నిత్య ప్రజ్ఞా సందేశములు - 271 - 27. దేవుని రాజ్యంలో మొదటిది / DAILY WISDOM - 271 - 27. The First in the Kingdom of God
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 271 / DAILY WISDOM - 271 🌹
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 27. దేవుని రాజ్యంలో మొదటిది 🌻
మనిషి యొక్క పౌర కర్తవ్యం అనేది ప్రజల మరియు ప్రపంచం యొక్క పర్యావరణం పట్ల ఒక వ్యక్తికి కలిగి ఉండవలసిన ప్రాథమిక పరిగణన. చుట్టూ ఉన్న సంఘంతో ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండటం మంచిదే. అంతే కాదు, చుట్టుపక్కల వ్యక్తులతో దయతో మరియు సేవాభావనతో ఉండటం మంచిది. దాతృత్వం ఇంట్లో ప్రారంభమైతే, తక్షణ పరిసరాల్లో ప్రేమ మరియు సేవ కూడా ప్రారంభమవుతాయి. ప్రవర్తన యొక్క మంచితనం అనేది ఉన్నత దృక్పథం కలిగివుండటమే కానీ ప్రపంచంలో అందరికీ తెలిసేలా సేవ చేయడం కాదు.
ఒక వ్యక్తికి సంబంధించి, మంచిగా ఉండటం అంటే సేవ యొక్క కేంద్ర బిందువు గా ఉండటమే. అంతే కానీ పరిమానాత్మకంగా ఎంతమందికి సేవ చేశారు అనేది కొలమానం కాదు. మంచితనానికి బహిరంగంగా ఎటువంటి ప్రకటన అవసరం లేదు, అది గుర్తింపును కోరదు, కృతజ్ఞతను సైతం కొరదు. ఎందుకంటే, “ఈ ప్రపంచంలో అధమ స్థితిలో ఉన్నవారు సైతం దేవుని రాజ్యం లో ప్రథములుగా పరిగణించబడతారు." పౌర బాధ్యతలు మానవ స్వభావం నుండే ఉత్పన్నమవుతాయి. పౌర బాధ్యతలు తాము స్వీకరించదలచిన మరియు అన్నింటితో పెనవేసుకున్న మానవ అవసరాల నుంచే పుట్టాయి. క్రూర మనిషి, కూరగాయల మనిషి, జంతువు మనిషి మరియు నిజమైన మానవుడు, మానవ స్థాయిలో కూడా ఈ వర్గీకరణలు సాధ్యమే.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 271 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 27. The First in the Kingdom of God 🌻
The civic duty of man is a basic common sense consideration that one should have to the environment of people and the world, and it is good to be always friendly with the community around. Not only that, it would be better to be kind and serviceful to persons in the vicinity. If charity begins at home, love and service also start in the immediate neighbourhood. Goodness of behaviour is more a quality of outlook than a quantitative reach of one's actions to distant corners of the world.
To be qualitatively good in respect of even one person would speak more gloriously of that source of service than to be just quantitatively philanthropic to a large number of individuals. Goodness does not require any announcement in public, it does not seek recognition, not even a word of thanks, for, “Is not the least one in this world going to be recognised as the first in the kingdom of God?” Civic obligations arise from human nature itself. They spring from the very needs of human make-up which has connections with different kinds of facility that is expected to be received from the world. The brute man, the vegetable man, the animal man, and the truly human man are classifications possible even at the human level.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment