గీతోపనిషత్తు -303


🌹. గీతోపనిషత్తు -303 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-4 📚

🍀 19-4. ద్వంద్వ స్థితులు - సత్యము తానైనపుడు అసత్యము కూడ తానేయని, పుణ్యము తానైనపుడు పాపము కూడ తానేయని, దేవతలు తానైనపుడు అసురులు కూడ తానే యని, తన సమగ్రత్వమును శ్రద్ధతో తెలుయుమని, విభజించి చూడవలదని, విభజనము వివరము అవగాహన కొరకేయని తెలియజెప్పు చున్నాడు. ఋషులు కాలానుసారము వర్తించుచున్న మంచి చెడుల ఆంతర్య మును దైవముగ ఎరిగి, తమవంతు కర్తవ్యమును నిర్వర్తించు చుందురు. వారు సృష్టి యందు ఏ విషయమును ద్వేషింపరు, వర్జింపరు, తిరస్కరింపరు. 🍀

తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19

తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.

వివరణము : అమృతత్వము తానైనపుడు మృత్యువు కూడ తానేనని, సత్యము తానైనపుడు అసత్యము కూడ తానేయని, పుణ్యము తానైనపుడు పాపము కూడ తానేయని, దేవతలు తానైనపుడు అసురులు కూడ తానే యని, తన సమగ్రత్వమును శ్రద్ధతో తెలుయుమని, విభజించి చూడవలదని, విభజనము వివరము అవగాహన కొరకేయని తెలియజెప్పు చున్నాడు.

పదునొకండవ (11) అధ్యాయమైన విశ్వరూప సందర్శనమున తన సమగ్ర దర్శనము కూడ అర్జునకందించినాడు. ఇది తెలిసిన ఋషులు కాలానుసారము వర్తించుచున్న మంచి చెడుల ఆంతర్య మును దైవముగ ఎరిగి, తమవంతు కర్తవ్యమును నిర్వర్తించు చుందురు. వారు సృష్టి యందు ఏ విషయమును ద్వేషింపరు, వర్జింపరు, తిరస్కరింపరు. అన్నిటి యందు అంతర్యామి దైవమును దర్శించుచు తమ కర్తవ్యమును తాము నిర్వర్తించుచు నుందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Jan 2022

No comments:

Post a Comment