19-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 19, శుక్రవారం, నవంబర్ 2021  భృగు వారము 🌹
🌹కార్తీక మాసం 15వ రోజు 🌹
🌹. కార్తీక పౌర్ణమి విశిష్టత 🌹
🍀. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🍀

2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 277 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 477 🌹 
4) 🌹 వివేక చూడామణి - 154 / Viveka Chudamani - 154🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -106🌹  
6) 🌹 Osho Daily Meditations - 95🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 154 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 154 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తీక పౌర్ణమి విశిష్టత 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీకపౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికీ ఉండదు. కార్తీకశుద్ధ పౌర్ణమి లేదా కార్తీకపౌర్ణమి అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏడాది మొత్తం మీద చంద్రుడు కార్తీకపౌర్ణమి రోజున ఉన్నంత ప్రకాశంగా మరే రోజూ ఉండడు. పౌర్ణమి రోజున ముత్తైదువులు రెండురకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ళ నోము అంటే కార్తీక పౌర్ణమి రోజున చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు, రెండవ సంవత్సరం పదిమందికి, మూడవ సంవత్సరం పదిహేనుమందికి వాయినాలు ఇస్తారు. రెండవ నోము కృత్తికాదీపాల నోము అంటే కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మొదటి సంవత్సరం 120 దీపాలు, రెండవ సంవత్సరం 240 దీపాలు, మూడవ సంవత్సరం 360 దీపాలను వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి. దేవ దీపావళి అని కూడా అంటారు. త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని పిలవడానికి గల కారణం వెనుక ఒక కథ వుంది.*

*🌹 పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు అంతరిక్షంలో మూడు పట్టణాలను నిర్మించుకుని సర్వసుఖాలు అనుభవించేవాడు. బలగర్వంతో దేవతలను, ఋషులను, మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలు మునులు ఋషులు అంతా కలిసి పరమశివుడికి మొరపెట్టుకోగా, పరమశివుడు మూడు రోజులపాటు త్రిపురాసురుడితో యుద్ధం చేసి సంహరించాడు. త్రిపుర సంహారం తరువాత దేవతలు అందరూ దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు మత్స్యఅవతారం ఎత్తింది. వృందాదేవి తులసి మొక్కగా అవతరించింది, దత్తాత్రేయుడు పుట్టింది, సిక్కుల మతగురువు గురునానక్ పుట్టింది ఈరోజునే. ఈ రోజు సిక్కులకు మహాపర్వదినం. గురునానక్ జయంతిని గురుపూరబ్ అని అంటారు. జ్వాలాతోరణం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. ఇది లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున, బ్రహ్మాదులు ఈ ఉత్పాదం నుండి రక్షించమని పరమశివుడిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన పరమశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగడానికి సిద్ధపడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలకు, కడుపులోపలికి వెళితే అధో (కడుపులోని) లోకాలను దహించివేస్తుందని అనే ఉద్దేశ్యంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలోనే నిక్షేపించాడు. అందుకే పరమశివుడు గరళకంఠుడు/నీలకంఠుడు అయ్యాడు. ఇది చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివుడికి ప్రమాద నివారణ కోసం ప్రతిసంవత్సరం అగిజ్వాల క్రిందనుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది. మహాశివుడికి ప్రమాదం జరగలేదు కాబట్టి పార్వతీదేవి ప్రతిసంవత్సరము కార్తీకశుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయాలలో ఎండుగడ్డితో చేసిన తోరణము రెండు కర్ర స్తంభాల మధ్య కట్టి,దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే, ఆ జ్వాల క్రిందనుంచి శివపార్వతుల పల్లకిని మూడుసార్లు మోసుకుని వెడతారు. జ్వాలలా వెలిగే ఈ తోరణాన్ని 'జ్వాలా తోరణం' అని అంటారు.*

