదేశీ ఆక్రమణ దారులను మార్చలేకపోయాయి
గురునానక్ తన మతం యొక్క తత్వశాస్త్రాన్ని ముస్లింలు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా మరియు అతనిని అర్థం చేసుకునే విధంగా ఇచ్చారు. కానీ అదే గురు సంప్రదాయంలో, గురు గోవింద్ సింగ్ ముస్లింలకు వ్యతిరేకంగా కత్తిని ధరించాల్సి వచ్చింది, హిందూ మతాన్ని కాపాడటానికి, నిరాయుధ సిక్కులు ఆయుధాలను చేపట్టవలసి వచ్చింది.
ధ్యానం ఒకరి స్వంత చైతన్యాన్ని మాత్రమే మార్చగలదని దీని నుండి స్పష్టమవుతుంది. ఇతరులను మార్చడానికి పనికి రాదు
కానీ మన పదార్థాన్ని (భౌతిక శరీరాన్ని) అనగా మన ధన ,మాన ప్రాణాలను సంపదను మనమే కాపాడుకోవాలి, దాని కోసం మనం సైన్స్ మరియు టెక్నాలజీ సహాయం తీసుకోవాలి.
.
అందుకే ఆచార్య రజనీష్ చెప్పిన పై విషయాలు గుర్తు ఉంచుకోవాలి.
దేశంలోని 70% కంటే ఎక్కువ సమస్యలకు పరిష్కారం.
శ్రీకృష్ణ భగవానుడు ఆనాడు 5 గ్రామాలు అడిగాడు!
దేశ ప్రయోజనాల కోసం మనం 5 చట్టాలను అడుగుతున్నాము !!
సమాన విద్య
ఉమ్మడి పౌర స్మృతి
మత మార్పిడి నియంత్రణ
అక్రమ చొరబాట్ల నియంత్రణ
జనాభా నియంత్రణ
ఈ ఐదు చట్టాలు రాకపోతే, ప్రస్తుతం భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో వలే మన ధర్మం మొత్తం ప్రపంచం మొత్తంలో నాశనమవుతుంది, కను మరుగు అవుతుంది
18 Nov 2021
No comments:
Post a Comment