వివేక చూడామణి - 165 / Viveka Chudamani - 165


🌹. వివేక చూడామణి - 165 / Viveka Chudamani - 165 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -12 🍀

539. ఆత్మను తెలుసుకొన్న వారు ఎలాంటి బాహ్య దుస్తులను ధరించరు. వారు బాహ్య వస్తువులకు అతీతముగా తమ శరీరమునకు ఎట్టి గుర్తింపుతో పనిలేకుండా ఉంటారు. బాహ్య వస్తు సముదాయములను వారు కోరకుండా ఎవరైన ఇచ్చినపుడు వాటిని తమ అవసరాలకు మాత్రమే చిన్న పిల్లల వలె వాడుకుంటారు. పిల్లలు వస్తువులతో ఆడుకున్న తరువాత వాటిని వదలివేసి వాటిని గూర్చి మరచిపోతారు. అలానే జ్ఞానులు జీవిస్తారు.

540. అంతరిక్ష సంబంధమైన జ్ఞాన ప్రపంచములో స్థిరపడి ఆత్మను తెలుసుకొన్న వాడు కొన్ని సార్లు పిచ్చివానిగా, కొన్ని సార్లు చిన్న పిల్ల వానిగా, మరికొన్ని సార్లు దయ్యాల్లాగా ఎలాంటి దుస్తులు లేకుండా, శరీరాన్ని నగ్నముగా ఉంచుకొని మరికొన్ని సార్లు దుస్తులు ధరించి, మరికొన్ని సార్లు చెట్ల ఆకులతో ఇలా తన ఇష్టం వచ్చినట్లు బాహ్యముగా కనబడుతూ, అంతరములో బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతుంటారు.

541. సాధువు ఒంటరిగా జీవిస్తూ, ప్రాపంచిక వస్తు
సముదాయమును ఏవిధమైన కోరిక, ఆపేక్ష లేకుండా అనుభవిస్తుంటారు. ఎల్లపుడు తన ఆత్మలోనే, ఆత్మతోనే ఉంటూ అన్నింటిలో తానే అయి జీవిస్తాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 165 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 32. I am the one who knows Brahman -12🌻

539. The knower of the Atman, who wears no outward mark and is unattached to external things, rests on this body without identification, and experiences all sorts of sense-objects as they come, through others’ wish, like a child.

540. Established in the ethereal plane of Absolute Knowledge, he wanders in the world, sometimes like a madman, sometimes like a child and at other times like a ghoul, having no other clothes on his person except the quarters, or sometimes wearing clothes, or perhaps skins at other times.

541. The sage, living alone, enjoys the sense-objects, being the very embodiment of desirelessness – always satisfied with his own Self, and himself present at the All.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

No comments:

Post a Comment