మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 120


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 120 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 5 🌻

మనం చేయవలసినది, అందులకే ఆ స్వామిని ప్రార్థిస్తూ, ఆర్తులగు జీవులకు మనవంతు సేవనందించడమే. ఆ దిశలో తమ ద్వారా ఈ పని అవడమే కాని, తమ వలన కాదని మరచిపోరాదు. తమ ద్వారా వాసుదేవుడు ఎంత, ఏ విధంగా చేయ సంకల్పిస్తాడో అదే జరుగుతుంది. అపుడు లోకకల్యాణానికై మనం చేసే సేవ అంతర్యామి ఆరాధనమై, వానికి ప్రీతి గొల్పుతుంది. మనల్ని ఉద్ధరిస్తుంది.

శ్రీకృష్ణుడు, మున్నగు అవతారమూర్తులే లోకకల్యాణమునకై తమ వంతు కర్తవ్యాన్ని మాత్రమే ఆచరించామని తృప్తిగా భావించారు. కావున తేలినదేమనగా లోకోద్ధరణ భావము బంధము. లోక కల్యాణమునకై కర్తవ్యాచరణము మోక్షము, మనకు ఆదర్శము. ఇందు మనం నిలబడేట్లు మన గురువులు మనలను ఆశీర్వదింతురు గాక..

....✍️ మాస్టర్ ఇ.కె.🌻


🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

No comments:

Post a Comment