28 - APRIL - 2022 గురువారం, బృహస్పతి వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 28, ఏప్రిల్ 2022 గురువారం, బృహస్పతి వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 193 / Bhagavad-Gita - 193 - 4-31 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 592 / Vishnu Sahasranama Contemplation - 592🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 271 / DAILY WISDOM - 271 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 171 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 110🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 28, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻*

*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 2 🍀*

*2. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః*
*మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్*
*మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా*
*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవన పరిస్థితులను మార్చుకోవడానికి మంచి భావాల ద్వారా ప్రేమను ప్రసరించండి. మీరు కోరినవన్నీ మీకు లభిస్తాయి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ త్రయోదశి 24:28:30 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 17:41:19
వరకు తదుపరి రేవతి
యోగం: వైధృతి 16:29:58 వరకు
తదుపరి వషకుంభ
కరణం: గార 12:24:55 వరకు
వర్జ్యం: 02:56:00 - 04:34:20
దుర్ముహూర్తం: 10:06:26 - 10:57:20
మరియు 15:11:49 - 16:02:43
రాహు కాలం: 13:49:07 - 15:24:33
గుళిక కాలం: 09:02:49 - 10:38:15
యమ గండం: 05:51:57 - 07:27:23
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 12:46:00 - 14:24:20
సూర్యోదయం: 05:51:57
సూర్యాస్తమయం: 18:35:24
చంద్రోదయం: 04:15:10
చంద్రాస్తమయం: 16:34:10
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మీనం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 17:41:19
వరకు తదుపరి మిత్ర యోగం 
- మిత్ర లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత -193 / Bhagavad-Gita - 193 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 31 🌴*

*31. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్య: కురుసత్తమ |*

🌷. తాత్పర్యం :
*ఓ కురువంశ శ్రేష్టుడా! యజ్ఞమును నిర్వహింపకుండా ఎవ్వరును ఈ లోకముగాని, ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి యెడ తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేల?*

🌷. భాష్యము :
జీవుడు ఎటువంటి భౌతికస్థితి యందున్నప్పటికిని తన నిజస్థితి యెడ జ్ఞానరహితుడైన యుండును. అనగా పాపజన్మల ఫలముల వలననే భౌతికజగమునందు అస్తిత్వము కలుగుచున్నది. అజ్ఞానము పాపజన్మకు కారణము కాగ, పాపజీవనము మనుజుడు భౌతికత్వమున కొనసాగుటకు కారణమగుచున్నది. 

అట్టి భవబంధము నుండి ముక్తిని సాధించుటకు మానవజన్మ యొక్కటే సరియైన మార్గమే యున్నది. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియభోగము, అంత్యమున దుర్భరస్థితి నుండి సంపూర్ణముగా విముక్తి యనెడి మార్గములను చూపుట ద్వారా మనలకు ఒక అవకాశము నొసగుచున్నది. 

ధర్మమార్గము (ఇంతవరకు తెలుపబడిన వివిధయజ్ఞ నిర్వహణములు) మన సర్వ ఆర్ధిక పరిస్థితులను అప్రయత్నముగా చక్కబరచగలదు. జనాభివృద్ధి అధికముగా నున్నను యజ్ననిర్వాహణము ద్వారా సమృద్ధిగాగా ఆహారము, పాలు ఆదివి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పడు ఇంద్రియభోగానుభవ భావన కలుగును. కనుకనే వేదములు నియమిత భోగానుభవము కొరకై పవిత్ర వివాహపద్ధతిని నిర్దేశించుచున్నవి. 

తద్ద్వార మనుజుడు క్రమముగా భౌతికబంధము నుండి ముక్తుడై ఉన్నతస్థితిని చేరును. అట్టి ముక్తస్థితి యందలి సంపూర్ణత్వమే భగవానునితో సాహచర్యము. పూర్వము వివరించినట్లు అటువంటి సంపూర్ణత్వము యజ్ఞనిర్వాహణము ద్వారానే లభించగలదు. అట్లు వేదములు తెలిపినరీతిగా యజ్ఞమును నిర్వహించుట యందు మనుజడు అనురక్తుడు కానిచో ఈ జన్మమునందైనను సుఖమయ జీవనము ఊహింపలేడు. 

ఇక వేరే దేహముతో ఇంకొక లోకమునందు సౌఖ్యమును గూర్చి తెలుపుదనేమున్నది? వివిధయజ్ఞములను నిర్వహించువారికి అమితానందమును గూర్చుటకు స్వర్గలోకములందు వివిధప్రమాణములలో భౌతికసుఖములు గలవు. కాని కృష్ణభక్తిని చేయుట ద్వారా ఆధ్యాత్మికలోకమును పొందుటయే మానవునికి అత్యంత ఉత్కృష్టమైన ఆనందమై యున్నది. కనుకనే కృష్ణభక్తిరసభావనము సర్వభవక్లేశములకు దివ్యమైన పరిష్కారమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 193 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 31 🌴*

*31. nāyaṁ loko ’sty ayajñasya kuto ’nyaḥ kuru-sattama*

🌷 Translation : 
*O best of the Kuru dynasty, without sacrifice one can never live happily on this planet or in this life: what then of the next?*

🌹 Purport :
Whatever form of material existence one is in, one is invariably ignorant of his real situation. In other words, existence in the material world is due to the multiple reactions to our sinful lives. Ignorance is the cause of sinful life, and sinful life is the cause of one’s dragging on in material existence. The human form of life is the only loophole by which one may get out of this entanglement. The Vedas, therefore, give us a chance for escape by pointing out the paths of religion, economic comfort, regulated sense gratification and, at last, the means to get out of the miserable condition entirely. 

