8-DECEMBER-2021 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 08, డిసెంబర్ 2021 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 125 / Bhagavad-Gita - 125 3-06🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 522 / Vishnu Sahasranama Contemplation - 522 🌹
4) 🌹 DAILY WISDOM - 200🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 39🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 106🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 326 / Sri Lalitha Chaitanya Vijnanam - 326 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 08, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ ద్విజగణపతి ధ్యానం 🍀*

*యం పుస్తకాక్ష గుణదండ కమండలు*
*శ్రీ విద్యోతమానకర భూషణ మిందువర్ణమ్ |*
*స్తంబేరమానన చతుష్టయశోభమానం*
*త్వాం యః స్మరేద్ద్విజ గణాధిపతే స ధన్యః || 6 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల పంచమి 21:27:17 
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: శ్రవణ 22:41:55 
వరకు తదుపరి ధనిష్ట
యోగం: ధృవ 13:08:52 
వరకు తదుపరి వ్యాఘత
కరణం: బవ 10:32:10 వరకు
వర్జ్యం: 03:56:40 - 05:26:32
మరియు 26:31:50 - 28:04:34
దుర్ముహూర్తం: 11:45:37 - 12:30:07
రాహు కాలం: 12:07:52 - 13:31:19
గుళిక కాలం: 10:44:25 - 12:07:52
యమ గండం: 07:57:31 - 09:20:58
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 12:55:52 - 14:25:44
పండుగలు మరియు పర్వదినాలు
సూర్యోదయం: 06:34:03
సూర్యాస్తమయం: 17:41:40
వైదిక సూర్యోదయం: 06:37:57
వైదిక సూర్యాస్తమయం: 17:37:47
చంద్రోదయం: 10:34:37
చంద్రాస్తమయం: 22:02:46
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 22:41:55 
వరకు తదుపరి మిత్ర యోగం - 
మిత్ర లాభం 
పండుగలు : వివాహ పంచమి
Vivah Panchami
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -125 / Bhagavad-Gita - 125 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము -6 🌴*

*కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |*
*ఇన్ద్రియార్థాన్ విమూడాత్మా మిథ్యాచార: స ఉచ్యతే ||*

🌷. తాత్పర్యం :
*కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థము లందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించు కొనుచు మిథ్యాచారి యనబడును.*

🌷. భాష్యము :
మనస్సునందు ఇంద్రియభోగమును గూర్చి ఆలోచించుచునే ధ్యానతత్పరతను ప్రదర్శించు కపతులు పలువురు గలరు. అట్టివారు కృష్ణభక్తిభావానమునందు కర్మను చేయ నిరాకరింతురు. అట్టి మిథ్యాచారులు తమను అనుసరించు శిష్యులను భ్రమింపచేయుటకు శుష్కవేదాంతమును సైతము పలుకుదురు. ఈ శ్లోకము ప్రకారము అట్టి వారందరును గొప్ప మోసకారులు. 

ఇంద్రియప్రీతి కోరినవాడు వర్ణాశ్రమధర్మమును పాటించుచు తనకు సంబంధించిన నియమనిబంధనలను అనుసరించినచో క్రమముగా తనను తాను పవిత్రుని కావించుకొనగలడు. కాని యోగివలె నటించుచు ఇంద్రియార్థములను వెదుకువాడు కొన్నిమార్లు తత్త్వముపై ప్రవచనములను గావించినను గొప్ప మోసకారి యనియే పిలువబడును. 

అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానుని మాయచే హరింపబడును గావున వాని జ్ఞానమునకు ఎట్టి విలువయు ఉండదు. అటువంటి కపటాత్ముని మనస్సు సదా అపవిత్రమై యుండుట వలన అతని ధ్యానప్రదర్శనము సర్వదా ప్రయోజనశూన్యమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 125 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 6 🌴*

*karmendriyāṇi saṁyamya ya āste manasā smaran*
*indriyārthān vimūḍhātmā mithyācāraḥ sa ucyate*

🌷Translation :
*One who restrains the senses of action but whose mind dwells on sense objects certainly deludes himself and is called a pretender.*

🌷 Purport :
There are many pretenders who refuse to work in Kṛṣṇa consciousness but make a show of meditation, while actually dwelling within the mind upon sense enjoyment. Such pretenders may also speak on dry philosophy in order to bluff sophisticated followers, but according to this verse these are the greatest cheaters. 

For sense enjoyment one can act in any capacity of the social order, but if one follows the rules and regulations of his particular status, he can make gradual progress in purifying his existence. But he who makes a show of being a yogī while actually searching for the objects of sense gratification must be called the greatest cheater, even though he sometimes speaks of philosophy. 

His knowledge has no value, because the effects of such a sinful man’s knowledge are taken away by the illusory energy of the Lord. Such a pretender’s mind is always impure, and therefore his show of yogic meditation has no value whatsoever.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 522 / Vishnu Sahasranama Contemplation - 522🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 522. మహాఽర్హః, महाऽर्हः, Mahā’rhaḥ 🌻*

*ఓం మహార్హాయ నమః | ॐ महार्हाय नमः | OM Mahārhāya namaḥ*

మహాఽర్హః, महाऽर्हः, Mahā’rhaḥ

*మహః పూజా తదర్హత్వాన్మహార్హ ఇతి కథ్యతే*

*పూజల నందుకొనుటకు అర్హుడు గనుక ఆ పరమేశ్వరుడు మహార్హుడు.*

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
వ. పూజించునప్పు డం దగ్రపూజార్హు లెవ్వ రని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతుర వచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకుల సంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి 'యీ మహాత్ముని సంతుష్టుం జేసిన భువనంబులన్నియుం బరితుష్టిం బొందు' నని జెప్పి ధర్మజుం జూచి ఇట్లనియె. (777)

ఉ. కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ
జ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్‍ 
వేళలు విప్రులున్ జననవృద్ధిలయంబుల హేతుభూతముల్‍
లీలలఁ దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్‍. (778)
చ. ఇతఁడే యితండు గన్ను లొకయించుక మెడ్చిన నీ చరాచర
స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్‍
వితతములై జనించుఁ బ్రబవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్‍? (779)
ఉ. ఈ పురుషోత్తమున్ జగదధీశు ననంతుని సర్వశక్తుఁ జి
ద్రూపకు నగ్రపుజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‍
వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్‍
శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్‍? (780)

*ఈ విధంగా పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హుడెవడనే ప్రశ్న పుట్టింది. సభలో ఉన్నవారు తమకు తోచిన విధంగా తలకొకరీతిగా చెప్పారు. వారి మాటలను వారించి బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన కృష్ణుడిని చూపించి 'ఈ మహాత్ముడిని సంతుష్టుడిని చేసిన సమస్త లోకాలు సంతోషిస్తాయి' అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు.*

*కాలమూ, దేశమూ, యజ్ఞమూ, కర్మమూ, కర్తా, భోక్తా, ప్రపంచమూ, దైవమూ, గురువూ, మంత్రమూ, అగ్నీ, హవ్యద్రవ్యాలూ, సృష్టి-స్థితి-లయలు సమస్తమూ తానేయై ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ కృష్ణ పరమాత్ముడొక్కడే.*

*పరమేశ్వరుడైన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొన్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ జన్మిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారకుడైన ఈ పుణ్యపురుషుడు యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు విష్ణుస్వరూపుడు. సర్వ సమర్థుడు. అగ్రపూజకు అర్హుడు ఇతడు గాకపోతే మరెవ్వరు?*

*ఓ రాజా! పురుషోత్తముడూ, లోకాధిపతీ, అనంతుడూ, సమస్త శక్తులు కలవాడూ, చిద్రూపుడూ, అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింపజేసినట్లయిన సమస్త లోకాలూ సంతృప్తినొందుతాయి.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 522 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 522. Mahā’rhaḥ 🌻*

*OM Mahārhāya namaḥ*

महः पूजा तदर्हत्वान्महार्ह इति कथ्यते 
Mahaḥ pūjā tadarhatvānmahārha iti kathyate 

*One who is fit for worship is Mahā’rhaḥ.*

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 74 18 to 23 

The members of the assembly then pondered over who among them should be worshiped first, but since there were many personalities qualified for this honor, they were unable to decide. Finally Sahadeva spoke up. He said "Certainly it is Acyuta, the Supreme God and chief of the Yādavas, who deserves the highest position.

*In truth, He Himself comprises all the gods worshiped in sacrifice, along with such aspects of the worship as the sacred place, the time and the paraphernalia. This entire universe is founded upon Him, as are the great sacrificial performances, with their sacred fires, oblations and mantras. Sāńkhya and yoga both aim toward Him, the One without a second.*

*O assembly members, that unborn Lord, relying solely on Himself, creates, maintains and destroys this cosmos by His personal energies, and thus the existence of this universe depends on Him alone. He creates the many activities of this world, and thus by His grace the whole world endeavors for the ideals of religiosity, economic development, sense gratification and liberation.*

*Therefore we should give the highest honor to Kr‌s‌n‌a, the Supreme Lord. If we do so, we will be honoring all living beings and also our own selves."*
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 200 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 18. A Dependent Success Cannot be Called a Success 🌻*

*The life of a saint is a mystic Mahabharata itself. Every sage or saint has passed through all the stages of the Mahabharata conflict. No one lived as a great saint without passing through untold hardships, and no one ever left this world with the feeling that it is all milk and honey flowing.*

*The truth of the world becomes evident to the eyes that are about to close to this world; the untutored mind takes it for what it is not. Hence, the glory of the royal coronation and success ended in untold grief, because of a negative aspect that was hidden in the joy of the coronation. There was something lacking. It was a glory that was bestowed upon Yudhishthira by the power of people, like the ascent of a person to the throne of a ministry by the raising of hands of the vast public.*

*But the hands can drop down tomorrow; they need not always be standing erect. There is always an unpredictable uncertainty about mob psychology, and therefore a dependent success cannot be called a success. If I have become great due to your goodness, that would not be real greatness, because your goodness can be withdrawn. If the greatness is at the mercy of another's opinion or power, it falls.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 39 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 28. నిజమైన సాధువు-1 🌻*

*మానవ జాతి యందు కరడు కట్టిన అజ్ఞానమును నిర్మూలించుట మహత్తరమైన సేవా కార్యక్రమము. మూఢ విశ్వాసములు, ఆచారములు అజ్ఞానములోని అంతర్భాగములు. వీని నిర్మూలనము సుసాధ్యమైన కార్యము కాదు. నేర్పు, ఓర్పు, జ్ఞానము కలవారు మాత్రమే నిర్వర్తించ గలరు. ఇతరులు ఈ ప్రయత్నమున మరింత అయోమయ స్థితిని సృష్టించగలరు.*

*విజ్ఞానశాస్త్ర పరిశోధనా మార్గమున మానవుడు అజ్ఞానమును, మూఢ విశ్వాసములను, ఆచారములను దాటుటకు శాస్త్రీయమైన అవగాహన పెంపొందించుటకు శతాబ్దములుగ చక్కని ప్రయత్నములు కొనసాగించుచున్నాడు. ఇది హర్షింపదగిన విషయము. కాని, శాస్త్రజ్ఞుని శాస్త్రీయ దృక్పథము నిస్పాక్షికము కాకపోవుట వలన శాస్త్ర పరిశోధనము కూడా తాత్కాలిక నిరోధములు కల్గించు కొనుచున్నది.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 106 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనం మన గుర్తింపుకు అతుక్కుని వుంటాం. వ్యక్తి తన అహాన్ని కోల్పోవడం అంటే సమస్తంతో కలవడం, నీకు గుర్తింపునిచ్చే సరిహద్దుల్ని వదిలిపెట్టడం. నిన్ను నువ్వు వదులు కోవడం. నిన్ను నువ్వు వదులుకున్న మరుక్షణం నువ్వు సముద్రమంత అవుతావు. 🍀*

*ప్రేమ అంటే మంచుబిందువు సముద్రంలో కలిసిపోవడం మినహా మరొకటి కాదు. అది వ్యక్తి తన అహాన్ని కోల్పోవడం, వునికికి సంపూర్ణంగా తనని తాను సమర్పించుకోవడం. అది సమస్తంతో కలవడం, నీకు గుర్తింపు నిచ్చే సరిహద్దుల్ని వదిలిపెట్టడం. నిన్ను నువ్వు వదులుకోవడం. నిన్ను నువ్వు వదులుకున్న మరుక్షణం నువ్వు సముద్రమంత అవుతావు. విశాలమవుతావు. మనం మన గుర్తింపుకు అతుక్కుని వుంటాం. దాన్ని రక్షించుకుంటూ వుంటాం. దానికోసం ఘర్షిస్తాం. దానికోసం చనిపోవడానిక్కూడా సిద్ధపడతాం.*

*అదెంత తెలివి తక్కువ తనమంటే వునికిలో వున్న పనికిమాలిన విషయం అహమొక్కటే. అది వేడిగాలి. దానికి నిజమైన వునికి లేదు. అది చీకటిలాంటిది. నువ్వు చీకటిని చూడవచ్చు. ప్రతిరోజు చూడవచ్చు. నిజానికి అట్లాంటిదేదీ లేదు. అది కేవలం వెలుగు లేకపోవడం. దీపం తీసుకొస్తే మనకు వెలుగు వుంటుంది. చీకటి కనిపించదు. కనీసం అది తలుపు గుండా వెళ్ళిపోవడం కూడా మనకు కనిపించదు. అదే దీపాన్ని ఆర్పు. వెంటనే అదక్కడ వుంటుంది. అది రావడం కూడా చూడవు. కావాలంటే తలుపులు, కిటికీలు మూసి వుంచు. అది ఎక్కడి నుండో రాదు. కారణం అది వునికిలో లేనిది. అది కేవలం లేకపోవడం. అహానికి సంబంధించి కూడా అదే యథార్థం. అహమన్నది ప్రేమ లేకపోవడం, నీలో ప్రేమ కాంతి వెలిగిన క్షణం అహం అదృశ్యమవుతుంది. మిరంత ప్రేమగా మారి, నిబంధనలు లేని ప్రేమగా పరివర్తన చెందు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 326 / Sri Lalitha Chaitanya Vijnanam - 326 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 326. 'కరుణారస సాగరా'🌻* 

*కరుణారసమునకు సముద్రము వంటిది శ్రీమాత అని అర్థము. శ్రీమాత దయ అపరిమితము. ఆమె అనుగ్రహము కలిగినవారు అమిత తేజోవంతులై, పరాక్రమవంతులై క్రియాశీలురై వుండగలరు. ఆమె అనుగ్రహమునకు హద్దులు లేవు. దరిద్రుని కుబేరుని చేయ గలదు. బంటుని చక్రవర్తిగ చేయగలదు. మూర్ఖుని జ్ఞానిగ మలచ గలదు. అసమర్థుని సమర్థునిగ తీర్చిదిద్దగలదు. విశ్వాసము వుండ వలెనే గాని అమ్మ కృపకు పాత్రులైనవారు అన్ని రంగముల యందు రాణించగలరు. సగరులను రక్షించుటకు ఊర్ధ్వలోకముల నుండి ప్రవహించి అధోలోకములను చేరి వారి నుద్దరించినది శ్రీమాతయే. అది ఆమె గంగా స్వరూపము. గంగ యనగ కేవలము అధోలోకమునకు ఊర్ధ్వము నుండి గమనము చేసిన చైతన్యమే కాదు. సగరులను ఉద్ధరించి ఊర్ధ్వ లోకములకు కూడ చేర్చినది. ఆమె గమనము ద్విముఖము. అందు వలననే గంగ అయినది. 'గ' అక్షరము గమనమునకు సంకేతము. గంగ ఉద్ధరించునది కూడ.*

*గంగ యందలి స్నానము జీవులను పవిత్రులను చేయుననుట సత్యము. సమస్త పాపములను హరించి పవిత్రులను చేయుటకే దిగి వచ్చిన పుణ్యనది గంగానది. మానవుడు మూర్ఖుడై గంగను అపవిత్రము చేసిననూ అందు మునిగిన మూర్ఖుని పవిత్రుని చేయును. అదియే ఆమె దయకు ఉదాహరణము. శ్రీమాత దయను గూర్చి వర్ణించుట కెవ్వరికిని శక్యము కాదు. ఆమె కరుణ తరంగములు తరంగములుగ కన్నుల నుండి ప్రవహించుచునే యుండును. అందువలన ఆమె 'కరుణాతరంగితాక్షి'. ఆ ప్రవాహము సముద్రము వలె అపరిమితము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 326 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya*
*Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 326. Karuṇārasa-sāgarā करुणारस-सागरा (326) 🌻*

*The ocean of compassion. Karuṇa means compassion, rasa means essence and sāgara means ocean. Compassion is Her natural quality, because She is the universal mother. Lalitā Triśatī nāma 9 is ‘karuṇāmrta sāgarā’, which conveys the same meaning. Śaṇkarā, the great saint has given the following interpretation: “Ocean, without making a move is the cause for rain and the entire universe sustains on this water.*

*A drop of water gets itself detached from the clouds and enters a different plane (leaving ākāś and reaching earth) merely to sustain this universe. The water itself does not get any benefit out of its own action. Such is Her compassion.” This compassion is called the Supreme because, She does not differentiate. As far as She is concerned, all are equal before Her, yet another reasoning for addressing Her as the universal Mother.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment