నిర్మల ధ్యానాలు - ఓషో - 169


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 169 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం వునికిలో వుండడం కన్నా కోరాల్సింది ఏమీ లేదు. జనం కోపంతో, ఈర్ష్యతో, అత్యాశతో, అహంతో వుంటారు. ఈ అనాగరిక లక్షణాల్ని వదిలించు కోవాలి. కారణం అవి మన శక్తియుక్తుల్ని నీరస పరుస్తాయి. దేవుడు వున్నాడనడానికి మన శ్వాస ఒకటి చాలు. ప్రతి శ్వాస దానితో బాటు పరవశాన్ని తోసుకొస్తుంది. జీవితం సమశృతిలో వుంటుంది. 🍀


జనం అనాగరికంగా వుంటారు. కోపంతో, ఈర్ష్యతో, అత్యాశతో, అహంతో వుంటారు. వ్యక్తి ఈ అనాగరిక లక్షణాల్ని వదిలించు కోవాలి. కారణం అవి మన శక్తియుక్తుల్ని నీరస పరుస్తాయి. అవకాశాన్ని నాశనం చేస్తాయి. వీటన్నిటికి పాటలుగా పరివర్తింప చేయాలి. ఆనందంగా, ప్రేమగా, శాంతిగా మార్చాలి. అప్పుడు జీవితం కవిత్వమవుతుంది. అంతులేని పరవశమవుతుంది.

మనం వునికిలో వుండడం కన్నా కోరాల్సింది ఏమీ లేదు. దేవుడు వున్నాడనడానికి మన శ్వాస ఒకటి చాలు. ప్రతి శ్వాస దానితో బాటు పరవశాన్ని తోసుకొస్తుంది. జీవితం సమశృతిలో వుంటుంది. అంత ఆనందనాట్యం సంభమవేనా అని మనం ఆశ్చర్యపోతాం. అది జరిగినపుడు, సంభవించినపుడు వ్యక్తి దానిని నమ్మాలి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


23 Apr 2022

No comments:

Post a Comment