విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 563 / Vishnu Sahasranama Contemplation - 563


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 563 / Vishnu Sahasranama Contemplation - 563🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 563. ఆదిత్యః, आदित्यः, Ādityaḥ 🌻


ఓం ఆదిత్యాయ నమః | ॐ आदित्याय नमः | OM Ādityāya namaḥ

ఆదిత్యః, आदित्यः, Ādityaḥ

ఆదిత్యాం కశ్యపాదిన్ద్రస్యానుజత్వేన యాచితః ।
దేవైర్వామనరూపేణ జాత ఆదిత్య ఉచ్యతే ॥

అదితికి కశ్యపుని వలన ఇంద్రునకు అనుజునిగా జన్మించినవాడు. వామనావతారమును స్వామి ఈ విధముగా స్వీకరించినందున ఆదిత్యః అని పిలువబడుతాడు.


:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::

వ. అని యిట్లు దేవకీదేవి విన్నవించిన నీశ్వరుండిట్లనియె, అవ్వా! నీవు దొల్లి స్వాయంభువ మన్వంతరంబునఁ బృశ్నియను పరమపతివ్రతవు, వసుదేవుండు సుతపుం డను ప్రజాప్తి, మీరిరువురును సృష్టికాలంబునం, బెంపున నింద్రియమ్బుల జయించి తెంపున వానగాలి యెండ మంచులకు సైరించి యేకలములయి దిని యే కలంకంబును లేక వేండ్రంబుగఁ బండ్రెండువేల దివ్యవర్షంబులు దపంబులు సేసిన నెపంబున మీ రూపంబులు మెరయనొజ నాజపంబులు సేసి, డాసి, పేర్చి, యర్చింప మీకు నాకుం గల రూపుఁ జూపి యేను 'దిరంబులగు వరంబులు వేఁడుం' డనిన మీరు నా మాయం బాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డయడ్డంబున దుర్గమం బగు నపవర్గంబు గోరక నా యీఁడు కొడుకు నడిగిన మెచ్చి యట్ల వరం బిచ్చి మీ కేను 'బృశ్నిగర్భుం'డన నర్భకుండ నయితి, మఱియును (131)

క. అదితుత్యుఁ గస్యపుఁడును నన, విదితుల రగు మీకుఁ గురుచవేషంబున నే నుదయించితి వామనుఁ డనఁ, ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవమునన్‍. (132)

క. ఇప్పుడు మూఁడవబామునఁ, దప్పక మీ కిరువురకును దనయుఁడ నైతిం జెప్పితిఁ బూర్వము మీయం, దెప్పటికిని లేదు జన్మమిటపై నాకున్‍. (133)

ఈ విధముగా విన్నవించిన దేవకీదేవితో ఈశ్వరుడైన మహా విష్ణువు ఇలా అన్నాడు. "అమ్మా! పూర్వము స్వాయంభువ మన్వంతరములో నీవు 'పృశ్ని' అనే మహా పతివ్రతవు. అప్పుడు వసుదేవుడు 'సుతపుడు' అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టికాలములో బ్రహ్మదేవుని ప్రేరణతో మహా తపస్సు చేశారు. ఇంద్రియములను జయించారు. గాలి, వాన, ఎండ, మంచు మొదలైనవి సహించారు. ఏకాకులై ఆకులు, అలములు తితి తీవ్రమైన మహా తపస్సును చేశారు. అలా పండ్రెండ్రు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశమానముగా వెలిగాయి. అలా నిష్ఠతో నా నామజపము చేసి నా తత్త్వాన్ని సమీపించగలిగారు. చక్కని రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్యస్వరూపాన్ని చూపి శ్రేష్ఠమైన వరాలు కోరుకొమ్మని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకొనలేదు. ఆ సమయములో నా మాయ మిమ్ములను ఆవరించినది. అప్పటికి మీకు బిడ్డలు లేరుగనుక మోహముతో నాతో సాటియైన కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అర్థించారు. సృష్టి, సంతానము పొందడం అనేది నా సంకల్పము గనుక నేను మీ కోరికకు మెచ్చుకొన్నాను. అలాగే వరమునిచ్చాను. నా సాటివాడు అంటూ వేరొకడు లేడు గనుక నేనే మీ దంపతులకు కుమారుడిగా జన్మించాను. అప్పుడు నా పేరు 'పృశ్నిగర్భుడు.'

"రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేరులతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపములో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు.

"మూడవ జన్మలో ఇప్పుడు పూర్వము నేనిచ్చిన మాటప్రకారము మీకు కుమారుడిగా పుట్టాను. ఇక మీయందు ఎప్పటికీ నా జన్మము లేదు."

39. ఆదిత్యః, आदित्यः, Ādityaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 563🌹

📚. Prasad Bharadwaj

🌻 563. Ādityaḥ 🌻


OM Ādityāya namaḥ

आदित्यां कश्यपादिन्द्रस्यानुजत्वेन याचितः ।
देवैर्वामनरूपेण जात आदित्य उच्यते ॥

Ādityāṃ kaśyapādindrasyānujatvena yācitaḥ,
Devairvāmanarūpeṇa jāta āditya ucyate.


One who was born as the younger brother of Indra to Aditi and Kaśyapa. Lord's incarnation as the Vāmana is such and hence He is Ādityaḥ.

(Revealing the secret behind His incarnation as Kr‌ṣṇa to Devakī and Vasudeva - Lord Viṣṇu explains) Since I found no one else as highly elevated as you in simplicity and other qualities of good character, I appeared in this world as Pr‌śnigarbha,

or one who is celebrated as having taken birth from Pr‌śni (and Sutapa). In the next millennium, I again appeared from the two of you, who appeared as My mother, Aditi, and My father, Kaśyapa. I was known as Upendra, and because of being a dwarf,

I was also known as Vāmana. O supremely chaste mother, I, the same personality, have now appeared of you both as your son for the third time. Take My words as the truth.

Continues....

🌹 🌹 🌹 🌹🌹


28 Feb 2022

No comments:

Post a Comment