నిర్మల ధ్యానాలు - ఓషో - 171


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 171 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది చాలా అల్పమయింది. సూక్ష్మాతి సూక్ష్మమయింది. మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింప బడతాం. ధ్యానమంటే గుర్తింపు లేకపోవడం. కేవలం నేను చైతన్యం మాత్రమే అని గుర్తించడం. నేను సాక్షిని అన్న విషయం గుర్తుంచుకోవాలి. 🍀


లేకపోవడమే నిజమైన వుండడం. నువ్వు అహంగా మాయమయిన క్షణం విశాలమవుతావు. విస్తృతమవుతావు. సముద్రానుభావానికి పొందుతావు. సరిహద్దులు లేని సంతోషాన్ని అందుకుంటావు. కానీ మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది చాలా అల్పమయింది. సూక్ష్మాతి సూక్ష్మమయింది. మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింపబడతాం. అది చిన్న గుడిసె దాంట్లో నివసించాలి. శుభ్రపరచాలి. దాన్ని అందంగా పెట్టాలి. సూక్ష్మ యంత్రమయిన మనసునీ వుపయోగించు. కానీ యంత్రానికి లొంగకు. డ్రైవరు కారు నడుపుతాడు. కార్లో వుంటాడు. కానీ కారు కాడు.

మనకు సంబంధించిన వ్యవహారం కూడా అలాంటిదే. మనముంటున్న యంత్రం ద్వారా మనం గుర్తింపు పొందుతున్నాం. ఈ రకమైన గుర్తింపు అహాన్ని యిస్తుంది. నేను శరీరం, నేను మనసు, నేను క్రిష్టియన్ని, నేను హిందూని, తెల్లవాణ్ణి, నల్లవాణ్ణి, నేను అది, నేను యిది! ఇవన్నీ కేవలం గుర్తింపులు. ధ్యానమంటే గుర్తింపు లేకపోవడం. కేవలం. నేను చైతన్యం మాత్రమే. పరిశీలనని, మెలకువని, సాక్షిని, అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆ సాక్షిగా వుండడంలో అహం అదృశ్యమవుతుంది. అహం అదృశ్యమయితే గొప్ప విప్లవం జరుగుతుంది. నువ్వు అల్పమయిన, చిన్ని ప్రపంచం నించీ విశాలమైన, సౌందర్యభరితమైన వైశాల్యంలోకి, కాలం నించి శాశ్వతత్వంలోకి మరణం నించీ మరణ రాహిత్యానికి సాగుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


28 Apr 2022

No comments:

Post a Comment