మైత్రేయ మహర్షి బోధనలు - 39
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 39 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 28. నిజమైన సాధువు-1 🌻
మానవ జాతి యందు కరడు కట్టిన అజ్ఞానమును నిర్మూలించుట మహత్తరమైన సేవా కార్యక్రమము. మూఢ విశ్వాసములు, ఆచారములు అజ్ఞానములోని అంతర్భాగములు. వీని నిర్మూలనము సుసాధ్యమైన కార్యము కాదు. నేర్పు, ఓర్పు, జ్ఞానము కలవారు మాత్రమే నిర్వర్తించ గలరు. ఇతరులు ఈ ప్రయత్నమున మరింత అయోమయ స్థితిని సృష్టించగలరు.
విజ్ఞానశాస్త్ర పరిశోధనా మార్గమున మానవుడు అజ్ఞానమును, మూఢ విశ్వాసములను, ఆచారములను దాటుటకు శాస్త్రీయమైన అవగాహన పెంపొందించుటకు శతాబ్దములుగ చక్కని ప్రయత్నములు కొనసాగించుచున్నాడు. ఇది హర్షింపదగిన విషయము. కాని, శాస్త్రజ్ఞుని శాస్త్రీయ దృక్పథము నిస్పాక్షికము కాకపోవుట వలన శాస్త్ర పరిశోధనము కూడా తాత్కాలిక నిరోధములు కల్గించు కొనుచున్నది.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
08 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment