విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 556 / Vishnu Sahasranama Contemplation - 556


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 556 / Vishnu Sahasranama Contemplation - 556 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 556. పుష్కరాక్షః, पुष्कराक्षः, Puṣkarākṣaḥ 🌻


ఓం పుష్కరాక్షాయ నమః | ॐ पुष्कराक्षाय नमः | OM Puṣkarākṣāya namaḥ

పుష్కరాక్షః, पुष्कराक्षः, Puṣkarākṣaḥ

వ్యాప్త్యర్థాదక్షతేర్ధాతోః పుష్కరోపపదాదణి ।
పుష్కరాక్షపదోత్పత్తి ర్వైయాకరణసమ్మతా ॥
యో హృదయపుణ్డరీకే స్వరూపేణ ప్రకాశతే ।
చిన్తతస్సన్నితి విష్ణుః పుష్కరాక్ష ఇతీర్యతే ॥


వ్యాపించు అను అర్థమును ఇచ్చు 'అక్షూ' (అక్ష్‍) ధాతువునుండి హృదయ పదము ఉపపదముగా 'అణ్' ప్రత్యయమురాగా పైవ్యుత్పత్తిననుసరించి 'పుష్కరాక్ష' పదము నిష్పన్నమగును. హృదయ పుష్కరము లేదా పద్మమునందు వ్యాపించియుండువాడుగనుక శ్రీ విష్ణువు పుష్కరాక్షః. లేదా హృదయ పుండరీకమునందు దర్శించబడువాడు. హృదయ పుండరీకమున ధ్యానించబడినవాడగుచు స్వస్వరూపముతో ప్రకాశించును.


:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::

తే. సత్త్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగఁ జిత్తంబు భవ్య మగును
హృదయపద్మంబునం దోలి నెఱుగఁబడిన, యట్టి నీకు నమస్కారమయ్య వరద! (428)

సత్త్వగుణంవల్ల మంచి భక్తి సంప్రాప్తిసుంది. భక్తితోకూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తియుక్తమైన పవిత్రహృదయ పద్మంలో భావించి సేవింపదగిన ఓ దేవదేవా! నీకు నమస్కారము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 556🌹

📚. Prasad Bharadwaj

🌻 556. Puṣkarākṣaḥ 🌻

OM Puṣkarākṣāya namaḥ

व्याप्त्यर्थादक्षतेर्धातोः पुष्करोपपदादणि ।
पुष्कराक्षपदोत्पत्ति र्वैयाकरणसम्मता ॥
यो हृदयपुण्डरीके स्वरूपेण प्रकाशते ।
चिन्ततस्सन्निति विष्णुः पुष्कराक्ष इतीर्यते ॥

Vyāptyarthādakṣaterdhātoḥ puṣkaropapadādaṇi,
Puṣkarākṣapadotpatti rvaiyākaraṇasammatā.
Yo hr‌dayapuṇḍarīke svarūpeṇa prakāśate,
Cintatassanniti viṣṇuḥ puṣkarākṣa itīryate.


The root 'akṣū' (akṣ) which has the meaning of pervading is added to the word puṣkara; so we get Puṣkarākṣaḥ which means He who is spread in the lotus of heart. Or since He is meditated upon in the lotus of the heart where He shines in His native effulgence.


:: श्रीमद्भागवते तृतीयस्कन्धे नवमोऽध्यायः ::

त्वं भक्तियोगपरिभावितहृत्सरोज आस्से श्रुतेक्षितपथो ननु नाथ पुंसाम् ।
यद्यद्धिया त उरुगाय विभावयन्ति तत्तद्वपुः प्रणयसे सदनुग्रहाय ॥ ११ ॥

O my Lord, Your devotees can see You through the ears by the process of bona fide hearing, and thus their hearts become cleansed, and You take Your seat there. You are so merciful to Your devotees that You manifest Yourself in the particular eternal form of transcendence in which they always think of You.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


14 Feb 2022

No comments:

Post a Comment