మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 106
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 106 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. బాధలలో నున్న వారికి చుట్టము దేవుడే. 🌻
నిద్ర పోయిన వాడు మేల్కాంచినపుడు తానున్న పరిస్థితులను తెలిసికొనగలడు. అట్లే దేవునియందు మెలకువ కలిగిన వాడు ఆతని చరణమును పొంది యదార్థ జ్ఞానమును పొందును. అతడొకడే బ్రహ్మసృష్టిని గూర్చి తెలుసుకొనును.
బ్రహ్మయు, అతని సృష్టియు నారాయణుని యందే భాసించుచున్నవని మేల్కొనును. అంతకు ముందు మాత్రము తాను బ్రహ్మ సృష్టిలో నొక భాగమై జగత్తునందు మాత్రము మేల్కొనును.అట్టివారు ఒకరి యందొకరు మేల్కొని , తమ పనులను చక్కపెట్టుకొను యత్నమున తీరుబడి లేనివారై యుందురు.
నారాయణుని యందు మేల్కొనిన వారికి సర్వము నారాయణుడే కనుక అంతయు తీరుబడియే. కర్తవ్యములు మాత్రము నిర్వహింపబడుచుండును.
....... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹
19 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment