నిర్మల ధ్యానాలు - ఓషో - 101
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 101 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీ లోపలి నిశ్శబ్దంలో వున్నపుడే సత్యం సత్యంగా వుంటుంది. నీలో వున్నపుడే, నిశ్చలంగా వున్నపుడే అదే దేవుడు చేసిన చిన్ని శబ్దంగా వుంటుంది. 🍀
మనిషి పేజీలు తిప్పని పవిత్ర గ్రంథం. మనం అనేక గ్రంధాల్ని చదువుతాం. మనం లోపలి అస్తిత్వాన్ని చదవం. అందులో వున్నదే ఆ గ్రంధాలలో వున్నది. మనలో వున్నదే వాటిల్లో వున్నది. నీలో వున్నది స్వచ్ఛమయింది. గ్రంధాలు మురికితో నిండుతాయి. అది విషయాల సహజలక్షణం. నువ్వు ఒకసారి సత్యం గురించి చెబితే అది అబద్ధంగా మారిపోతుంది. గట్టిగా పలికితే కల్మషంగా మారుతుంది.
నీ లోపలి నిశ్శబ్దంలో వున్నపుడే సత్యం సత్యంగా వుంటుంది. నీలో వున్నపుడే, నిశ్చలంగా వున్నపుడే అదే దేవుడు చేసిన చిన్ని శబ్దంగా వుంటుంది. దానికి ఒకటే నిబంధన. నువ్వు నిశ్శబ్దంగా వుండాలి. నిర్మలంగా వుండాలి. అప్పుడే నువ్వు దాన్ని వినగలవు. దాన్ని చదవగలవు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment