నిర్మల ధ్యానాలు - ఓషో - 120


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 120 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు అదృశ్యమయినపుడే సత్యం వుంటుంది. నువ్వు లేనప్పుడే పరవశం వుంటుంది. నువ్వు పూర్తిగా వున్నపుడు ఏమీ వుండదు. మనం శూన్యంగా వున్నపుడే బహుమానం అందుతుంది. 🍀

గొప్పది ఏదయినా ఉనికి యిచ్చిన బహుమానమే. అది మనం సాధించింది కాదు. వాస్తవానికి మనమక్కడ లేనపుడు అది జరుగుతుంది. నువ్వు లేనప్పుడే ప్రేమ వుంటుంది. నువ్వు అదృశ్యమయినపుడే సత్యం వుంటుంది. నువ్వు లేనప్పుడే పరవశం వుంటుంది. నువ్వు పూర్తిగా వున్నపుడు ఏమీ వుండదు. ఏమీ జరగదు. బహుమానం అందుతూనే వుంటుంది. కానీ దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా వుండవు. అహం స్వీకరించడానికి సిద్ధపడదు.

మనం శూన్యంగా వున్నపుడే బహుమానం అందుతుంది. ఉనికి లోభి కాదు. అది యిస్తుంది. చాలా యిస్తుంది. అది ప్రతిదాన్నీ యివ్వడానికి యిష్టపడుతుంది. మనం స్వీకరించడానికి సిద్ధంగా వుండం. మనలో స్థలముండదు. కాబట్టి నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవడానికి సిద్ధపడు. అప్పుడు సరైన మార్గంలో వుంటావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


07 Jan 2022

No comments:

Post a Comment