The path of religion, or the different kinds of sacrifice recommended above, automatically solves our economic problems. By performance of yajña we can have enough food, enough milk, etc. – even if there is a so-called increase of population. When the body is fully supplied, naturally the next stage is to satisfy the senses. The Vedas prescribe, therefore, sacred marriage for regulated sense gratification. 

Thereby one is gradually elevated to the platform of release from material bondage, and the highest perfection of liberated life is to associate with the Supreme Lord. Perfection is achieved by performance of yajña (sacrifice). Now, if a person is not inclined to perform yajña according to the Vedas, how can he expect a happy life even in this body, and what to speak of another body on another planet? 

There are different grades of material comforts in different heavenly planets, and in all cases there is immense happiness for persons engaged in different kinds of yajña. But the highest kind of happiness that a man can achieve is to be promoted to the spiritual planets by practice of Kṛṣṇa consciousness. Is therefore the solution to all the problems of material existence
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 592 / Vishnu Sahasranama Contemplation - 592🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 592. గోపతిః, गोपतिः, Gopatiḥ🌻*

*ఓం గోపతయే నమః | ॐ गोपतये नमः | OM Gopataye namaḥ*

*గోర్భూమ్యాః పతిరితి గోపతిరిత్యుచ్యతే హరిః*

*గో అనగా గోవు లేదా భూమి అని కూడా అర్థము వచ్చును. కావున గోపతిః అనగా గోవునకూ, భూమికీ పతి/రక్షకుడు/ప్రభువు/భర్త అను అర్థము చెప్పవచ్చును.*

*(గోపతిః అనగా సూర్య భగవానుడు అని కూడా అర్థము చెప్పవచ్చును. సూర్య దేవుడు సైతము ఆ విష్ణు దేవుని విభూతియే కదా!)*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 592🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 592. Gopatiḥ 🌻*

*OM Gopataye namaḥ*

*गोर्भूम्याः पतिरिति गोपतिरित्युच्यते हरिः / Gorbhūmyāḥ patiriti gopatirityucyate Hariḥ*

*Go can mean a cow as well as earth. Hence Gopatiḥ means the One who is pati of Go i.e., Lord of earth or cows.*

*(Sun is also called Gopatiḥ. Sun is also an opulence of Lord Hari.)*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 271 / DAILY WISDOM - 271 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 27. దేవుని రాజ్యంలో మొదటిది 🌻*

*మనిషి యొక్క పౌర కర్తవ్యం అనేది ప్రజల మరియు ప్రపంచం యొక్క పర్యావరణం పట్ల ఒక వ్యక్తికి కలిగి ఉండవలసిన ప్రాథమిక పరిగణన. చుట్టూ ఉన్న సంఘంతో ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండటం మంచిదే. అంతే కాదు, చుట్టుపక్కల వ్యక్తులతో దయతో మరియు సేవాభావనతో ఉండటం మంచిది. దాతృత్వం ఇంట్లో ప్రారంభమైతే, తక్షణ పరిసరాల్లో ప్రేమ మరియు సేవ కూడా ప్రారంభమవుతాయి. ప్రవర్తన యొక్క మంచితనం అనేది ఉన్నత దృక్పథం కలిగివుండటమే కానీ ప్రపంచంలో అందరికీ తెలిసేలా సేవ చేయడం కాదు.*

*ఒక వ్యక్తికి సంబంధించి, మంచిగా ఉండటం అంటే సేవ యొక్క కేంద్ర బిందువు గా ఉండటమే. అంతే కానీ పరిమానాత్మకంగా ఎంతమందికి సేవ చేశారు అనేది కొలమానం కాదు. మంచితనానికి బహిరంగంగా ఎటువంటి ప్రకటన అవసరం లేదు, అది గుర్తింపును కోరదు, కృతజ్ఞతను సైతం కొరదు. ఎందుకంటే, “ఈ ప్రపంచంలో అధమ స్థితిలో ఉన్నవారు సైతం దేవుని రాజ్యం లో ప్రథములుగా పరిగణించబడతారు." పౌర బాధ్యతలు మానవ స్వభావం నుండే ఉత్పన్నమవుతాయి. పౌర బాధ్యతలు తాము స్వీకరించదలచిన మరియు అన్నింటితో పెనవేసుకున్న మానవ అవసరాల నుంచే పుట్టాయి. క్రూర మనిషి, కూరగాయల మనిషి, జంతువు మనిషి మరియు నిజమైన మానవుడు, మానవ స్థాయిలో కూడా ఈ వర్గీకరణలు సాధ్యమే.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 271 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 27. The First in the Kingdom of God 🌻*

*The civic duty of man is a basic common sense consideration that one should have to the environment of people and the world, and it is good to be always friendly with the community around. Not only that, it would be better to be kind and serviceful to persons in the vicinity. If charity begins at home, love and service also start in the immediate neighbourhood. Goodness of behaviour is more a quality of outlook than a quantitative reach of one's actions to distant corners of the world.*

*To be qualitatively good in respect of even one person would speak more gloriously of that source of service than to be just quantitatively philanthropic to a large number of individuals. Goodness does not require any announcement in public, it does not seek recognition, not even a word of thanks, for, “Is not the least one in this world going to be recognised as the first in the kingdom of God?” Civic obligations arise from human nature itself. They spring from the very needs of human make-up which has connections with different kinds of facility that is expected to be received from the world. The brute man, the vegetable man, the animal man, and the truly human man are classifications possible even at the human level.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 171 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది చాలా అల్పమయింది. సూక్ష్మాతి సూక్ష్మమయింది. మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింప బడతాం. ధ్యానమంటే గుర్తింపు లేకపోవడం. కేవలం నేను చైతన్యం మాత్రమే అని గుర్తించడం. నేను సాక్షిని అన్న విషయం గుర్తుంచుకోవాలి. 🍀*

*లేకపోవడమే నిజమైన వుండడం. నువ్వు అహంగా మాయమయిన క్షణం విశాలమవుతావు. విస్తృతమవుతావు. సముద్రానుభావానికి పొందుతావు. సరిహద్దులు లేని సంతోషాన్ని అందుకుంటావు. కానీ మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది చాలా అల్పమయింది. సూక్ష్మాతి సూక్ష్మమయింది. మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింపబడతాం. అది చిన్న గుడిసె దాంట్లో నివసించాలి. శుభ్రపరచాలి. దాన్ని అందంగా పెట్టాలి. సూక్ష్మ యంత్రమయిన మనసునీ వుపయోగించు. కానీ యంత్రానికి లొంగకు. డ్రైవరు కారు నడుపుతాడు. కార్లో వుంటాడు. కానీ కారు కాడు.*

*మనకు సంబంధించిన వ్యవహారం కూడా అలాంటిదే. మనముంటున్న యంత్రం ద్వారా మనం గుర్తింపు పొందుతున్నాం. ఈ రకమైన గుర్తింపు అహాన్ని యిస్తుంది. నేను శరీరం, నేను మనసు, నేను క్రిష్టియన్ని, నేను హిందూని, తెల్లవాణ్ణి, నల్లవాణ్ణి, నేను అది, నేను యిది! ఇవన్నీ కేవలం గుర్తింపులు. ధ్యానమంటే గుర్తింపు లేకపోవడం. కేవలం. నేను చైతన్యం మాత్రమే. పరిశీలనని, మెలకువని, సాక్షిని, అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆ సాక్షిగా వుండడంలో అహం అదృశ్యమవుతుంది. అహం అదృశ్యమయితే గొప్ప విప్లవం జరుగుతుంది. నువ్వు అల్పమయిన, చిన్ని ప్రపంచం నించీ విశాలమైన, సౌందర్యభరితమైన వైశాల్యంలోకి, కాలం నించి శాశ్వతత్వంలోకి మరణం నించీ మరణ రాహిత్యానికి సాగుతావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 110 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 86. సమాధాన విద్య - 2 🌻*

*“ఇట్లు చేసిన బాగుండునా?" అని ప్రశ్నించువాడు ప్రశ్నయందే తన కట్లు చేసిన బాగుండునని తెలుపుచున్నాడు. బాగుండదని నీవు తెలిపిననూ వినడు. అట్లు తెలిపిన చేదుగ ండును. "నీవన్నట్లే కానిమ్ము.” అనుట పృచ్ఛకునికి తృప్తి కలిగించును. అట్లనినచో అతను చెడి పోవును కదా! అని నీకనిపించినచో దానిని కూడ వివరించుము. వద్దు, కాదు, కూడదు అని తెలిపి ఉపయోగము లేదు. సూటిగ వ్యతిరేకించుట సమాధానము కాదు.*

*విభీషణుడు రావణుని సూటిగ సమాధాన రూపమున వ్యతిరేకించుట వలననే రాజ్య బహిష్కారము నకు గురి అయినాడు. హనుమంతుడు తన ప్రభువు సుగ్రీవుడు చేయుచున్నది అకార్యమని అనకుండగనే కార్యమున నిలబెట్టినాడు. హనుమంతుడు తెలిసినవాడు. విభీషణుడు తెలియనివాడు. విదురుడు తెలిసీ తెలియని వాడు. సమాధానము చెప్పుట ఒక ప్రత్యేక విద్య. దానికిని ఒక ఉపాసనా మార్గమున్నది. తనకు తోచినదే సమాధానమనుకొనుట మూర్ఖత.* 

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment