మైత్రేయ మహర్షి బోధనలు - 85


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 85 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 71. మైత్రేయ యుగము 🌻


“నూతన యుగము మైత్రేయ యుగమని అంటారు. అది దగ్గరలో నున్నదా?" అని ప్రశ్నింపగ మే మిట్లంటిమి. “మైత్రేయ యుగము వచ్చుట, రాకుండుట మీవంటి వారి వశమున నున్నది. మీ యందు మా బోధనల ద్వారా ఏర్పడు మైత్రీ భావమే మైత్రేయ యుగమునకు బీజము. మే మాశించునది మిత్రత్వము. ప్రస్తుతము మానవజాతి యందు శత్రుత్వ మెక్కువగ నున్నది. ఆధ్యాత్మిక సోదర బృందముల యందు గూడ మిత్రత్వము కన్న శత్రుత్వమే ఎక్కువగ కన్పట్టుతున్నది.

వేర్పాటు ధోరణి యున్న చోట మిత్రత్వముండదు గదా! కలిసి జీవించుడని మేము 5 వేల సంవత్సరముల నుండి తెలుపుచున్నాము. మమ్మనుసరించు బృందములకే ఇంతవరకిది సాధ్యపడలేదు. బోధించుట, స్ఫూర్తి నిచ్చుట, అటుపై వేచి యుండుటగ మా పని నడచుచున్నది. మీరు చేయ వలసినదే మిగిలియున్నది. మిత్రత్వ భావమే మైత్రేయ లోకము. అది ఎక్కడ వున్న అక్కడ మైత్రేయ యుగము సత్యమగును.”


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2022

No comments:

Post a Comment