🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 116 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 1 🌻
లోకము అంటే చూపు అని అర్థము. మనము జగత్తును ఎలా చూస్తే, ఆ లోకంలో మనం ఉంటాము. ఉదాహరణకు లోకమంతా చెడిపోయినట్లు మనం చూస్తే, మనము చెడిపోవడం జరుగుతుంది. లోకంలో మంచిని చూస్తుంటే మనం మంచి వారమే అవుతాం. ఇంతకూ లోకంలో వ్యక్తుల స్వభావం అనేది వారిని గూర్చి మన అభిప్రాయం మాత్రమే సన్నివేశాలను, వ్యక్తులను గూర్చి నచ్చినవారు, నచ్చనివారు అంటూ మనకు రెండురకాల ముద్రలు ఏర్పడతాయి. ఈ ముద్రలతో కూడిన స్థితినే సంసార స-ముద్రమంటారు రాగద్వేషాత్మకములయిన ముద్రలు మనకు సుఖదుఃఖాలను ఇస్తుటాయి. మన ప్రజ్ఞ వీని ఆటుపోటులకు లోనై శాంతిని కోల్పోతుంది.
పాడయిన ఈ లోకమును ఉద్ధరించాలనే అభిప్రాయాలు మొలకెత్తుతాయి. మనకు మనమే లోకోద్ధరణ అనే బరువును నెత్తిన వేసికొంటాం. మనం ఇతరులకు ఏది మంచి అనుకుంటామో దాన్ని వారిపై రుద్దుతాం. అయితే ఇతరులు వారి వారి పరణామదశలు, స్వభావాలను బట్టి స్పందిస్తుంటారు. ఈ విధానములో ఒక స్థితిలో ఘర్షణ తప్పదు. కావున లోకోద్ధరణ కార్యక్రమ నిర్వహణలో ఘర్షణలు పెంచడం, మనం అశాంతికి గురి అయి, అశాంతినే లోకానికి పంచడం జరుగుతుంది. ఇతరులను ఉద్ధరించే గురువులము అనుకోవడం అహంకారమవడం వల్ల, ఇట్టి వారు చేపట్టే చర్యలకు వైఫల్యం, అలజడియే ఫలితము. వీనిలో ఇరుక్కుని పోయేవాడు ఇతరులకు ఎట్టి తోడ్పాటును ఈయగలడు?.
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
09 Dec 2021
No comments:
Post a Comment