శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 336-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 336 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 336-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 336 -1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀


🌻 336-1. 'వింధ్యాచల నివాసినీ' 🌻

వింధ్య పర్వతము నందు నివసించునది శ్రీదేవి అని అర్థము. వింధ్య పర్వతమందున్న శ్రీదేవి నందాదేవిగా విలసిల్లుచున్నది. నందాదేవి యశోదా నందగోపులకు అష్టమ గర్భముగ జనించినది. నందునకు పుట్టుట వలన నందాదేవి అని పేరు గాంచినది. కృష్ణుని బదులుగ ఆమె మధుర యందలి కారాగృహమున నున్న దేవకీ వసుదేవుల వద్దకు వసుదేవుని ద్వారా చేరినది. కంసుడు ఆమెను సంహరింప పూనగ ఆకాశమున కెగిరి అటుపైన తన శక్తిని అష్టాదశ పీఠములుగ భరత భూమినందు యేర్పరచినది. నందాదేవిగ వింధ్యా చలము చేరినది.

మదమును హరించు దేవతగ నందాదేవి వింధ్యాచల మందు వసించి యున్నది. మదమును జయించినవారే ఆనందముగ నుండ గలరు. మదముగలవారు ఈర్ష్యాద్వేషములు, కామక్రోధములు, మత్సరములతో బాధ పడుచుందురు. మదము గలవారికి సుఖము లేదు. శాశ్వతమగు సుఖము, ఆనందము కలుగవలె నన్నచో మద మత్సరములు నశింపవలెను. ఆర్తితో, శ్రద్ధాభక్తులతో నందాదేవిని ఆరాధించువారికి శ్రీమాత ఆనందరూపిణిగ సాన్నిధ్యమిచ్చి శాశ్వత ఆనందమున నిలుపును. అపుడు వారు ఆనందమయ లోకమున వసింతురు. నందగోపుడు ఆనందమయలోక పాలకుడు. గోపకుడై జనించి శ్రీమాత ఆవిర్భావమునకు సహకరించెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 336-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻


🌻 336-1. Vindhyācala-nivāsinī विन्ध्याचल-निवासिनी (336) 🌻

She lives in Vindhyā mountains. In Durgā Saptasati (Seven hundred verses like Bhagavad Gīta and is a part of Mārkaṇḍeya Purāṇa) XI.41, She says “I will be born in the house of Nandagopa (father of Kṛṣṇa) and will live in Vindhyā mountains, during which time I will kill these two demons (two demons called Śumba and Niśumba)”.

This verse is a definite clue identifying Kṛṣṇa as Lalitāmbikā. This could be the reason for various nāma-s in this Sahasranāma identifying Her with Viṣṇu. There are certain instances where She is said to be the sister of Viṣṇu. In this Sahasranāma, nāma 280 says that She is the sister of Padmanābha, one of many names.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



07 Jan 2022

No comments:

Post a Comment