*🌹మరొక కథ:* *త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింది కార్తీకపౌర్ణమి రోజునే అని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది. దుష్టులైన రాక్షసులను సంహరించి శివుడు కైలాసానికి చేరుకోగా, పార్వతీదేవి తన భర్తకు దృష్టిదోషం కలిగిందని భావించి దృష్టిదోష పరిహారార్థం జ్వాలాతోరణం జరిపించిందట. ఈ జ్వాలాతోరణం దర్శించినంత మాత్రాన సమస్తపాపాలు హరింపబడతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని కార్తీక పురాణం చెపుతుంది. కార్తీకపౌర్ణమి రోజు శివుడికి, మహావిష్ణువుకి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దేవాలయంలో దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు అన్నీ హరించుకుపోతాయి. పరమశివుడికి రుద్రాభిషేకం చేస్తారు. శివకేశవుల భక్తులు ఈ రోజు పగటిపూట అంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది అంతా సూచిస్తాయి. కొందరు ఈ దీపాలను అరటి దొన్నెలపై వెలిగించి నదిలో, చెరువులలో, కాలువలలో వదిలిపెడతారు. నదులు, చెరువులు, కాలువలు లేని ప్రదేశాలలో తులసి కోట లేకపోతే దేవుడి ముందు వెలిగిస్తారు. కార్తీకపౌర్ణమి రోజున శివాలయంలోగాని, విష్ణు ఆలయంలో గాని దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలమే కాక అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ రోజున ఉసిరికాయలు దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. లలితాదేవిని సహస్ర నామాలతో పూజిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ పర్వదినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మహా శ్రేష్టం అని పండితులు తెలుపుతున్నారు. కార్తీక దీపాలను వెలిగించే సమయంలో చెప్పుకోవలసిన స్తోత్రం కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాపి విప్రాః అర్థం: ఈ దీపం చూసి న ప్రభావం చేత కీటకాలు, పక్షులు, దోమలు,చెట్లు, మొక్కలు, ఉభయచరాలు అన్ని కూడా, అవి ఏ ఏ రూపాలలో ఉన్నాయో, ఆ రూపాలలోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థిస్తున్నా. ఎంతో పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది. ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్లు బ్రతికి, జ్ఞానం పొంది మోక్షం పొందవచ్చు. కానీ మిగతా జీవులకు అటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన విధి, ధర్మం కూడా. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం మనలాగా అవి భగవంతుడిని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేయడం ఎంతో శ్రేష్టం.*

*🌹ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ... హర హర హర మహాదేవ*
🌹 🌹 🌹 🌹 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*19, నవంబర్‌ 2021, భృగువారము*
*కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 15వ రోజు 🍀*

*నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు*
*దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు*
*పూజించాల్సిన దైవము: కార్తీక దామోదరుడు*
*జపించాల్సిన మంత్రము:*
*ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: పూర్ణిమ 14:28:21 వరకు 
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: కృత్తిక 28:29:09 
వరకు తదుపరి రోహిణి
యోగం: పరిఘ 27:51:08 
వరకు తదుపరి శివ 
కరణం: బవ 14:28:21 వరకు
వర్జ్యం: 14:59:30 - 16:47:26
దుర్ముహూర్తం: 08:38:20 - 09:23:26 
మరియు 12:23:53 - 13:09:00
రాహు కాలం: 10:36:45 - 12:01:19
గుళిక కాలం: 07:47:35 - 09:12:10
యమ గండం: 14:50:30 - 16:15:05
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 25:47:06 - 27:35:02 
మరియు 27:59:04 - 29:47:32 
సూర్యోదయం: 06:23:01
సూర్యాస్తమయం: 17:39:40
వైదిక సూర్యోదయం: 06:26:47
వైదిక సూర్యాస్తమయం: 17:35:52
చంద్రోదయం: 17:42:28
చంద్రాస్తమయం: 06:09:29
*చంద్ర గ్రహణం : మ 12:48 - సా 4:17 వరకు*
సూర్య రాశి: వృశ్చికం, 
చంద్ర రాశి: మేషం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 28:29:09 
వరకు తదుపరి మిత్ర యోగం - 
మిత్ర లాభం
పండుగలు : కార్తీక పౌర్ణమి, 
చంద్రగ్రహణము, గురునానక్‌ జయంతి, 
కార్తీకదీపం, Kartik Purnima, Chandra Grahan, 
Guru Nanak Jayanti, Karthigai Deepam
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -278 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 13-2
 
*🍀 13-2. ఈశ్వర తత్వము - కర్తవ్యము నందు నిమగ్నమై యున్న వానికి అహింస, సత్యము ఆదిగాగల సద్గుణముల యందు ఆసక్తి కలుగును. వాటి నిర్వహణము వలన లోపల బయట శుచి, శౌచము పెరుగగ, పంచ భూతములకు, గుణములకు ఆధారమైన చేతస్సు దర్శనమగు చుండును. జీవుల చేష్టల యందు నిత్యము కదులుచున్న చైతన్యము కనిపించును. అట్టి కదిలెడి చైతన్యములకు ఆధారముగ అందరి యందును నిశ్చల చైతన్యము ఉన్నదని గోచరించును. ఆ చైతన్యము అవ్యయమని తెలుయును. అనగా దానికి తరుగుట, పెరుగుట అను స్థితులు లేక ఎప్పుడును ఉండుటగ గోచరించును. 🍀*

*మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |*
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13*

*తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.*

*వివరణము : నిత్యము కార్యం కర్మ యందు అనగా తన కర్తవ్యము నందు నిమగ్నమై యున్న వానికి అహింస, సత్యము ఆదిగాగల సద్గుణముల యందు ఆసక్తి కలుగును. క్రమముగ వాని నిర్వహణము నందు రుచి పెరుగును. మలినములు కరుగును. లోపల బయట శుచి, శౌచము పెరుగగ, పంచ భూతములకు, గుణములకు ఆధారమైన చేతస్సు దర్శనమగు చుండును. అందరి చేష్టలకు వెనుక ఒకే ఒక నిశ్చల చైతన్యము యున్నదని, అది నిత్యము, శాశ్వతము అగు వెలుగని, అది కదలని చైతన్యమని, అది ఆధారముగ కదిలెడి చైతన్య రూపములు అనేకానేక విధము లుగ కదులుచున్నవని తెలుయును.* 

*జీవుల చేష్టల యందు నిత్యము కదులుచున్న చైతన్యము కనిపించును. అట్టి కదిలెడి చైతన్యములకు ఆధారముగ అందరి యందును నిశ్చల చైతన్యము ఉన్నదని గోచరించును. ఆ చైతన్యము అవ్యయమని తెలుయును. అనగా దానికి తరుగుట, పెరుగుట అను స్థితులు లేక ఎప్పుడును ఉండుటగ గోచరించును. అది ఆధారముగనే జీవులకు జాగ్రత్-స్వప్న సుషుప్తి అవస్థలు కలుగుచున్నవని తెలియును. అది వెండితెరవలె, ఆకాశము వలె అంతట వ్యాప్తి చెంది యుండగ, అది ఆధారముగ అనేకములగు జీవుల చేష్టలు జరుగుచున్నట్లు గోచరించును. వెండితెర నిశ్చలముగ నున్నపుడు దానిపై జరుగుచున్న బొమ్మలకథ అనేకమగు చేష్టలతో, వైవిధ్యముతో కూడిన చేష్టలతో జరుగుచుండును. అట్టి బొమ్మ చేష్టలకు ఆధారము వెండితెరయే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 477 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 35

*🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 5 🌻*

సత్యయుగములో నీవు సర్వవ్యాపుకుడవై ఉండెదవు. ఇతరయుగములలో నీ వ్యాప్తి కొన్ని స్థలములకు మాత్రమే పరిమితమగును. నీవు యుగ వ్యవస్థను అనుసరించి వృద్ధి హ్రాసములను పొందగలవు (42). ఈ నా మాటలు నీకు సుఖమును కలిగించుగాక! నేను సత్యమును పలికెను. హే విభో! నేను పతిసేవకొరకు వెళ్లుచున్నాను. నీ గృహమునకు నీవు చేరుకొనుము (43).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారధా! ఆ ధర్ముడు ఆమె యొక్క ఆ మాటను విని సంతుష్టుడాయెను. మరియు ఆతడు ఆ పతివ్రతతో నిట్లనెను (44). 

ధర్ముడిట్లు పలికెను-

ఓ పతివ్రతా! నీవు ధన్యురాలవు. పతియందు భక్తిగల నీకు మంగళమగుగాక! వరమును కోరుకొనుము. నీ భర్త నిన్ను రక్షించవలెను గదా! (45) కావున నీ భర్త యువకుడు, కామకేళియందు సమర్థుడు, ధార్మికుడు, రూపవంతుడు, గుణవంతుడు, వాగ్మి, సంతతము స్థిరము అగు ¸°వనము గలవాడు అగుగాక! (46) ఓ మంగళ స్వరూపులారా! నీ భర్త మార్కండేయుని కంటె అధిక చిరంజీవి, కుబేరుని కంటె అధిక ధనవంతుడు, ఇంద్రునికంటె అధికైశ్వర్యము గలవాడు (47), మరియు విష్ణువుతో సమమగు శివభక్తి గలవాడు, కపిలుని కంటె గొప్ప సిద్ధుడు, బృహస్పతితో సమమగు బుద్ధిశాలి, బ్రహ్మతో సమమగు సమత్వ భావన గలవాడు అగుగాక ! (48)

ఓ సుందరీ! నీవు జీవించినంత కాలము భర్తృ సౌభాగ్యముతో నలరారుము. ఓ దేవీ! మరియు నీ ¸°వనము స్థిరముగా నుండగలదు (49). నీ భర్తకంటె అధికగుణవంతులు చిరంజీవులు అగు పదిమంది పుత్రులకు నీవు తల్లివి కాగలవు. సందేహము లేదు (50). ఓ సాధ్వీ! నీ గృహము సర్వ సంపదలతో గూడి కుబేరుని భవనము కంటె అధికముగా సర్వకాలములయందు విలసిల్లును గాక! (51)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 154 / Viveka Chudamani - 154🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -1 🍀*

506. ఎలా అయితే సూర్యుడు మానవుల యొక్క కర్మలను గమనిస్తూ ఉంటాడో, ఎలా అయితే అగ్ని అన్ని పదార్థములను మంచి, చెడు అనే తేడా లేకుండా దగ్దము చేస్తుందో, ఎలా అయితే ఒక తాడు దానికి కట్టివేయబడని వస్తువుతో సంబంధము లేకుండా ఉంటుందో, అలా నేను ఏ మార్పు లేకుండా స్వయం జ్ఞానముతో ప్రకాశిస్తుంటాను. 

507. నేను ఏమీ చేయను, అలానే ఎవరిని ఏ పని చేయుటకు కారణము కాదు. నేను ఆనందమును పొందను, అలానే ఇతరుల ఆనందములకు కారణము కాదు. నేను ఏది చూడను, అలానే ఎవరిని చూచుటకు కారణము కాదు. నేను ఎపుడు స్వయం ప్రకాశముతో అతీతమైన ఆత్మను. 

508. ఎపుడైతే ఉపాధి అయిన పదార్థము కదులుతుందో, అపుడు దాని ప్రభావముతో దానికి కారణమైన వస్తువు కూడా కదలినట్లు అనిపిస్తుంది. కాని తెలివి తక్కువ వారు కారణము కదులుతున్నట్లు భావిస్తారు.అది సూర్యుడు నీటిలో కదిలినట్లు కనిపించుటవంటిది. సూర్యుడు స్థిరముగానే ఉంటాడు. తెలివి తక్కువ వారు ‘నేను’ అని ‘నేను చేసేవాడినని’, ‘నేను అనుభవిస్తున్నానని’, ‘నేను చంపబడనని’ భావిస్తుంటారు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 154 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman-1 🌻*

506. As the sun is a mere witness of men’s actions, as fire burns everything without distinction, and as the rope is related to a thing superimposed on it, so am I, the unchangeable Self, the Intelligence Absolute.

507. I neither do nor make others do any action; I neither enjoy nor make others enjoy; I neither see nor make others see; I am that Self-effulgent, Transcendent Atman.

508. When the supervening adjunct (Upadhi) is moving, the resulting movement of the reflection is ascribed by fools to the object reflected, such as the sun, which is free from activity – (and they think) "I am the doer", "I am the experiencer", "I am killed, oh, alas!"

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 154 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman-1 🌻*

506. As the sun is a mere witness of men’s actions, as fire burns everything without distinction, and as the rope is related to a thing superimposed on it, so am I, the unchangeable Self, the Intelligence Absolute.

507. I neither do nor make others do any action; I neither enjoy nor make others enjoy; I neither see nor make others see; I am that Self-effulgent, Transcendent Atman.

508. When the supervening adjunct (Upadhi) is moving, the resulting movement of the reflection is ascribed by fools to the object reflected, such as the sun, which is free from activity – (and they think) "I am the doer", "I am the experiencer", "I am killed, oh, alas!"

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 106 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. బాధలలో నున్న వారికి చుట్టము దేవుడే. 🌻*

*నిద్ర పోయిన వాడు మేల్కాంచినపుడు తానున్న పరిస్థితులను తెలిసికొనగలడు. అట్లే దేవునియందు మెలకువ కలిగిన వాడు ఆతని చరణమును పొంది యదార్థ జ్ఞానమును పొందును. అతడొకడే బ్రహ్మసృష్టిని గూర్చి తెలుసుకొనును.*

*బ్రహ్మయు, అతని సృష్టియు నారాయణుని యందే భాసించుచున్నవని మేల్కొనును. అంతకు ముందు మాత్రము తాను బ్రహ్మ సృష్టిలో నొక భాగమై జగత్తునందు మాత్రము మేల్కొనును.అట్టివారు ఒకరి యందొకరు మేల్కొని , తమ పనులను చక్కపెట్టుకొను యత్నమున తీరుబడి లేనివారై యుందురు.*  

*నారాయణుని యందు మేల్కొనిన వారికి సర్వము నారాయణుడే కనుక అంతయు తీరుబడియే. కర్తవ్యములు మాత్రము నిర్వహింపబడుచుండును.*  

....... ✍🏼 *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 95 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 95. POWER 🍀*

*🕉 If vulnerability grows along with power. There is no fear that power will be abused. 🕉*

People decide to live at the minimum so that there is no risk. When you have power, there is every risk that you will use it. When you have a sports car that can go two hundred miles per hour, there is a risk that one day you will decide to go that fast. The very thing that's possible becomes a challenge. So people live low-key lives, because if they know how much they can rise in power, how powerful they can be, then it will be difficult to resist. 

The temptation will be too much; they will want to go the whole way. Patanjali, the founder of yoga, has written a whole chapter in his Yoga Sutras about power just .to help every seeker to walk very carefully in this area, because great power will be available, and there will be great danger. But my view is totally different. If vulnerability grows along with power, there is no fear; if power grows alone without vulnerability, then there is fear, then something can go wrong. That's what Patanjali is afraid of, because his methodology goes against vulnerability. It gives you power but no vulnerability. It makes you stronger and stronger, like steel, but not strong like a rose. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 154 / Sri Lalita Sahasranamavali - Meaning - 154 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 154. మూర్తా,ఽమూర్తా,ఽనిత్యతృప్తా, ముని మానస హంసికా ।*
*సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥ 154 ॥ 🍀*

🍀 813. మూర్తామూర్తా : 
రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది 

🍀 814. నిత్యతృప్తా : 
ఎల్లప్పుదు తృప్తితో ఉండునది 

🍀 815. మునిమానసహంసికా : 
మునుల మనస్సులనెడి సరస్సులందు విహరించెడి హంసరూపిణి 

🍀 816. సత్యవ్రతా : 
సత్యమే వ్రతముగా కలిగినది 

🍀 817. సత్యరూపా : 
సత్యమే రూపముగా కలిగినది 

🍀 818. సర్వాంతర్యామినీ : 
సృష్టీ అంతటా వ్యాపించినది 

🍀 819. సతీ : 
దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 154 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 154. Murta Amurta nityatrupta munimanasa hansika*
*Satyavrata satyarupa sarvantaryamini sati ॥ 154 ॥ 🌻*

🌻 813 ) Moortha Amoortha - 
She who has a form, She who does not have a form

🌻 814 ) Nithya thriptha -   
She who gets happy with prayers using temporary things

🌻 815 ) Muni manasa hamsika -   
She who is the swan in the mind ( lake like) of sages

🌻 816 ) Satya vritha -  
 She who has resolved to speak only truth

🌻 817 ) Sathya roopa -   
She who is the real form

🌻 818 ) Sarvantharyamini -   
She who is within everything

🌻 819 ) Sathee -   
She who is Sathee the daughter of Daksha.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment