వివేక చూడామణి - 168 / Viveka Chudamani - 168


🌹. వివేక చూడామణి - 168 / Viveka Chudamani - 168🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -15 🍀

548. అదే విధముగా అజ్ఞానులైన ప్రజలు బ్రహ్మాన్ని తెలుసుకొన్న వానిని అతడు శారీరక బంధనాలు అన్నింటికి అతీతముగా ఉన్నపుడు అతనికి శరీరము ఉన్నప్పటికి అది కేవలము పైకి కనబడేది మాత్రమేనని గ్రహించలేకున్నారు.

549. యోగి నిజానికి తాను తన శరీరమును వదలి శాంతిని పొందుచున్నాడు. ఎలా అయితే పాము తన కుభుసమును విడిచి చరించు చున్నదో అలానే యోగి తన ప్రజ్ఞలో ఉంటూ శరీరమును అటూ ఇటూ తన జ్ఞాన ప్రజ్ఞతో అవసరాన్ని అనుగుణంగా కదిలించుచున్నాడు.

550. ఏవిధముగా చెట్టు యొక్క కాండము చెట్టు నుండి లభించే శక్తి వలన పైకి, ప్రక్కలకు పెరుగుచున్నదో అలానే యోగి యొక్క శరీరము తన యొక్క గత జన్మల సంస్కారాల ఫలితముగా వివిధములైన అనుభవములకు లోనగుచున్నది. అలానే వర్తమానము భవిష్యత్తుకు కారణమగుచున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 168 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -15 🌻

548. Similarly, ignorant people look upon the perfect knower of Brahman, who is wholly rid of bondages of the body etc., as possessed of the body, seeing but an appearance of it.

549. In reality, however, he rests discarding the body, like the snake its slough; and the body is moved hither and thither by the force of the Prana, just as it listeth.

550. As a piece of wood is borne by the current to a high or low ground, so is his body carried on by the momentum of past actions to the varied experience of their fruits, as these present themselves in due course.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

No comments:

Post a Comment