గీతోపనిషత్తు -289


🌹. గీతోపనిషత్తు -289 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 16-3

🍀 16-3. సమస్తమును నేనే ! - సృష్టి యందలి అన్ని వస్తువుల యందు దైవమే నిండి యున్నపుడు దైవమును చూడక, ఇతరము చూచుట అజ్ఞానము. దైవమునే చూచుట రాజవిద్య. ఎంత తెలిసిన వానికైనను ప్రకృతిచే ఆవరింపబడిన ఈశ్వరుని దర్శనము చేయుటకు దీక్ష కావలెను. ఈశ్వరు నాశ్రయించియే ప్రకృతి అనేక విధములుగ ఆవిర్భవించు చున్నది. అట్టి అనేక మందు ఏకత్వమును దర్శించుట అనుక్షణ ప్రయత్నముననే సాధ్యము. ఎందరో మునులు, ఋషులు క్రతువుల యందు, యజ్ఞముల యందు నిమగ్నమై, అచటనే తిరుగాడుచున్న కృష్ణ పరమాత్మను చూడలేకపోయిరి. 🍀

అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |
మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16

తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.

వివరణము : పురుషుడు ధరించు లుంగీ, స్త్రీ ధరించు చీరలో యున్నది పత్తియే యని గుర్తువచ్చునా? వచ్చుట లో దృష్టి, ఇట్టి లో దృష్టి లేకుండ ఎన్ని యజ్ఞములు చేసినను, యాగములు చేసినను, ఈశ్వర సాన్నిధ్యము లభింపదు. సృష్టి యందలి అన్ని వస్తువుల యందు దైవమే నిండి యున్నపుడు దైవమును చూడక, ఇతరము చూచుట అజ్ఞానము. దైవమునే చూచుట రాజవిద్య.

ఎంత తెలిసిన వానికైనను ప్రకృతిచే ఆవరింపబడిన ఈశ్వరుని దర్శనము చేయుటకు దీక్ష కావలెను. ఈశ్వరు నాశ్రయించియే ప్రకృతి అనేక విధములుగ ఆవిర్భవించు చున్నది. అట్టి అనేక మందు ఏకత్వమును దర్శించుట అనుక్షణ ప్రయత్నముననే సాధ్యము. ఎందరో మునులు, ఋషులు క్రతువుల యందు, యజ్ఞముల యందు నిమగ్నమై, అచటనే తిరుగాడుచున్న కృష్ణ పరమాత్మను చూడలేకపోయిరి. కారణము, క్రతు ద్రవ్యములను, మంత్రములను, స్వాహాకారములను, ఓషధులను, అగ్ని జ్వాల లను, హుతకార్యమును ఈశ్వరునిగ దర్శింపక పోవుటయే!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

No comments:

Post a Comment