మైత్రేయ మహర్షి బోధనలు - 95
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 95 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 78. రసాయనము -1 🌻
యోగసాధన ఒక రసాయనము. రసాయన చర్య యందు ఒక స్థితిలో పదార్థము నిర్దిష్టమగు మార్పును చెందును. అప్పుడా రసాయన చర్య సిద్ధించును. సృష్టి యంతయు ఒక రసాయనము. అదృశ్యముగను, అనుస్యూతముగను సృష్టి మార్పు పరిణామ మార్గమున జరుగుచునే యున్నది. మానవ పరిణామము కూడ ఇంద్రియగోచరము కాక పోయినను జరుగుచునే యున్నది.
పాలు పెరుగు యగుటకు జరుగునది రసాయన చర్యే. దానికి, తోడు ఆధారము. మట్టి బంగార మగుట కూడ యిట్టిదే. రాయి రత్నమగుట, పూవు కాయగుట, కాయ పండగుట గమనించినచో ఈ సత్యము తెలియగలదు. అతి సూక్ష్మమగు మార్పులు స్థూలబుద్ధి గల వారి కందదు. సూక్ష్మబుద్ధి కలిగినచో సూక్ష్మమగు పరిణామములన్నియు తెలియనగును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
28 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment