మైత్రేయ మహర్షి బోధనలు - 73
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 73 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 59. మేలుకొలుపు 🌻
ఈ భూమి ఘనీభవించుట పరిపూర్తి అయి స్థూల పదార్థము పరిమితి వరకు ఏర్పడినది. ఇక పరిణామమే శరణ్యము. పరిణామమున పదార్థమందలి ప్రజ్ఞ మేల్కాంచును. అట్టి మేలుకొలుపే ప్రస్తుత కర్తవ్యము. నిర్విరామముగ భూమిపై గల సమస్తమును మేల్కొలుపు చునేయున్నాము. మేలుకొలుపు వినుచున్న వారు మేల్కాంచుచునే యున్నారు. కాని పూర్వాభ్యాసము వలన మరల నిద్రలోనికి చను చున్నారు.
మేలుకొని యుండు అభ్యాసము చిరకాలము సాగవలెను. అపుడు నిద్రను కోరు స్వభావము అదృశ్యమగును. ఎడారిని నందనవనము చేయుట ప్రస్తుత కర్తవ్యమని మైత్రేయసంఘ సభ్యులెరుగుదురు. తదాశయ సిద్ధికై అహోరాత్రములు కృషి జరుగుచునే యున్నది.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
14 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment