శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀
🌻 323-2. 'కదంబ కుసుమప్రియా' 🌻
కదంబ పుష్పము యొక్క మరియొక ప్రత్యేకత ఆ పుష్పము యొక్క రూపము. గోళాకార రూపము కలిగిన పుష్పము కదంబము. సృష్టి యంతయూ గోళములుగనే ఏర్పడినది. జీవులు కూడ సహజముగ గోళాకారులే. గోళాకారము ప్రథమ రూపము. అందుండి క్రమముగ వివిధ రూపములతో కూడిన శరీర మేర్పడును. గర్భపిండము గోళా కారముగనే యుండును.
పుష్పముల యందు గోళాకార పుష్పము లుండుట అరుదు. అవియునూ సిందూరము వర్ణములో నుండుట మరింత అరుదు. అంతియే గాక కదంబ పుష్పము పరిమళములను కూడ వెదజల్లును. పరిమళము, పవిత్రత, సంపూర్ణత అను మూడు శుభలక్షణములు కలిగినది కదంబ కుసుమము. అట్టి కుసుమముల యందు శ్రీమాతకు ప్రీతి హెచ్చు. అట్టి గుణములు కలవారి యందు కూడ శ్రీమాతకు ప్రీతి హెచ్చు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 323-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻
🌻 323-2. Kadamba-kusuma-priyā कदम्ब-कुसुम-प्रिया (323)🌻
She is fond of kadamba flowers, amidst the tress of which She lives (nāma 60). The same nāma appears in Lalitā Triśatī as nāma 11. Lalitā Triśatī consists of 300 nāma-s. This 300 is arrived at by multiplying fifteen bīja-s of Pañcadaśī by twenty. The first bīja in Pañcadaśī is ‘ka’ (क). The first twenty nāma-s begin with this bīja and the next twenty nāma-s begin with next alphabet of Pañcadaśī ‘e’ (ए). Triśatī is considered very powerful as it originates from the Pañcadaśī mantra.
There are said to be five types of sacred trees and kadamba tree is one among them. These five sacred trees said to represent the four components of antaḥkaraṇa viz. mind, intellect, consciousness and ego and the fifth being the heart where the soul is said to reside (Some modern interpretations point out that the soul resides within the pineal gland, the gland of divinity). The smell of these flowers is compared to the modifications of the mind.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment