మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 117
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 117 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 2 🌻
లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము ఈ సాగరమే వాసుదేవుడు. ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము.
దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు. జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు.
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
11 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment