మైత్రేయ మహర్షి బోధనలు - 108
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 108 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 85. పూర్ణ యోగము-2 🌻
పద్మము నందలి దళములన్నీ విచ్చుకొన వలెనన్నచో అన్ని అనుభవములు పూర్ణము కావలెను. అందుకొక జన్మ చాలదు. పరిపూర్ణ యోగియందు అరువది నాలుగు కళలు భాసించును. అంతవరకు జన్మ పరంపరలు తప్పవు. పరిపూర్ణుడు సర్వ విషయము లందును పరిపూర్ణుడే. అతడే దైవ సమానుడు. శ్రీకృష్ణుడట్టివాడు. అతని యందు లేని కళ, విద్య లేనేలేదు.
అతడు విశ్వమందు గల సమస్త జీవులకు ఆదర్శము. సహస్రదళ పద్మము విచ్చుకొనుట యనగా సహస్రకళలను తననుండి ప్రకాశింప చేయుట. ఇది మాటల కందని విషయము. దీనిని గూర్చి కొంత ఆలోచన చేయుడు. ఆత్మపరముగ నున్న అపరిపూర్ణతలను తొలగించుట గాక పరిపూర్ణము చేయుచు ముందుకు సాగుడు. ఇది పూర్ణ యోగము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
23 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment