శ్రీ శివ మహా పురాణము - 489


🌹 . శ్రీ శివ మహా పురాణము - 489 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 38

🌻. వివాహ మండపము - 3 🌻

విశ్వకర్మ కవచములతో, శ్రేష్ఠ రత్నములతో ఒప్పారు లోకపాలురను, దేవతలనందరినీ వాస్తవమేనా యున్నట్లు నిర్మించెను (22). మరియు భృగువు మొదలగు తపోనిష్ఠులగు ఋషులందరినీ, ఇతరులగు ఉపదేవతలను, సిద్ధులను బొమ్మలరూపములో ప్రదర్శించెను (23).

గరుడులను పేరుగల గణములందరితో గూడియున్న కృత్రిమ విష్ణువు నిర్మింపబడి యుండెను. ఆ బొమ్మ మహాశ్చర్యమును కలిగించెను (24). అదే విధముగా వేదములచే, ప్రజాపతులచే, మరియు సిద్ధులచే చుట్టువారబడి సూక్తములను పఠించుచున్న నాయొక్క కృత్రిమ శిల్పము కూడా అచట నిర్మింపబడి యుండెను. ఓ నారదా! అదేవిధముగా, ఐరావత గజమునధిష్ఠించి పూర్ణచంద్రుని బోలియున్న కృత్రిమ ఇంద్రుడు తన సైన్యముతో గూడి యున్నట్లు నిర్మింపబడెను. (25)

ఓ దేవర్షీ! ఇన్ని మాటలేల? హిమవంతునిచే ప్రేరితుడైన విశ్వకర్మ దేవ సమాజమునంతనూ అచట అనతికాలములో నిర్మించెను (27). దివ్యమగు రూపము గలది, అనేకములగు అచ్చెరువులతో గూడియున్నది, చాల పెద్దది, దేవతలను కూడ మోహింప జేయునది అగు ఇట్టి మండపమును విశ్వకర్మ నిర్మించెను (28). తరువాత హిమవంతుని ఆజ్ఞచే మహాబుద్ధిశాలియగు విశ్వకర్మ, దేవతలు మొదలగు వారి నివాసము కొరకై ప్రయత్నపూర్వకముగా ఆయా లోకములను నిర్మించెను (29).

ఆ మండపము వద్ద గొప్పగా వెలుగొందే, పరమాద్భుతములైన సుఖకరములైన, దివ్యములగు పెద్ద ఆసనములను వారికొరకు విశ్వకర్మ నిర్మించెను (30). మరియు నాతడు అద్భుతము, గొప్ప ప్రకాశముతో కూడినది అగు కృత్రిమ సత్యలోకమును స్వయంభువునగు నా నివాసము కొరకు క్షణములో నిర్మించెను (31).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

No comments:

Post a Comment