శ్రీ మదగ్ని మహాపురాణము - 5 Sri Madagni Mahapuran - 5



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 5 / Agni Maha Purana  - 5 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 1
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. ప్రశ్నము - 2 🌻

బ్రహ్మవిద్య నాశనరహిత మగు పరవిద్య. అందుచే తత్ప్రతిపాదక మగు అగ్నే యపురాణము పరము. సర్వ దేవతలకును సుఖమును కలిగించు ఋగ్వేదాదికము అపర బ్రహ్మ. ఆపరబ్రహ్మను ప్రతిపాదించున దగుటచే దాని కాపేరు. అగ్ని చెప్పిన పురాణము అగ్నేయపురాణము. ఇది వేదముతో సమానమైనది. చదువువారికిని, వినువారికిని భుక్తిముక్తుల నొసగునది.

కాలాగ్ని స్వరూపుడును. జ్యోతిఃస్వరూపుడును, పరాత్పరమైన బ్రహ్మయు, జ్ఞాన- కర్మలచే పూడింపబడువాడును ఆగు విష్ణుదేవుని మునిసమేతుడై (విసిష్ఠుడు) ప్రశ్నించెను.

వసిష్ఠుడు పలికెను : సకల విద్యల సారమగు ఏ బ్రహ్మను గూర్చి తెలిసికొని నరుడు సర్వజ్ఞత్వమును పొందునో అట్టిదియు, సంసారసాగరమును దాటించుటలో నావయు, సర్వశ క్తమును అగు బ్రహ్మను గూర్చి చెప్పుము. 

అగ్ని పలికెను : విష్ణువు నైన నేనే కాలాగ్నిరుద్రుడను. సర్వస్వరూపమును, సర్వకారణమును, అతి ప్రాచీనమును అగు వద్యాసారమును గూర్చి నీకు చెప్పెదను.

మత్స్యకూర్మాది రూపములను ధరించిన నేను సృష్టికిని, ప్రలయమునకు, వంశములకను, మన్వంతరములకును, వంశాను చరితము మొదలగుదానికిని కారణ మైనవాడను (ముని ఋష్యాదుల వంశముల వర్ణనము వంశము. ప్రధాన రాజవంశముల వర్ణనము వంశాను చరితము)  పర, అపర అను ఈ రెండు విద్యలును విష్ణు స్వరూపములే. 

ఓ బ్రహ్మణా! ఋగ్యజస్సామాథర్వవేదములును, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను వేదాంగమూలారును, కోశము, మీమాంస, ధర్మ శాస్త్రము, పురాణము, న్యాయశాస్త్రము, అయుర్వేదము, సంగీతశాస్త్రము, ధనుర్వేదము, అర్థశాస్త్రము - ఇవన్నియు అపరవిద్య. చూడ శక్యము కానిదియు, పట్టుకొన శక్యము కానిదియు, గోత్రము గాని శాఖ గాని లేనిదియు, నిత్యమును అగు బ్రహ్మను బోధించు విద్య పరవిద్య, పూర్వము బ్రహ్మ దేవతల కెట్లు చెప్పెనో, విష్ణువు నా కెట్లు చెప్పెనో ఆ విధముగ మత్స్యాదిరూపములను ధరించిన జగత్కారణభూతు డగు విష్ణువును గూర్చి నీకు చెప్పెదను.

అగ్ని మహాపురాణములో 'ప్రశ్నము' అను ప్రథమాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Agni Maha Purana  - 5 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻. Chapter 1- Questioning - 2 🌻 

11. Being requested by the sages (I will also describe) (god) Viṣṇu in the form of the destructive Fire at the end of the world (who is) the effulgent Brahman (and) the most Supreme Being (who is) worshipped by means of knowledge and action (religious rites and so on).

Vasiṣṭḥa said:

12. O Brahman (Agni), point out to me the masterly way of crossing the ocean of mundane existence, by knowing the quintessence of which knowledge one becomes omniscient.

Agni said:

13. Viṣṇu is the destructive Fire at the end of the world (in the form of) Rudra (Siva). I shall tell you the essence of knowledge (in the form of) this Purāṇa, which represents all learning and is the cause of all things.

14. (Lord) Viṣṇu, who assumes the form of a fish, a tortoise (and other beings), is the cause of the primary creation, the secondary creation, the genealogy of the sages, the cycles of Manu-periods and the genealogy of the kings.

15-17. O Twice-born! (Lord) Viṣṇu (is the cause of) the two kinds of knowledge Parā (the superior) and Aparā (the inferior). Here the Aparā is represented by the Ṛgveda, Yajurveda, Sāmaveda, Atharvaveda, the six supplementary texts, (namely)—Śikṣā (phonetics), Kalpa (rules governing rituals), Vyākaraṇa (grammar), Nirukta (etymological science), (the science dealing with) the movement of the luminary bodies, Chandovidhāna (metrics), Mīmāṃsā (investigation of the interpretation of the ritual of the Vedas), Dhamaśāstra (law-books), Purāṇas (18 in number), Nyāya (logical philosophical system), Vaidya (medical science), Gāndharva (science of music), and Arthaśāstra (polity). The Parā-Vidyā (superior knowledge) is that through which the Brahman is known.

18. I shall narrate to you (that Purāṇa) which was told to me by ViṣṇU and the celestials by Brahmā and which deals with that invisible, incomprehensible, not having a cause for itself and eternal (form of Viṣṇu) which is the cause of the forms such as the fish and others.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


14 Feb 2022

No comments:

Post a Comment