శ్రీ మదగ్ని మహాపురాణము - 26 / Agni Maha Purana - 26


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 26 / Agni Maha Purana - 26 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 10

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. యుద్ధకాండ వర్ణనము - 2 🌻


నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాది మాంసము భుజించి రావణునితో ఇట్లు పలికెను.

కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న కానయుద్ధమునకు వెళ్ళి వాన రసహితుడైన రాముని సంహరించెదను. కుంభకర్ణుడీ విధముగ పలకి వానరులందరిని మర్దించెను. అతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును, కొరికివేసెను. చెవులు ముక్కులేని అతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను చేధించి అతని సిరస్సు నేలపై పడవేసెను.

పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ-నికుంభ-మకరాక్ష - మహోదర-మహాపార్శ్వ-మత్త-ఉన్మత్త-ప్రఘన-భాసకర్ణ-విరూపాక్ష-దేవాంతక-నరాంతక, త్రిశిరస్క-అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి. మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగబాణములైన నాగబాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొవచ్చిన పర్వతముపై ఉన్న విశల్యయను ఓషధిచేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.

నికుంభిలలో హోమాదికము చేయుచున్న ఆ ఇంద్రజిత్తులను లక్ష్మణుడు బాణములతో సంహరించెను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్శెను.

ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూడుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -26 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 10

🌻 Yudda (War) Kand - 2 🌻


11-12. Then being awakened, Kumbhakarṇa, drinking thousands of pots of wine, and having eaten buffaloes and other (animals), said to Rāvaṇa, “You have done the sin of abducting Sītā and because (you are) my master, I shall go now for the war and kill Rāma along with the monkeys.”

13. So saying, Kumbhakarṇa crushed all the monkeys. Being seized by him, Sugrīva cut off his ears and nose.

14. Having lost ears and nose he was eating the monkeys. then Rāma cut off the arms of Kumbhakarṇa with the arrows.

15- 17. Then having cut off the feet, (Rāma) made (his) head fall on the earth. And then the demons Kumbha, Nikumbha, Makarākṣa, Mahodara and Mahāpārśva, the arrogant, Praghasa, Bhāsakarṇa, Virūpākṣa, Devāntaka, Narāntaka, Triśiras, Atikāya (were killed) in battle by Rāma, Lakṣmaṇa and the monkeys in the company of Vibhīṣaṇa.

18-21. And other demons, as they were fighting were made to fall down. Fighting by conceit, Indrajit bound Rāma and others with the Nāgāstra got as a gift. After they were made secure and free from wounds when Māruti had brought the mountain. Hanūmat bore him (Lakṣmaṇa) to that place where (Indrajit) was doing homa and offering āhuti-s unto the fire at Nikumbilā Lakṣmaṇa killed the valiant Indrajit in battle. Being burnt by grief, Rāvaṇa was intent on killing Sītā.

22. The king although obstructed by the women, went (to fight) seated on a chariot and accompanied by the army. Being directed by Indra, Mātali[1] made Rāma seated on a chariot.

23. The fight between Rama and Rāvaṇa was none the second. Rāvaṇa attacked monkeys and Māruti and others attacked Rāvaṇa.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2022

No comments:

Post a Comment