2) 🌹. శ్రీమద్భగవద్గీత - 169 / Bhagavad-Gita - 169 - 4-07 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 567 / Vishnu Sahasranama Contemplation - 567🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 16 / Agni Maha Purana 16 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 246 / DAILY WISDOM - 246 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 147 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 85 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 08, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస స్కందషష్టి, మాస కార్తిగరై, Masik Skanda Sashti, Masik Karthigai 🌻*
*🍀. శ్రీ ఆంజనేయ స్తోత్రం - 7 🍀*
*13. పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణమ్ |*
*మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజమ్*
*14. పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహమ్ |*
*సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహమ్*
*ఇత్య ఉమా సంహితాయాం ఆంజనేయ స్తోత్రమ్ ||*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జన్యుశాస్త్రం వలే విధి కూడా స్థిరమైనది, మృదువైనది. అలా లేకుంటే వికాసమే ఉండదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల షష్టి 24:32:49 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: కృత్తిక 32:32:12 వరకు
తదుపరి రోహిణి
యోగం: వైధృతి 24:28:06 వరకు
తదుపరి వషకుంభ
కరణం: కౌలవ 11:30:14 వరకు
సూర్యోదయం: 06:29:36
సూర్యాస్తమయం: 18:24:20
చంద్రోదయం: 10:11:40
చంద్రాస్తమయం: 23:26:15
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మేషం
వర్జ్యం: 19:13:30 - 20:59:58
మరియు 26:30:40 - 28:18:32
దుర్ముహూర్తం: 08:52:33 - 09:40:12
రాహు కాలం: 15:25:39 - 16:55:00
గుళిక కాలం: 12:26:58 - 13:56:19
యమ గండం: 09:28:17 - 10:57:38
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49
అమృత కాలం: 29:52:18 - 31:38:46
గద యోగం - కార్య హాని , చెడు
32:32:12 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 169 / Bhagavad-Gita - 169 🌹
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 07 🌴
*07. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |*
*అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహం ||*
🌷. తాత్పర్యం :
*ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధినొందునో ఆ సమయమున నేను అవతరింతును.*
🌻. భాష్యము :
ఇచ్చట “సృజామి” అను పదము ముఖ్యమైనది. దానినెన్నడును సృష్టింపబడు ననెడి భావనలో ఉపయోగించరాదు. ఏలయన గత శ్లోకము ననుసరించి భగవానుని దేహమునకు లేదా రూపమునకు సృష్టి యనునది లేదు. రూపములన్నియును నిత్యముగా నిలిచి యండుటయే అందులకు కారణమున. కావున సృజామి యనగా భగవానుడు తన స్వీయరూపముతో అవతరించునని భావము.
నియమానుసారముగా శ్రీకృష్ణుభగవానుడు బ్రహ్మదేవుని ఒక దినము నందలి ఏడవ మనువు యొక ఇరువది ఎనిమిదవ యుగపు ద్వాపర యుగాంతమున ఆవిర్భవించు చుండును. కాని అతనికి అదే విధముగా విధి నియమానుసారము అవతరింపవలెనను నిబంధనము మాత్రము లేదు. అతడు తనకు తోచినరీతిగా వర్తింపగలడు. కనుక అధర్మము ప్రబలి, నిజమైన ధర్మము అడుగంటినప్పుడు అతడు తన ఇచ్చానుసారము అవతరించు చుండును.
ధర్మనియమములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేదనియమాచరణము నందు భంగము వాటిల్లనిచో మనుజడు ఆధర్మవర్తనుడగును. ఆ నియమములు భగవానుని శాసనములని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. కేవలము శ్రీకృష్ణభగవానుడు మాత్రమే ధర్మవిధానమును సృజింపగలడు. వేదములు సైతము తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే పలుకబడినవి తెలియవచ్చుచున్నది. కనుకనే ధర్మనియమములు సాక్షాత్తుగా భగవానుని నిర్దేశములై యున్నవి (ధర్మం తు సాక్షాద్భగవత్ప్రణితమ్).
ఈ నియమములన్నియును భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినవి. భగవానుని అధ్యక్షతలో ఆ నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనమై యున్నది. ధర్మము యొక్క అత్యున్నత నియమము తననే శరణు వేడవలెననియు, అంతకు మించి వేరొకటి లేదనియు శ్రీకృష్ణభగవానుడు స్వయముగా గీత యొక్క అంత్యమున ప్రత్యక్షముగా ఆదేశించినాడు. ఆ దేవదేవుని సంపూర్ణ శరణాగతి లోనికే వేదనియమములు మనుజుని చేర్చగలవు. అట్టి నియమములు దానవులు మరియు దానవ ప్రవృత్తి గల వారిచే నశింపజేయ బడినప్పుడు శ్రీకృష్ణభగవానుడు అవతరించును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 169 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 07 🌴*
*07. yadā yadā hi dharmasya glānir bhavati bhārata*
*abhyutthānam adharmasya tadātmānaṁ sṛjāmy aham*
🌷 Translation :
*Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata, and a predominant rise of irreligion – at that time I descend Myself.*
🌷 Purport :
The word sṛjāmi is significant herein. Sṛjāmi cannot be used in the sense of creation, because, according to the previous verse, there is no creation of the Lord’s form or body, since all of the forms are eternally existent. Therefore, sṛjāmi means that the Lord manifests Himself as He is.
Although the Lord appears on schedule, namely at the end of the Dvāpara-yuga of the twenty-eighth millennium of the seventh Manu in one day of Brahmā, He has no obligation to adhere to such rules and regulations, because He is completely free to act in many ways at His will. He therefore appears by His own will whenever there is a predominance of irreligiosity and a disappearance of true religion.
Principles of religion are laid down in the Vedas, and any discrepancy in the matter of properly executing the rules of the Vedas makes one irreligious. In the Bhāgavatam it is stated that such principles are the laws of the Lord. Only the Lord can manufacture a system of religion. The Vedas are also accepted as originally spoken by the Lord Himself to Brahmā, from within his heart. Therefore, the principles of dharma, or religion, are the direct orders of the Supreme Personality of Godhead (dharmaṁ tu sākṣād bhagavat-praṇītam).
These principles are clearly indicated throughout the Bhagavad-gītā. The purpose of the Vedas is to establish such principles under the order of the Supreme Lord, and the Lord directly orders, at the end of the Gītā, that the highest principle of religion is to surrender unto Him only, and nothing more. The Vedic principles push one towards complete surrender unto Him; and whenever such principles are disturbed by the demoniac, the Lord appears.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 567 / Vishnu Sahasranama Contemplation - 567 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 567. సుధన్వా, सुधन्वा, Sudhanvā 🌻*
*ఓం సుధన్వనే నమః | ॐ सुधन्वने नमः | OM Sudhanvane namaḥ*
సుధన్వా, सुधन्वा, Sudhanvā
*ఇన్ద్రియాదిమయం శార్ఙ్గం శోభనం ధనురస్య హి ।*
*ఇతి విష్ణుస్సుధన్వేతి ప్రోచ్యతే విదుషం వరైః ॥*
*ఇంద్రియములు మొదలగు తత్త్వముల రూపమేయగు శార్ఙ్గము అను ధనువు ఈతనికిగలదు గనుక ఆ విష్ణుదేవుని సుధన్వా అని విద్వాంసులు న్తుతింతురు.*
:: పోతన భాగవతము ద్వాదశ స్కంధము ::
సీ.సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁబరమదయార సోద్భాసితుఁ ద్రిదశాభి వందితపాదాబ్జు వనధిశయనునాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁగౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని శంఖచక్రగదాసిశార్ఙ్గధరునితే.శోభనాకారుఁ బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁబుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁ దలఁతు నుతియింతు దేవకీతనయు నెపుడు. (50)
గుణములకన్నింటికిని అతీతమైనవాడును, సర్వమూ తెలిసినవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడైనవాడునూ, సర్వ లోకములకును ఆధారమైనవాడునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసము చేత ప్రకాశించే వాడునూ, దేవతల వందనములను అందుకొనే పాదాబ్జములుగలవాడునూ, సముద్రములో శయనించేవాడునూ, ఆశ్రయించిన వారి పాలిటి కల్పవృక్షమువంటి వాడునూ, ఆదీ-అంతమూ అనేవి లేనివాడునూ, వేదాంతముచేతను తెలియదగినవాడునూ, విశ్వము అంతయును నిండియున్నవాడునూ, వక్షఃస్థలముపై కౌస్తుభమూ-శ్రీవత్సమూగలవాడునూ, శంఖమూ-చక్రమూ-గదా-శార్ఙ్గము అనే ధనుస్సూ ధరించి ఉండెడివాడునూ, మంగళకరము అయిన రూపముగలవాడునూ, పీతాంబరము ధరించి మనోహరముగా కనిపించెడివాడునూ, రత్నములచేత ప్రకాశించెడి కిరీటముతో వెలుగులు నింపెడివాడునూ, పద్మపత్రములవంటి నేత్రములు కలవాడునూ, గొప్పదైన పుణ్యవంతము అయిన శరీరముగలవాడునూ అయిన దేవకీ నందనుని స్మరించి యెల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 567 🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻 567. Sudhanvā 🌻*
*OM Sudhanvane namaḥ*
इन्द्रियादिमयं शार्ङ्गं शोभनं धनुरस्य हि ।
इति विष्णुस्सुधन्वेति प्रोच्यते विदुषं वरैः ॥
*Indriyādimayaṃ śārṅgaṃ śobhanaṃ dhanurasya hi,*
*Iti viṣṇussudhanveti procyate viduṣaṃ varaiḥ.*
*Since He sports a beautiful bow by name Śārṅga, which signifies the sense organs, the learned address Him as Sudhanvā.*
:: श्रीमद्भागवते द्वादशस्कन्धे एकादशोऽध्यायः ::
ओजह् सहोबलयुतं मुख्यतत्त्वं गदां दधत् ।
अपां तत्त्वं दरवरं तेजस्तत्त्वं सुदर्शनम् ॥ १४ ॥
नभोनिभं नभस्तत्त्वमसिं चर्म तमोमयम् ।
कालरुपं धनुः शार्ङ्गं तथा कर्ममयेषुधिम् ॥ १५ ॥
Śrīmad Bhāgavata - Canto 12, Chapter 11
Ojah sahobalayutaṃ mukhyatattvaṃ gadāṃ dadhat,
Apāṃ tattvaṃ daravaraṃ tejastattvaṃ sudarśanam. 14.
Nabhonibhaṃ nabhastattvamasiṃ carma tamomayam,
Kālarupaṃ dhanuḥ śārṅgaṃ tathā karmamayeṣudhim. 15.
The club the Lord carries is the chief element, prana, incorporating the potencies of sensory, mental and physical strength. His excellent conchshell is the element water, His Sudarśana disc the element fire, and His sword, pure as the sky, the element ether. His shield embodies the mode of ignorance, His bow, named Śārṅga, time, and His arrow-filled quiver the working sensory organs.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥
సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥
Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divisprk sarvadrg vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 16 / Agni Maha Purana - 16 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 6*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. అయోధ్యాకాండ వర్ణనము - 3 🌻*
ఓ పాపనిశ్చయవంతురాలా ! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు ? నేనేమి చేసినాను ? సకల ప్రపంచకమునకును అప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు ? కాలరాత్రి వంటి భార్య వైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడ నగుదును. భరతుడు ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యచమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యము నేలికొనుము.
సత్యపాశముచే బద్ధుడైన ఆతడు రాముని పిలచి ఇట్లు పలికెను. ''రామా ! నేను కై కేయిచే వంచింపబడితిని. నన్ను బంధించి రాజ్య మేలుము. నీవు వనములో నివసింపవలెను. కై కేయీ కుమారు డైన భరతుడు రాజు అగును. ''
రాముడు తండ్రికిని, కై కేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌసల్యకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణసమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రినతో కూడినవాడై, రథము నెక్కి శోకార్తులైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణమునుండి బయలువెడలెను.
రాత్రి తమసా తీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి. మిక్కిలి దుంఖితు డైన దశరథమహారాజు ఏడ్చుచు కౌసల్యాగృహమునకు వెళ్ళెను. పౌరులును. స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి. నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా అచ్చట గుహుడు ఆతనిని పూజించెను. ఆచట రాముడు ఇంగుదీవృక్షమూలమున నివసించెను. లక్ష్మణుడును, గుహుడును ఆ రాత్రి యంతయు మేల్కొనియే యుండిరి.
పిదప, సీతారామలక్ష్మణులు ప్రాతఃకాలమున నావచే జాహ్నవిని దాటి ప్రయాగ చేరిరి. భరద్వాజుని నమస్కనరించి చిత్రకూటపర్వతము చేరిరి. పిమ్మట వాస్తుపూజ చేసి, మన్దాకినీ నదీతీరమున నివసించిరి. రాముడు సీతకు చిత్రకూటపర్వతమును చూపెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -16 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
Chapter 6
*🌻 Ayodhya Kand -3 🌻*
23-25. After a moment he regained his consciousness and said, “What (harm) was done to you by Rāma or by me, O lady, determined to do sins! What you tell me in this manner is unpleasant to all the people. By merely doing (something) pleasing to you, I will be censured. What a kind of wife (you. are) like the night of destruction[3] at the end of the world. Bharata is not such a kind of son. (You) rule the kingdom as. a widower after I have died and the son has gone.”
