2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 303 🌹
3) 🌹. శివ మహా పురాణము - 501🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -131🌹
5) 🌹 Osho Daily Meditations - 120🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 179 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 179 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 08, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశ మంజరికా స్తోత్రం - 6 🍀*
*భిల్లీ మనోహర్యం సత్యమనంతం జగతాం విభుమ్ |*
*నారాయణాచలపతిం సత్యానందం తమాశ్రయే 10*
*చతుర్ముఖత్ర్యంబకాఢ్యం సన్నుతార్య కదంబకమ్ |*
*బ్రహ్మప్రముఖనిత్రానం ప్రధానపురుషాశ్రయే 11*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల షష్టి 10:44:00 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 31:11:47
వరకు తదుపరి రేవతి
యోగం: వరియాన 11:39:02 వరకు
తదుపరి పరిఘ
కరణం: తైతిల 10:47:00 వరకు
సూర్యోదయం: 06:48:08
సూర్యాస్తమయం: 17:57:13
వైదిక సూర్యోదయం: 06:52:01
వైదిక సూర్యాస్తమయం: 17:53:20
చంద్రోదయం: 11:18:23
చంద్రాస్తమయం: 23:32:36
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
వర్జ్యం: 16:16:24 - 17:55:48
దుర్ముహూర్తం: 08:17:20 - 09:01:57
రాహు కాలం: 09:35:24 - 10:59:02
గుళిక కాలం: 06:48:08 - 08:11:46
యమ గండం: 13:46:18 - 15:09:56
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:44
అమృత కాలం: 26:12:48 - 27:52:12
మరియు 27:44:00 - 40:48:40
ధూమ్ర యోగం - కార్య భంగం,
సొమ్ము నష్టం 31:11:47 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -303 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-4 📚*
*🍀 19-4. ద్వంద్వ స్థితులు - సత్యము తానైనపుడు అసత్యము కూడ తానేయని, పుణ్యము తానైనపుడు పాపము కూడ తానేయని, దేవతలు తానైనపుడు అసురులు కూడ తానే యని, తన సమగ్రత్వమును శ్రద్ధతో తెలుయుమని, విభజించి చూడవలదని, విభజనము వివరము అవగాహన కొరకేయని తెలియజెప్పు చున్నాడు. ఋషులు కాలానుసారము వర్తించుచున్న మంచి చెడుల ఆంతర్య మును దైవముగ ఎరిగి, తమవంతు కర్తవ్యమును నిర్వర్తించు చుందురు. వారు సృష్టి యందు ఏ విషయమును ద్వేషింపరు, వర్జింపరు, తిరస్కరింపరు. 🍀*
*తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |*
*అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19*
*తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.*
*వివరణము : అమృతత్వము తానైనపుడు మృత్యువు కూడ తానేనని, సత్యము తానైనపుడు అసత్యము కూడ తానేయని, పుణ్యము తానైనపుడు పాపము కూడ తానేయని, దేవతలు తానైనపుడు అసురులు కూడ తానే యని, తన సమగ్రత్వమును శ్రద్ధతో తెలుయుమని, విభజించి చూడవలదని, విభజనము వివరము అవగాహన కొరకేయని తెలియజెప్పు చున్నాడు.*
*పదునొకండవ (11) అధ్యాయమైన విశ్వరూప సందర్శనమున తన సమగ్ర దర్శనము కూడ అర్జునకందించినాడు. ఇది తెలిసిన ఋషులు కాలానుసారము వర్తించుచున్న మంచి చెడుల ఆంతర్య మును దైవముగ ఎరిగి, తమవంతు కర్తవ్యమును నిర్వర్తించు చుందురు. వారు సృష్టి యందు ఏ విషయమును ద్వేషింపరు, వర్జింపరు, తిరస్కరింపరు. అన్నిటి యందు అంతర్యామి దైవమును దర్శించుచు తమ కర్తవ్యమును తాము నిర్వర్తించుచు నుందురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 501 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 41
*🌻. వివాహ మండపము -1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మునీ! అపుడు విష్ణువు ఇతరులతో సంప్రదించి శంకరుని ఆజ్ఞను పొంది ముందుగా నిన్ను హిమవంతుని గృహమునకు పంపెను (1). ఓ నారదా! హరిచే ప్రేరితుడవైన నీవు సర్వేశ్వరునకు నమస్కరించి ముందుగా హిమవంతుని గృహమునకు ఆనందముతో వెళ్లితివి (2). ఓ మునీ! నీవచటకు వెళ్లి విశ్వకర్మచే రచింపబడిన నీ కృత్రిమ మూర్తిని గాంచి సిగ్గును, ఆశ్చర్యమును పొందితివి(3). మహార్షీ! అలసి యున్న నీవు విశ్వకర్మచే నిర్మింపబడిన నీయొక్క కృత్రిమ మూర్తిని చూస్తూ నిలబడి యుంటివి (4).
ఓ మునీ! నీవు ఆ హిమవంతుని యెక్క, రత్నములతో పొదుగబడినది, బంగరు కలశములతో కూడి యున్నది, అరటి చెట్లు మొదలగు అలంకారములతో మిక్కిలి శోభిల్లునది (5), వేయి స్తంభములు గలది, అనేక రంగులు గలది, పరమాశ్చర్య కరమైనది అగు వివాహ మండపమును ప్రవేశించి వేదికను చూచి విస్మయమును పొందితివి (6). ఓ నారదమునీ! అట్టి నీవు మనస్సులో గొప్ప విస్మయమును పొంది, జ్ఞానము తొలగుటచే విమోహితమైన బుద్ధి గలవాడవై ఆ పర్వతరాజుతో ఇట్లంటివి (7).
విష్ణువు మొదలగు దేవతలు వచ్చి యున్నారా యేమి? మరియు మహర్షులు, సిద్ధులు, ఉపసురులు అందరు విచ్చేసినారా? (8). మహాదేవుడు వృషభమునధిష్ఠించి గణములచే పరివేష్టింప బడిన వాడై వివాహము కొరకు వచ్చియున్నాడా యేమి? ఓ పర్వత రాజా! సత్యమును పలుకుము (9). ఓ మునీ! విస్మయముతో నిండిన మనస్సు గల నీ ఈ మాటను విని ఆ హిమవంతుడు నీతో సత్యవాక్యము నిట్లు పలికెను (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 131 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : పద్మావతి దేవి*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. ఉద్ధవుని గ్రహింపు 🌻*
*"చూచితిని, చూచితిని! సంసార మహాసముద్రము దాటుటనగా నేమో దర్శించితిని! ఆశ్రయించిన వారి నతడు రక్షించుట యెట్లో గమనించితిని. యోగుల హృదయమున నాతడెట్లుండునో గ్రహించితిని. అందరికిని చుట్టమనగా నెవరో తెలిసికొంటిని. మూడుకన్నులు గలవానికి గూడ అంతుపట్టని ఒంటరిగాడెవడో తెలిసికొంటిని. ముక్తిమార్గము చక్కగా దర్శించి సుఖము ననుభవించితిని."*
*సంసార సాగరము దాటుట యనగా జరుగుచున్న సంఘటనల నడుమనుండి వానిలో మునగక దర్శింపగలుగుటయే గాని , వానిని విడిచిపోవుటకు యత్నించుట కాదని, కృష్ణుని అవతారము వలన ఉద్ధవుడు గ్రహించెను.*
✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 120 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 120. JOY 🍀*
*🕉 Joy is the antidote to all fear. Fear comes if you don't enjoy life. If you enjoy life, fear disappears. 🕉*
*Be positive and enjoy more, laugh more, dance more, sing more. Become more and more cheerful, enthusiastic about small things, even very small things. Life consists of small things, but if you can bring the quality of cheerfulness to small things, the total will be tremendous. So don't wait for anything great to happen. Great things do happen it is not that they don't-but don't wait for the something great to happen. It happens only when you start living small, ordinary, day-today things with a new mind, with new freshness, with new vitality, with new enthusiasm. Then by and by you accumulate, and that accumulation one day explodes into sheer joy.*
*But one never knows when it will happen. One has just to go on collecting pebbles on the shore. The totality becomes the great happening. When you collect one pebble, it is a pebble. When all the pebbles are together, suddenly they are diamonds. That's the miracle of life. There are many people in the world who miss because they are always waiting for something great. It can't happen. It happens only through small things: eating your breakfast, walking, taking a bath, talking to a friend, just sitting alone looking at the sky or lying on your bed doing nothing. These small things are what life is made of. They are the very stuff of life. *
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 179 / Sri Lalita Sahasranamavali - Meaning - 179 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 179. దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ ।*
*జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ॥ 179 ॥ 🍀*
🍀 977. దశముద్రాసమారాధ్యా :
10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది
🍀 978. త్రిపురా :
త్రిపురసుందరీ
🍀 979. శ్రీవశంకరీ :
సంపదలను వశము చేయునది
🍀 980. ఙ్ఞానముద్రా :
బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట
🍀 981. ఙ్ఞానగమ్యా :
ఙ్ఞానము చే చేరదగినది
🍀 982. ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ :
ఙ్ఞాన చే తెలియబడు స్వరూపము కలిగినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 179 🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻 179. Dashamudra samaradhya tripura shrivanshankari*
*Gynanamudra gynanagamya gynanagyneya svarupini ॥ 179 ॥ 🌻*
🌻 977 ) Dasa mudhra samaradhya -
She who is worshipped by ten mudras(postures of the hand)
🌻 978 ) Thrpura sree vasankari -
She who keeps the goddess Tripura sree
🌻 979 ) Gnana mudhra -
She who shows the symbol of knowledge
🌻 980 ) Gnana gamya -
She who can be attained by knowledge
🌻 981 ) Gnana gneya swaroopini -
She who is what is thought and the thought
🌻 982 ) Yoni mudhra -
She who shows the symbol of pleasure
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranamam
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment