మైత్రేయ మహర్షి బోధనలు - 110


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 110 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 86. సమాధాన విద్య - 2 🌻


“ఇట్లు చేసిన బాగుండునా?" అని ప్రశ్నించువాడు ప్రశ్నయందే తన కట్లు చేసిన బాగుండునని తెలుపుచున్నాడు. బాగుండదని నీవు తెలిపిననూ వినడు. అట్లు తెలిపిన చేదుగ ండును. "నీవన్నట్లే కానిమ్ము.” అనుట పృచ్ఛకునికి తృప్తి కలిగించును. అట్లనినచో అతను చెడి పోవును కదా! అని నీకనిపించినచో దానిని కూడ వివరించుము. వద్దు, కాదు, కూడదు అని తెలిపి ఉపయోగము లేదు. సూటిగ వ్యతిరేకించుట సమాధానము కాదు.

విభీషణుడు రావణుని సూటిగ సమాధాన రూపమున వ్యతిరేకించుట వలననే రాజ్య బహిష్కారము నకు గురి అయినాడు. హనుమంతుడు తన ప్రభువు సుగ్రీవుడు చేయుచున్నది అకార్యమని అనకుండగనే కార్యమున నిలబెట్టినాడు. హనుమంతుడు తెలిసినవాడు. విభీషణుడు తెలియనివాడు. విదురుడు తెలిసీ తెలియని వాడు. సమాధానము చెప్పుట ఒక ప్రత్యేక విద్య. దానికిని ఒక ఉపాసనా మార్గమున్నది. తనకు తోచినదే సమాధానమనుకొనుట మూర్ఖత.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


28 Apr 2022

No comments:

Post a Comment