26-29. Being bound by the noose of truth, (he) called Rāma and said (to him), “O! Rāma, I have been cheated by Kaikeyī; restraining me (you) rule the kingdom. You have to live-in the forest and Bharata, (the son of) Kaikeyī (is to be) the king.” Having saluted his father and Kaikeyī, after doing a circumambulation, and bowing down to Kauśalyā and having consoled her and with Lakṣmaṇa, with (his) wife Sītā and with Sumantra in the chariot and having made the gifts for the brahmins, poor and destitutes, he left the city with the mothers, brahmins and others stricken with grief.
30. Having spent the night on the banks of the (river) Tamasā (he went away) leaving the people. Not finding him in the morning they all returned to Ayodhyā again.
31. The lamenting king also went to the apartments of Kauśalyā extremely grief-stricken. Being separated from the king all the citizens and women wept.
32. Rāma, being seated in the chariot and wearing the barkgarments went to Śṛṅgaberapura. Being entertained by Guha[4] there, he resorted to the foot of the Iṅdgudī [Iṅgudī?] (tree).
33-34. And during the nights Lakṣmaṇa and Guha kept awake. Leaving Sumantra together with the chariot in the morning, Rāma, Lakṣmaṇa and Sītā crossed the river Jāhnavī (Ganges); by boat and reached Prayāga. (They) paid their obeisance to (the sage) Bharadvāja (and then) reached the Citrakūṭa mountain.
35. Then (they) having performed the Vāstupūjā (propitiatory rites at the house site), stayed on the banks of the Mandākini (Ganges). And (then) Rāghava showed the Citrakūṭa (mountain) to Sītā.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 246 / DAILY WISDOM - 246 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 2. జీవితంలోని ఏకైక కర్తవ్యం 🌻*
*మానవజాతి, నేడు, ఈ భూమిపై అనేక వేల సంవత్సరాల నుండి జీవించడం ద్వారా పొందిన జ్ఞానం మరియు అనుభవం తర్వాత కూడా జీవితం యొక్క నిజమైన విలువని పొందలేదని చెప్పవచ్చు. అంతేకాదు ప్రతి క్షణము, ప్రతిరోజు జీవిస్తున్నా జీవితంలో చేసే తప్పులను గుర్తించి, తద్వారా వచ్చే గుణపాఠాలను అస్సలు నేర్చుకోలేదని కూడా చెప్పవచ్చు. మానవజాతి జీవితపు విలువలను మర్చిపోయి చేస్తున్న ఈ తప్పులు అనుభావిక స్థాయిలో, ఇంద్రియాల మరియు భౌతిక స్థాయి అవగాహనలలోని లోటు వలన ఉన్నాయి.*
*మానవుడు ఈ రకమైన ఆలోచనలతో అంతర్గతంగా మరియు బాహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే, అటువంటి మానవ వ్యక్తి జీవితాన్ని నరక అగ్ని యొక్క జ్యోతిగా పేర్కొనలేము. దురదృష్టవశాత్తూ, మిలియన్ల సంవత్సరాల చరిత్ర తరువాత కూడా ఇటువంటి జీవితానికి కట్టుబడి ఉన్న వ్యక్తికి ఇది సరైన జీవించడంలా కనిపిస్తోంది. ఒక కవి చెప్పినట్లుగా, "స్వర్గంలో సేవ చేయడం కంటే నరకంలో రాజ్యమేలడం మేలు." అనే విధంగా. కానీ కర్తవ్యంగా ఈ ఆకాంక్ష ఎప్పటికీ కొనసాగుతూనే ఉండలేదు. ప్రతి ఆత్మ ఎప్పటికైనా తప్పని సరిగా తన జీవితంలో తన జీవన ఎదుగుదలలో నిమగ్నమై ఉండవలసి వస్తుంది. మనిషి ఆకాంక్షతో విడదీయలేని కర్తవ్యం ఇది. నిజానికి జీవితానికి ఉన్న ఏకైక కర్తవ్యం ఇది మాత్రమే.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 246 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 2. The Only Duty in Life 🌻*
*Mankind, today, with all its appurtenances of knowledge and experience gained through the historical movement of several thousands of years on this Earth, can be said to have learned no lesson at all as to where its true blessedness lies or what are the mistakes that it is daily committing in its life at every moment of time. Humanity's blunders in its entirely empirical-oriented sense-ground perception of the values of life are as it has been briefly outlined above.*
*If the human individual persists in this kind of thinking and acting inwardly as well as outwardly, such a life of the human individual cannot but be designated as a cauldron of hell-fire, which, unfortunately, to the bound individual, appears to be a highly satisfactory state of affairs, because of its dictum, as the poet well said in this context, “It is better to reign in hell than serve in heaven.” The hope of mankind is not going to be in the continuance of this state of affairs even though it may go on through millions of years of human history. Every soul has to engage itself throughout its career in life. This is the final duty inseparable from man's aspiration, nay, the only duty in life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 147 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ధ్యానం నీ నుంచి చెత్తా చెదారాన్ని వదలిస్తుంది. శూన్యం చేస్తుంది. నీలో స్థలమేర్పడుతుంది. వ్యక్తి సత్యాన్ని ఆహ్వానించాలి, ఎదురు చూడాలి. అంతకు మించి ఏమీ చెయ్యకూడదు. దాన్నే నేను ప్రార్థన అంటాను. 🍀*
*సత్యాన్ని ఆక్రమించలేం. ఆహ్వానించవచ్చు. అనంత సత్యానికి మనం ఆతిథ్యమివ్వవచ్చు. ఇది ఉనికికి సంబంధించిన చట్టం. దాన్నే నేను ధ్యానమంటాను. అది నీ నుంచి చెత్తా చెదారాన్ని వదలిస్తుంది. శూన్యం చేస్తుంది. అది నిన్ను ఖాళీ చెయ్యడం వల్ల నీలో స్థలమేర్పడుతుంది. అప్పుడు నువ్వు సున్నితంగా స్వీకరించే లక్షణంతో, స్పందించే గుణంతో ఎప్పుడూ అందుబాటులో వుంటావు.*
*అ లక్షణాలు నీలో అనురాగాన్ని నింపుతాయి. అజ్ఞాతమయిన దానికి నువ్వు ఆహ్వాన ద్వారమవుతావు. ఆ ఆహ్వానం నీకు సంపూర్ణత నిస్తుంది. వ్యక్తి అంతకు మించి ఏమీ చెయ్యకూడదు. ఆహ్వానించాలి, ఎదురుచూడాలి. దాన్నే నేను ప్రార్థన అంటాను. ఆహ్వానంలో గొప్ప విశ్వాసం వుంది. గొప్ప నమ్మకం మొగ్గ తొగుడుతుంది అదే అస్తిత్వానికి అంతిమ చట్టం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 85 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 71. మైత్రేయ యుగము 🌻*
*“నూతన యుగము మైత్రేయ యుగమని అంటారు. అది దగ్గరలో నున్నదా?" అని ప్రశ్నింపగ మే మిట్లంటిమి. “మైత్రేయ యుగము వచ్చుట, రాకుండుట మీవంటి వారి వశమున నున్నది. మీ యందు మా బోధనల ద్వారా ఏర్పడు మైత్రీ భావమే మైత్రేయ యుగమునకు బీజము. మే మాశించునది మిత్రత్వము. ప్రస్తుతము మానవజాతి యందు శత్రుత్వ మెక్కువగ నున్నది. ఆధ్యాత్మిక సోదర బృందముల యందు గూడ మిత్రత్వము కన్న శత్రుత్వమే ఎక్కువగ కన్పట్టుతున్నది.*
*వేర్పాటు ధోరణి యున్న చోట మిత్రత్వముండదు గదా! కలిసి జీవించుడని మేము 5 వేల సంవత్సరముల నుండి తెలుపుచున్నాము. మమ్మనుసరించు బృందములకే ఇంతవరకిది సాధ్యపడలేదు. బోధించుట, స్ఫూర్తి నిచ్చుట, అటుపై వేచి యుండుటగ మా పని నడచుచున్నది. మీరు చేయ వలసినదే మిగిలియున్నది. మిత్రత్వ భావమే మైత్రేయ లోకము. అది ఎక్కడ వున్న అక్కడ మైత్రేయ యుగము సత్యమగును.”*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment