07-JANUARY-2022 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 07, జనవరి 2022 శుక్రవారం, బృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 140 / Bhagavad-Gita - 140 - 3-21🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 537 / Vishnu Sahasranama Contemplation - 537 🌹
4) 🌹 DAILY WISDOM - 215🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 54🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 120🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 336-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 336-1🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*బృగు వాసరే, 07, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 4 🍀*

*నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని |*
*బ్రహ్మాదయో నమన్తే త్వాం జగదానందదాయిని 7*
*విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే |*
*ఆర్తహంత్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే సదా 8*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,  
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల పంచమి 11:11:54
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: పూర్వాభద్రపద 30:20:04
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: వ్యతీపాత 13:11:58 వరకు
తదుపరి వరియాన
కరణం: బాలవ 11:14:54 వరకు
సూర్యోదయం: 06:47:53
సూర్యాస్తమయం: 17:56:36
వైదిక సూర్యోదయం: 06:51:45
వైదిక సూర్యాస్తమయం: 17:52:43
చంద్రోదయం: 10:40:31
చంద్రాస్తమయం: 22:40:39
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కుంభం
వర్జ్యం: 12:44:44 - 14:20:40
దుర్ముహూర్తం: 09:01:38 - 09:46:13
మరియు 12:44:32 - 13:29:07
రాహు కాలం: 10:58:39 - 12:22:15
గుళిక కాలం: 08:11:29 - 09:35:04
యమ గండం: 15:09:25 - 16:33:00 
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:44
అమృత కాలం: 22:20:20 - 23:56:16
మరియు 26:12:48 - 27:52:12
ధ్వాo క్ష యోగం - ధన నాశనం, 
కార్య హాని 30:20:04 వరకు తదుపరి
ధ్వజ యోగం - కార్య సిధ్ధి
పండుగలు : స్కంద షష్ఠి, Skanda Sashti
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 140 / Bhagavad-Gita - 140 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 21 🌴*

*21. యద్ యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జన: |*
*స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||*

🌷. తాత్పర్యం :
*మహానియుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును.*

🌷. భాష్యము :
స్వీయాచరణము ద్వారా జనులకు భోధ చేయగల నాయకుడు సామాన్యజనులకు సర్వదా అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేయువాడైనచో ధూమపానము చేయవద్దని జనులకు భోధను చేయలేడు. విద్యను భోధించుటకు పూర్వమే గురువు చక్కని నడవడిక అలవరచుకొనవలెనని శ్రీచైతన్యమహాప్రభువు తెలిపిరి. ఆ విధముగా చేయువాడు ఆచార్యుడు లేక ఉత్తమగురువని పిలువబడును. 

కనుక సామాన్యజనులకు భోధించుట కొరకై గురువైనవాడు శాస్త్రనియమములను చక్కగా పాటింపవలెను అంతియేగాక శాస్త్రనియములకు విరుద్ధములైన నియమములను అతడెన్నడును తయారు చేయరాదు. మనుసంహిత వంటి పలు గ్రంథములు మానవాళి అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. నాయకుడైనవాని భోధలు అట్టి శాస్త్రనియమములపై ఆధారపడియుండవలెను. తన ఉన్నతిని వాంచించువాడు మహాత్ములైనవారు ఆచరించు ప్రామాణిక నియమములను చక్కగా పాటింపవలెను. 

మహాభక్తుల మార్గము అనుసరనీయమనియు మరియు ఆత్మానుభవమార్గమున పురోగతికి అదియే సరియైన విధానమనియు శ్రీమద్భాగవతము సైతము ద్రువీకరింపచు చున్నది. దేశమనేలెడి రాజు, జన్మనొసగిన తండ్రి, పాటశాల యందు విద్య నేర్పెడి ఉపాధ్యుయుడు జనసామన్యమునకు నాయకుల వంటివారు. తమపై ఆధారపడిన వారి యెడ అట్టి సహజనాయకులు గొప్ప బాధ్యతను కలిగియున్నారు. కనకనే నీతి మరియు తత్త్వసూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు వారు నిపుణులై యుండవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 140 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 21 🌴*

*21. yad yad ācarati śreṣṭhas tat tad evetaro janaḥ*
*sa yat pramāṇaṁ kurute lokas tad anuvartate*

🌷Translation :
*Whatever action a great man performs, common men follow. And whatever standards he sets by exemplary acts, all the world pursues.*

🌷 Purport :
People in general always require a leader who can teach the public by practical behavior. A leader cannot teach the public to stop smoking if he himself smokes. Lord Caitanya said that a teacher should behave properly before he begins teaching. 

One who teaches in that way is called ācārya, or the ideal teacher. Therefore, a teacher must follow the principles of śāstra (scripture) to teach the common man. The teacher cannot manufacture rules against the principles of revealed scriptures. The revealed scriptures, like Manu-saṁhitā and similar others, are considered the standard books to be followed by human society. Thus the leader’s teaching should be based on the principles of such standard śāstras. One who desires to improve himself must follow the standard rules as they are practiced by the great teachers. 

The Śrīmad-Bhāgavatam also affirms that one should follow in the footsteps of great devotees, and that is the way of progress on the path of spiritual realization. The king or the executive head of a state, the father and the schoolteacher are all considered to be natural leaders of the innocent people in general. All such natural leaders have a great responsibility to their dependents; therefore they must be conversant with standard books of moral and spiritual codes.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 537 / Vishnu Sahasranama Contemplation - 537 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 537. కృతాన్తకృత్, कृतान्तकृत्, Kr‌tāntakr‌t 🌻*

*ఓం కృతాన్తకృతే నమః | ॐ कृतान्तकृते नमः | OM Kr‌tāntakr‌te namaḥ*

కృతాన్తకృత్, कृतान्तकृत्, Kr‌tāntakr‌t

*కృతస్యాన్తం కరోతీతి కృతాన్తం కృతన్తీతివా ।*
*కృతాన్తకృతిది ప్రోక్తో విద్వద్భిః పరమేశ్వరః ॥*

*తనచే నిర్మించబడిన జగత్తునకు ప్రళయకాలమున అంతము కలిగించువాడు. లేదా అంతము అనగా మృత్యువును మోక్షదాతగా రూపుమాపు పరమేశ్వరుడు కృతాన్తకృత్.*

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
ఉ. విశ్వభవస్థితి ప్రళయవేళలయందు వికారసత్త్వమున్‍
     విశ్వము నీవ యీ నిఖిలవిశ్వము లోలి సృజింతు విందిరా
     ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
     శాశ్వతలీల లిట్టి వని సన్నుతి సేయఁగ మాకు శక్యమే? (436)

ఓ లక్ష్మీవల్లభా! ఈ ప్రపంచం సృష్టించేదీ, రక్షించేదీ, లయం చేసేదీ నీవే! సమస్తమూ నీవై ఈ సమస్త లోకాలనూ మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్యస్వరూపా! దేవ దేవా! అంతులేని నీ వింత లీలలు ఇంతటివి, ఇటువంటివి అని వర్ణించడానికి మాకు చేతనవుతుందా?

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 537🌹*

*🌻 537. Kr‌tāntakr‌t 🌻*

*OM Kr‌tāntakr‌te namaḥ*

कृतस्यान्तं करोतीति कृतान्तं कृतन्तीतिवा ।
कृतान्तकृतिदि प्रोक्तो विद्वद्भिः परमेश्वरः ॥

Kr‌tasyāntaṃ karotīti kr‌tāntaṃ kr‌tantītivā,
Kr‌tāntakr‌tidi prokto vidvadbhiḥ parameśvaraḥ.

*During annihilation, He brings the anta or end of everything that is kr‌ta or created by Him. Or He by bestowing liberation, has the ability to release one from the cycle of death and birth.*

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
यत्र निर्विष्टमरणं कृतान्तो नाभिमन्यते ।
विश्वं विध्वंसयन्वीर्य शौर्यविस्फूर्जितभ्रुवा ॥ ५६ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Yatra nirviṣṭamaraṇaṃ kr‌tānto nābhimanyate,
Viśvaṃ vidhvaṃsayanvīrya śauryavisphūrjitabhruvā. 56.

Simply by expansion of His eyebrows, invincible time personified can immediately vanquish the entire universe. However, formidable time does not approach the devotee who has taken complete shelter at Your lotus feet.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ kr‌tajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśr‌ṃgaḥ kr‌tāntakr‌t ॥ 57 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 215 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 2. A Thing that Changes cannot Perceive Change by Itself 🌻*

*We begin to feel there must be something above this world. This was what the great poets and the sages of the Vedas felt. Everything seems to be transitory, moving, and in a state of flux. There is change in nature, change in human history, change in our own mental and biological constitution, change in even the solar system, the astronomical setup of things. Everything is changing. The perception of change is something very important for us to consider. How do we know that things are changing, that things are moving or are transitory?*

*There is a logical peculiarity, a significance and a subtlety at the back of this ability on our part to perceive change and transition in things. A thing that changes cannot perceive change by itself. Change cannot know change. Only that which does not change can know that there is change. This is a very important point at the rock bottom of our thinking that we have to recognise. If everything is changing, who is it that is telling us that everything is changing? Are we also changing with the things that change? If that is the case, how do we come to know that all things are changing?*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 54 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 41. అహంకార వలయము - 2 🌻*

*అహంకారినెట్లు గుర్తించవలెనో తెలుసుకొనుము. అతడు ఎట్టి సలహాలను పాటింపడు. ఏదియు తన తప్పని ఒప్పుకొనడు. తానేమి చేసినను ఒప్పే, తప్పు ఇతరులది. ఇట్టి అహంకారులను గుర్తించి వారినుండి తప్పించుకొని పనులు చేసుకొనుటయే సజ్జనుల కర్తవ్యము. కారణము లేకయే మా బృందసభ్యుని అహంకారులు ద్వేషింతురు. అవమానింప జూతురు. అతడు చేయు నిర్మలమైన బోధనలను అవహేళన చేయుదురు. అతడు వెలుగునకు ప్రతినిధి కావున తెలియకయే వారికి అతని యందు భయమేర్పడి భయము ద్వేషముగ మారును. అతని ఉనికి వారికి అసౌకర్య మనిపించును. సంఘమున అతని పెరుగుదల వారి ఈర్ష్యను రగుల్కొలుపును.*

*అతనిని (మా సోదరుని) తమ వానిగ చేసుకొనుటకు ప్రయత్నింతురు. కుదరనిచో కష్టపెట్టుదురు. ఇట్టి అహంకారులు సంఘమున పెరుగకుండుటకు విద్యాలయములే సరియైన పరిష్కారములు. అధ్యాపకులు నిరహంకారులై విద్యార్థులను నిరహంకారులుగ చిన్నతనము నుండియు తయారుచేయవలెను. పిల్లలకు అహంకారము వలన కలుగు కష్టనష్టములను తెలియ జేసి, సంఘమున అహంకారులను గుర్తించు తెలివినిచ్చి కాపాడ వలెను. ప్రకృతి నిర్వర్తించుచున్న రసాయనమునకు సంబంధించిన వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, మానవ నిర్మాణ శాస్త్రము చిన్నతనము నుండి బోధించి వినయవంతులను చేయవలెను. పిల్లలను స్వంత ముగ ఆలోచించు అవకాశమును వీలున్నంత పెంపొందింపవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 120 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు అదృశ్యమయినపుడే సత్యం వుంటుంది. నువ్వు లేనప్పుడే పరవశం వుంటుంది. నువ్వు పూర్తిగా వున్నపుడు ఏమీ వుండదు. మనం శూన్యంగా వున్నపుడే బహుమానం అందుతుంది. 🍀*

*గొప్పది ఏదయినా ఉనికి యిచ్చిన బహుమానమే. అది మనం సాధించింది కాదు. వాస్తవానికి మనమక్కడ లేనపుడు అది జరుగుతుంది. నువ్వు లేనప్పుడే ప్రేమ వుంటుంది. నువ్వు అదృశ్యమయినపుడే సత్యం వుంటుంది. నువ్వు లేనప్పుడే పరవశం వుంటుంది. నువ్వు పూర్తిగా వున్నపుడు ఏమీ వుండదు. ఏమీ జరగదు. బహుమానం అందుతూనే వుంటుంది. కానీ దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా వుండవు. అహం స్వీకరించడానికి సిద్ధపడదు.*

*మనం శూన్యంగా వున్నపుడే బహుమానం అందుతుంది. ఉనికి లోభి కాదు. అది యిస్తుంది. చాలా యిస్తుంది. అది ప్రతిదాన్నీ యివ్వడానికి యిష్టపడుతుంది. మనం స్వీకరించడానికి సిద్ధంగా వుండం. మనలో స్థలముండదు. కాబట్టి నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవడానికి సిద్ధపడు. అప్పుడు సరైన మార్గంలో వుంటావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 336-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 336 -1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*

*🌻 336-1. 'వింధ్యాచల నివాసినీ' 🌻* 

*వింధ్య పర్వతము నందు నివసించునది శ్రీదేవి అని అర్థము. వింధ్య పర్వతమందున్న శ్రీదేవి నందాదేవిగా విలసిల్లుచున్నది. నందాదేవి యశోదా నందగోపులకు అష్టమ గర్భముగ జనించినది. నందునకు పుట్టుట వలన నందాదేవి అని పేరు గాంచినది. కృష్ణుని బదులుగ ఆమె మధుర యందలి కారాగృహమున నున్న దేవకీ వసుదేవుల వద్దకు వసుదేవుని ద్వారా చేరినది. కంసుడు ఆమెను సంహరింప పూనగ ఆకాశమున కెగిరి అటుపైన తన శక్తిని అష్టాదశ పీఠములుగ భరత భూమినందు యేర్పరచినది. నందాదేవిగ వింధ్యా చలము చేరినది.*

*మదమును హరించు దేవతగ నందాదేవి వింధ్యాచల మందు వసించి యున్నది. మదమును జయించినవారే ఆనందముగ నుండ గలరు. మదముగలవారు ఈర్ష్యాద్వేషములు, కామక్రోధములు, మత్సరములతో బాధ పడుచుందురు. మదము గలవారికి సుఖము లేదు. శాశ్వతమగు సుఖము, ఆనందము కలుగవలె నన్నచో మద మత్సరములు నశింపవలెను. ఆర్తితో, శ్రద్ధాభక్తులతో నందాదేవిని ఆరాధించువారికి శ్రీమాత ఆనందరూపిణిగ సాన్నిధ్యమిచ్చి శాశ్వత ఆనందమున నిలుపును. అపుడు వారు ఆనందమయ లోకమున వసింతురు. నందగోపుడు ఆనందమయలోక పాలకుడు. గోపకుడై జనించి శ్రీమాత ఆవిర్భావమునకు సహకరించెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 336-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*

*🌻 336-1. Vindhyācala-nivāsinī विन्ध्याचल-निवासिनी (336) 🌻*

*She lives in Vindhyā mountains. In Durgā Saptasati (Seven hundred verses like Bhagavad Gīta and is a part of Mārkaṇḍeya Purāṇa) XI.41, She says “I will be born in the house of Nandagopa (father of Kṛṣṇa) and will live in Vindhyā mountains, during which time I will kill these two demons (two demons called Śumba and Niśumba)”.*

*This verse is a definite clue identifying Kṛṣṇa as Lalitāmbikā. This could be the reason for various nāma-s in this Sahasranāma identifying Her with Viṣṇu. There are certain instances where She is said to be the sister of Viṣṇu. In this Sahasranāma, nāma 280 says that She is the sister of Padmanābha, one of many names.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment