శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-1 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀
🌻 321-1. 'కామ్యా' 🌻
కామ్యా అనగా కోరబడునది అని అర్థము. సృష్టికి మూలమే కోరిక. జీవుల కోరికపై, ప్రార్థనపై జీవుల కొరకు జగత్తంతయూ సృష్టింపబడినది. కోరుటకు కారణము జీవులలోని అసంపూర్ణతయే. సంపూర్ణము పరిపూర్ణము అగు వరకు జీవులకు కోరిక యుండును. కోరిక యున్నంతకాలము దానిని నిర్వర్తించుకొను బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము ఆవశ్యకము లగును. కోటానుకోట్ల జీవుల అనేకానేక కోరికలను పరిపూర్తి గావించుటకే పరతత్త్వము నుండి శ్రీమాత సృష్టి సంకల్పముగ వ్యక్తమగును. ఆమె కరుణయే జీవులు పరిపూర్ణులగుటకు ఆధారము.
ఆమె సంకల్పమే లేనిచో లోకసృష్టి లేదు. జీవులకు దేహ ఇంద్రియ మనో బుద్ధి సృష్టి లేదు. అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము ఆధారముగ జీవులు ఇచ్ఛాపూర్ణము గావించుకొనుచు అనుభవమును, అనుభూతిని పొందుచు ముందుకు సాగుచుందురు. అనగా పరిణామము చెందుచు పరిపూర్ణత వైపునకు నడతురు. ఏ విషయమున అసంపూర్ణత యున్నదో ఆ విషయములయందు జీవులకు కోరిక కలుగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 321-1 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻
🌻 321-1. Kāmyā काम्या (321)🌻
Kāmyā means longing for. She is desired by the seekers of liberation. Liberation is possible only through knowledge and She is that knowledge (nāma 980). The 12th night of dark lunar fortnight is known as kāmyā.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment