వివేక చూడామణి - 164 / Viveka Chudamani - 164


🌹. వివేక చూడామణి - 164 / Viveka Chudamani - 164🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -11 🍀

536. ఎట్టి నాశనంలేని స్థిరమైన ఆనందాన్ని పొంది సాధకుడు ఎట్టి పరిస్థితులలోనూ దుఃఖము మరియు జ్ఞానేంద్రియాల వస్తు సముదాయము ఎడల కోర్కెలతో బాధపడకుండా అన్ని బంధనాలకు వ్యక్తి వ్యతిరేఖతలకు అతీతుడై ఎల్లపుడు ఆత్మతో ఆటలాడగలడు.

537. ఒక చంటి బిడ్డ ఆకలి, శారీరక బాధలు మరచి ఆట వస్తువులతో ఆటలాడుతాడో, అలానే ఆత్మను తెలుసుకొన్న వ్యక్తి ‘నేను’ ‘నాది’ అనే భేదము లేకుండా ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తాడు.

538. బ్రహ్మాన్ని తెలుసుకొన్న వ్యక్తులు తమ ఆహారాన్ని ఎలాంటి ఆదుర్దా, ఎలాంటి అవమానము లేకుండా బిచ్చమెత్తుకొని తీసుకుంటారు. వారు త్రాగే నీరు నది ప్రవాహముల నుండి గ్రహిస్తారు. వారు స్వేచ్ఛగా స్వతంత్రముగా జీవిస్తారు. వారు ఎట్టి భయభీతులు లేకుండా అడవులలో, శ్వశానాలలో నిద్రిస్తారు. వారు దుస్తులతో పనిలేకుండా నగ్నంగా జీవిస్తారు. అందువలన వారు బట్టలు ఉతుకుట, ఆరబెట్టుట వంటి పనులు చేయవలసిన పనిలేదు. నేల మీదే వారు పడుకుంటారు. వారు వేదాంత చర్చలలో మునిగి తేలుతుంటారు. వారు తమ సమయమంతా బ్రహ్మానంద స్థితిలో బ్రహ్మములో గడుపుతారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 164 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 32. I am the one who knows Brahman -11🌻

534. Satisfied with undiluted, constant Bliss, he is neither grieved nor elated by senseobjects, is neither attached nor averse to them, but always disports with the Self and takes pleasure therein.

537. A child plays with its toys forgetting hunger and bodily pains; exactly so does the man of realisation take pleasure in the Reality, without ideas of "I" or "mine", and is happy.

538. Men of realisation have their food without anxiety or humiliation by begging, and their drink from the water of rivers; they live freely and independently, and sleep without fear in cremation grounds or forests; their clothing may be the quarters themselves, which need no washing and drying, or any bark etc., the earth is their bed; they roam in the avenue of the Vedanta; while their pastime is in the Supreme Brahman.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

No comments:

Post a Comment