మైత్రేయ మహర్షి బోధనలు - 34


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 34 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 23. పని 🌻

పనిని ప్రేమించుట ఉత్తమ లక్షణము. పనిని నిర్లక్షింప కుండుట మధ్యమ లక్షణము. పనిని గర్హించుట అధమ లక్షణము. పనిని గర్హించు వాడు క్రమశః జ్ఞానమును కోల్పోవును. అది కారణముగ ధర్మాధర్మ విచక్షణము కూడ పోవును. విలువైన విషయముల యందు శ్రద్ధ తగ్గుటయే కాక విముఖత, ఏహ్యభావము కూడ కలుగును. అట్టివారికి మా సోదర బృందమును గూర్చి తెలిపినచో చిట్టెత్తును. మండి పడుదురు. పందికి ముత్యముల విలువ తెలియదు కదా! అట్లే పని దొంగకు సత్పురుషులు, సద్ధంథములు, సత్ భాషణములు స్ఫూర్తి నివ్వక ఏహ్యత కలిగించును. విలువైన విషయముల యందు ఏహ్యత కలుగుట అపాయకరము.

అనగా రాబోవు అపాయమును సూచించును. సత్పురుషులు, సద్ధంథములు, సత్కార్యములు దూషింప బడు తావున క్షణమాత్రము ఉండరాదు. ఇది మా శాసనము. ఇతరములగు వ్యామోహములకు లోబడి అట్టి ప్రదేశముల యందు గాని, వ్యక్తులతోగాని మసలినచో మీకుగల క్రమశిక్షణము దెబ్బ తినుటయే గాక ధర్మసూత్రముల యందు అనుమానముకూడ ఏర్పడ గలదు. నియమిత కార్యములను ఏకోన్ముఖముగ నిర్వర్తించుచు, నిర్వర్తింపబడు కార్యములను ప్రేమించుచు జీవించుట శ్రేయోదాకము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


28 Nov 2021

No comments:

Post a Comment