వివేక చూడామణి - 154 / Viveka Chudamani - 154


🌹. వివేక చూడామణి - 154 / Viveka Chudamani - 154🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -1 🍀

506. ఎలా అయితే సూర్యుడు మానవుల యొక్క కర్మలను గమనిస్తూ ఉంటాడో, ఎలా అయితే అగ్ని అన్ని పదార్థములను మంచి, చెడు అనే తేడా లేకుండా దగ్దము చేస్తుందో, ఎలా అయితే ఒక తాడు దానికి కట్టివేయబడని వస్తువుతో సంబంధము లేకుండా ఉంటుందో, అలా నేను ఏ మార్పు లేకుండా స్వయం జ్ఞానముతో ప్రకాశిస్తుంటాను.

507. నేను ఏమీ చేయను, అలానే ఎవరిని ఏ పని చేయుటకు కారణము కాదు. నేను ఆనందమును పొందను, అలానే ఇతరుల ఆనందములకు కారణము కాదు. నేను ఏది చూడను, అలానే ఎవరిని చూచుటకు కారణము కాదు. నేను ఎపుడు స్వయం ప్రకాశముతో అతీతమైన ఆత్మను.

508. ఎపుడైతే ఉపాధి అయిన పదార్థము కదులుతుందో, అపుడు దాని ప్రభావముతో దానికి కారణమైన వస్తువు కూడా కదలినట్లు అనిపిస్తుంది. కాని తెలివి తక్కువ వారు కారణము కదులుతున్నట్లు భావిస్తారు.అది సూర్యుడు నీటిలో కదిలినట్లు కనిపించుటవంటిది. సూర్యుడు స్థిరముగానే ఉంటాడు. తెలివి తక్కువ వారు ‘నేను’ అని ‘నేను చేసేవాడినని’, ‘నేను అనుభవిస్తున్నానని’, ‘నేను చంపబడనని’ భావిస్తుంటారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 154 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman-1 🌻

506. As the sun is a mere witness of men’s actions, as fire burns everything without distinction, and as the rope is related to a thing superimposed on it, so am I, the unchangeable Self, the Intelligence Absolute.

507. I neither do nor make others do any action; I neither enjoy nor make others enjoy; I neither see nor make others see; I am that Self-effulgent, Transcendent Atman.

508. When the supervening adjunct (Upadhi) is moving, the resulting movement of the reflection is ascribed by fools to the object reflected, such as the sun, which is free from activity – (and they think) "I am the doer", "I am the experiencer", "I am killed, oh, alas!"


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2021

No comments:

Post a Comment