శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 326 / Sri Lalitha Chaitanya Vijnanam - 326
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 326 / Sri Lalitha Chaitanya Vijnanam - 326 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀
🌻 326. 'కరుణారస సాగరా'🌻
కరుణారసమునకు సముద్రము వంటిది శ్రీమాత అని అర్థము. శ్రీమాత దయ అపరిమితము. ఆమె అనుగ్రహము కలిగినవారు అమిత తేజోవంతులై, పరాక్రమవంతులై క్రియాశీలురై వుండగలరు. ఆమె అనుగ్రహమునకు హద్దులు లేవు. దరిద్రుని కుబేరుని చేయ గలదు. బంటుని చక్రవర్తిగ చేయగలదు. మూర్ఖుని జ్ఞానిగ మలచ గలదు. అసమర్థుని సమర్థునిగ తీర్చిదిద్దగలదు. విశ్వాసము వుండ వలెనే గాని అమ్మ కృపకు పాత్రులైనవారు అన్ని రంగముల యందు రాణించగలరు. సగరులను రక్షించుటకు ఊర్ధ్వలోకముల నుండి ప్రవహించి అధోలోకములను చేరి వారి నుద్దరించినది శ్రీమాతయే. అది ఆమె గంగా స్వరూపము. గంగ యనగ కేవలము అధోలోకమునకు ఊర్ధ్వము నుండి గమనము చేసిన చైతన్యమే కాదు. సగరులను ఉద్ధరించి ఊర్ధ్వ లోకములకు కూడ చేర్చినది. ఆమె గమనము ద్విముఖము. అందు వలననే గంగ అయినది. 'గ' అక్షరము గమనమునకు సంకేతము. గంగ ఉద్ధరించునది కూడ.
గంగ యందలి స్నానము జీవులను పవిత్రులను చేయుననుట సత్యము. సమస్త పాపములను హరించి పవిత్రులను చేయుటకే దిగి వచ్చిన పుణ్యనది గంగానది. మానవుడు మూర్ఖుడై గంగను అపవిత్రము చేసిననూ అందు మునిగిన మూర్ఖుని పవిత్రుని చేయును. అదియే ఆమె దయకు ఉదాహరణము. శ్రీమాత దయను గూర్చి వర్ణించుట కెవ్వరికిని శక్యము కాదు. ఆమె కరుణ తరంగములు తరంగములుగ కన్నుల నుండి ప్రవహించుచునే యుండును. అందువలన ఆమె 'కరుణాతరంగితాక్షి'. ఆ ప్రవాహము సముద్రము వలె అపరిమితము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 326 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻
🌻 326. Karuṇārasa-sāgarā करुणारस-सागरा (326) 🌻
The ocean of compassion. Karuṇa means compassion, rasa means essence and sāgara means ocean. Compassion is Her natural quality, because She is the universal mother. Lalitā Triśatī nāma 9 is ‘karuṇāmrta sāgarā’, which conveys the same meaning. Śaṇkarā, the great saint has given the following interpretation: “Ocean, without making a move is the cause for rain and the entire universe sustains on this water.
A drop of water gets itself detached from the clouds and enters a different plane (leaving ākāś and reaching earth) merely to sustain this universe. The water itself does not get any benefit out of its own action. Such is Her compassion.” This compassion is called the Supreme because, She does not differentiate. As far as She is concerned, all are equal before Her, yet another reasoning for addressing Her as the universal Mother.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment