నిర్మల ధ్యానాలు - ఓషో - 147


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 147 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం నీ నుంచి చెత్తా చెదారాన్ని వదలిస్తుంది. శూన్యం చేస్తుంది. నీలో స్థలమేర్పడుతుంది. వ్యక్తి సత్యాన్ని ఆహ్వానించాలి, ఎదురు చూడాలి. అంతకు మించి ఏమీ చెయ్యకూడదు. దాన్నే నేను ప్రార్థన అంటాను. 🍀


సత్యాన్ని ఆక్రమించలేం. ఆహ్వానించవచ్చు. అనంత సత్యానికి మనం ఆతిథ్యమివ్వవచ్చు. ఇది ఉనికికి సంబంధించిన చట్టం. దాన్నే నేను ధ్యానమంటాను. అది నీ నుంచి చెత్తా చెదారాన్ని వదలిస్తుంది. శూన్యం చేస్తుంది. అది నిన్ను ఖాళీ చెయ్యడం వల్ల నీలో స్థలమేర్పడుతుంది. అప్పుడు నువ్వు సున్నితంగా స్వీకరించే లక్షణంతో, స్పందించే గుణంతో ఎప్పుడూ అందుబాటులో వుంటావు.

అ లక్షణాలు నీలో అనురాగాన్ని నింపుతాయి. అజ్ఞాతమయిన దానికి నువ్వు ఆహ్వాన ద్వారమవుతావు. ఆ ఆహ్వానం నీకు సంపూర్ణత నిస్తుంది. వ్యక్తి అంతకు మించి ఏమీ చెయ్యకూడదు. ఆహ్వానించాలి, ఎదురుచూడాలి. దాన్నే నేను ప్రార్థన అంటాను. ఆహ్వానంలో గొప్ప విశ్వాసం వుంది. గొప్ప నమ్మకం మొగ్గ తొగుడుతుంది అదే అస్తిత్వానికి అంతిమ చట్టం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2022

No comments:

Post a Comment