నిర్మల ధ్యానాలు - ఓషో - 156


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 156 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఆనందమన్నది శాంతి లేకుంటే ఆందోళనగా మారుతుంది. శాంతి నిండిన ఆనందంతో ఉన్నప్పుడు సంపూర్ణతలోకి అడుగు పెడతావు. 🍀


మానవత్వాన్ని చంపడానికి మత పెద్దకు, రాజకీయవాదికి మధ్య అవగాహన కుదిరింది. కొంత మంది మాత్రమే ఈ పద్ధతిపై తిరుగుబాటు చేశారు. కొంత మందయినా తిరగబడ్డం మంచిదే అయింది. ఐతే వాళ్ళు వ్యతిరేక దిశలో తీవ్రవాదంగా మారారు. వాళ్ళు పూర్తిగా శాంతి అన్నది అర్థరహితం అన్నారు. నిష్ఫలమన్నారు. అధికారం చెలాయించాలనే రాజకీయ వ్యూహాలకు ఎదురు తిరిగారు. ఎవరి అధికారానికి తలవొగ్గ కూడదను కున్నారు. ఆనందంగా, ఉల్లాసంగా వుండాలనుకున్నారు. కానీ ఆనందమన్నది శాంతి లేకుంటే ఆందోళనగా మారుతుంది. ఉద్వేగం వుంటుంది కానీ అది అలసటని తీసుకొస్తుంది. చివరికి ఎలాంటి సంతృప్తి కలగదు. దానికి అది ప్రత్యామ్నాయం కాదు. వ్యతిరేక దిశలో అది తీవ్రమైందే.

నా ప్రయత్నమంతా ఒక నాణేనికి శాంతి, ఆనందం రెండు వేపులుగా వుండేలా చెయ్యడం. అప్పుడొక అద్భుతమయిన విషయం జరుగుతుంది. నువ్వు ఆనందంగా వుంటావు. కానీ ఆ వేగంతో వుండవు. నువ్వు శాంతంగా వుంటావు. కానీ చైతన్య రహితంగా వుండవు. మధ్యస్థంగా వుంటావు. వెచ్చగానూ, చల్లగానూ వుంటావు. శాంతి నిండిన ఆనందంతో, ఆనందం నిండి శాంతితో వుంటావు. అపుడు నువ్వు సమగ్రతని సంతరించుకుంటావు. సంపూర్ణతలోకి అడుగుపెడతావు. అది గ్రహించడమే ఉనికిని తెలుసుకోవడం. అది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2022

No comments:

Post a Comment