నిర్మల ధ్యానాలు - ఓషో - 106


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 106 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం మన గుర్తింపుకు అతుక్కుని వుంటాం. వ్యక్తి తన అహాన్ని కోల్పోవడం అంటే సమస్తంతో కలవడం, నీకు గుర్తింపునిచ్చే సరిహద్దుల్ని వదిలిపెట్టడం. నిన్ను నువ్వు వదులు కోవడం. నిన్ను నువ్వు వదులుకున్న మరుక్షణం నువ్వు సముద్రమంత అవుతావు. 🍀

ప్రేమ అంటే మంచుబిందువు సముద్రంలో కలిసిపోవడం మినహా మరొకటి కాదు. అది వ్యక్తి తన అహాన్ని కోల్పోవడం, వునికికి సంపూర్ణంగా తనని తాను సమర్పించుకోవడం. అది సమస్తంతో కలవడం, నీకు గుర్తింపు నిచ్చే సరిహద్దుల్ని వదిలిపెట్టడం. నిన్ను నువ్వు వదులుకోవడం. నిన్ను నువ్వు వదులుకున్న మరుక్షణం నువ్వు సముద్రమంత అవుతావు. విశాలమవుతావు. మనం మన గుర్తింపుకు అతుక్కుని వుంటాం. దాన్ని రక్షించుకుంటూ వుంటాం. దానికోసం ఘర్షిస్తాం. దానికోసం చనిపోవడానిక్కూడా సిద్ధపడతాం.

అదెంత తెలివి తక్కువ తనమంటే వునికిలో వున్న పనికిమాలిన విషయం అహమొక్కటే. అది వేడిగాలి. దానికి నిజమైన వునికి లేదు. అది చీకటిలాంటిది. నువ్వు చీకటిని చూడవచ్చు. ప్రతిరోజు చూడవచ్చు. నిజానికి అట్లాంటిదేదీ లేదు. అది కేవలం వెలుగు లేకపోవడం. దీపం తీసుకొస్తే మనకు వెలుగు వుంటుంది. చీకటి కనిపించదు. కనీసం అది తలుపు గుండా వెళ్ళిపోవడం కూడా మనకు కనిపించదు. అదే దీపాన్ని ఆర్పు. వెంటనే అదక్కడ వుంటుంది. అది రావడం కూడా చూడవు. కావాలంటే తలుపులు, కిటికీలు మూసి వుంచు. అది ఎక్కడి నుండో రాదు. కారణం అది వునికిలో లేనిది. అది కేవలం లేకపోవడం. అహానికి సంబంధించి కూడా అదే యథార్థం. అహమన్నది ప్రేమ లేకపోవడం, నీలో ప్రేమ కాంతి వెలిగిన క్షణం అహం అదృశ్యమవుతుంది. మిరంత ప్రేమగా మారి, నిబంధనలు లేని ప్రేమగా పరివర్తన చెందు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2021

No comments:

Post a Comment