నిర్మల ధ్యానాలు - ఓషో - 136


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 136 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మౌళికంగా నీ గురించి నువ్వు స్పృహతో వుండాలి. నువ్వెవరో తెలుసుకోవాలి. నీకు చీకటి నించీ బయటకు రాగలిగిన సామర్థ్యం వుంది. సుదీర్ఘ నిద్ర నించీ బయటపడగిగే సామర్థ్యముంది. నువ్వు మేలుకున్న క్షణం జీవితం ఆశీర్వాదమవుతుంది. 🍀


మనం నిద్రపోతున్నామంటే అది సామాన్యంలో కాదు, రూపకార్థలో తీసుకోవాలి. మన మెవరమో మనకు తెలీదు. అట్లాంటప్పుడు మనం మేలుకొన్నామని ఎట్లా చెబుతాం? ఏది తప్పని సరో దాన్ని గురించి మనకు తెలీదు. మనకు తెలిసిందంతా చెత్త. మనకు చంద్రుని గురించి, సూర్యుడి గురించి భూమి గురించి, చరిత్ర, భౌగిళక శాస్త్రాల గురించి తెలుసు. కానీ మన గురించి మనకేమీ తెలీదు. తెలుసుకునే వాడెవడయితే వున్నాడో అతని గురించి మనకేమీ తెలీదు. నిజమైన చదువుకు అది ప్రాథమిక జ్ఞానం.

మౌళికంగా నీ గురించి నువ్వు స్పృహతో వుండాలి. నువ్వెవరో తెలుసుకోవాలి. నిన్ను ముందుకు రమ్మంటాను, నువ్వు బయటకు వెళ్ళతావు. నీకు చీకటి నించీ బయటకు రాగలిగిన సామర్థ్యం వుంది. వందల యేళ్ళ పాత అలవాట్ల నించి, సుదీర్ఘనిద్ర నించీ బయటపడగిగే సామర్థ్యముంది. నువ్వు మేలుకున్న క్షణం జీవితం నాట్యమవుతుంది. పాట అవుతుంది, పరవశమవుతుంది. ఆశీర్వాదమవుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


14 Feb 2022

No comments:

Post a Comment