2) 🌹. శివ మహా పురాణము - 555 / Siva Maha Purana - 555 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 / Agni Maha Purana - 39 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 175 / Osho Daily Meditations - 175🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 366-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 366-1 🌹
🌹. హృదయార్పణం అంటే !! ఎలా??? 🌹*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 27, ఏప్రిల్ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*
*🍀. శ్రీ నారాయణ కవచం - 1 🍀*
*రాజోవాచ |*
*1. యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ |*
*క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్*
*2. భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్ |*
*యథాఽఽతతాయినః శత్రూన్ యేన గుప్తోఽజయన్మృధే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనసు అలజడిలో ఆత్మ కనిపించదు. మనో ప్రశాంతతలో ఆత్మ అనుభవంలోకి వస్తుంది. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ ద్వాదశి 24:25:36 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: పూర్వాభద్రపద 17:06:13
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: ఇంద్ర 17:36:50 వరకు
తదుపరి వైధృతి
కరణం: కౌలవ 12:35:46 వరకు
వర్జ్యం: 26:56:00 - 28:34:20
దుర్ముహూర్తం: 11:48:25 - 12:39:15
రాహు కాలం: 12:13:50 - 13:49:10
గుళిక కాలం: 10:38:30 - 12:13:50
యమ గండం: 07:27:51 - 09:03:11
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 09:03:00 - 10:39:36
సూర్యోదయం: 05:52:32
సూర్యాస్తమయం: 18:35:09
చంద్రోదయం: 03:38:23
చంద్రాస్తమయం: 15:42:22
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కుంభం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 17:06:13
వరకు తదుపరి లంబ యోగం
- చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 555 / Sri Siva Maha Purana - 555 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴*
*🌻. పెండ్లి వారి భోజనములు - 1 🌻*
బ్రహ్మఇట్లు పలికెను-
కుమారా! అపుడు మహాభాగ్యవంతుడు, పర్వతరాజు, విద్వాంసుడునగు హిమవంతుడు భోజనము కొరకు ప్రాంగణమును ఏర్పాటు చేసెను (1). ఆయన దానిని తుడిపించి, చక్కగా సుగంధ ద్రవ్యములను చల్లించి, అనేక వస్తువులచే శ్రద్ధగా అలంకరింపజేసెను (2). అపుడు హిమవంతుడు దేవలనందరినీ, ఇతరులను, ఈశ్వరుని, తన కుమారులగు పర్వతుల చేత, మరియు ఇతరులచేత ఆహ్వానింప జేసెను (3). ఓ మునీ! ఆ ప్రభుడు పర్వతుని ఆహ్వానమును విని అచ్యుతునితో గూడి, దేవతలు మొదలగు వారందరితో కలిసి ఆనందముతో ఆచటకు భోజనము కొరకై వెళ్లెను (4).
హిమవంతుడు శివుని ఇతరులనందరిని యథావిధిగా మంచిగా సత్కరించి ఇంటి లోపల మంచి పీటలపై ఆనందముతో కూర్చుండబెట్టెను (5). అనేక మధుర పదార్థములను వడ్డించిన తరువాత ఆయన సమ్మానపూర్వకముగా చేతులు జోడించి భోజనమునకు అనుమతినిచ్చెను (6). అపుడచట సన్మానింపబడిన విష్ణువు మొదలగు దేవతలందరు సదాశివుని ముందిడుకొని భోజనము చేసిరి (7). అపుడు వారందరు ఒకే సారి అంతటా వరుసలో వేర్వేరుగా కూర్చుండి నవ్వుతూ భుజించిరి (8).
మహాత్ములగు నంది, భృంగి, వీర భద్రుడు, వారి గణములు కుతూహలముతో గూడిన వారై వేర్వేరుగా భుజించిరి (9). ఇంద్రాది దేవతలు, మహాత్ములగు లోకపాలకులు వివిధ శోభలతో గూడిన వారై అనేక హాస్యోక్తులను పలుకుతూ భుజించిరి (10). మునులు, విప్రులు, భృగువు మొదలగు ఋషులు అందరు వేర్వేరు పంక్తులలో కూర్చుండి ప్రీతితో భుజించిరి (11). చండీ గణములందరూ కుతూహలమునకు కలిగించువారై అనేక హాస్యవచనములను పలుకుతూ ఆనందముతో పళ్లెరముల యందు భుజించిరి (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 555 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴*
*🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 1 🌻*
Brahmā said:—
1. O dear one, then the clever chief of mountains caused suitable arrangements to be made in the courtyard for feeding the visitors.
2. He caused the ground to be swept clean and scrubbed well. Different kinds of fragrant stuffs were used to make the place attractive and pleasing.
3. Then the mountain invited all the gods and others along with the lord for taking food, through his sons and others.
4. O sage, on hearing the invitation of the mountain, the lord accompanied by Viṣṇu, the gods and others went gladly to take His meal.
5. The mountain received the lord and all those duly and made them sit in good seats in the inner apartment.
6. After serving sweet and well-cooked delicious foodstuffs, he requested them to take their food with palms joined in reverence and head bent down.
7. Then duly honoured, Viṣṇu and other gods keeping Sadāśiva at the head took their food.
8. They sat in rows together, took their food simultaneously laughing (and talking).
9. Nandin, Bhṛṅgi, Vīrabhadra and his Gaṇas took their meals separately. The fortunate people took food enthusiastically.
10. The gods, with Indra, the guardians of the quarters all forunate and brilliant took their food cracking jokes and talking.
11. The sages and brahmins, Bhṛgu and other sages sat in separate rows and took their food with pleasure.
12. The Gaṇas of Caṇḍī took their meals and then cracked jokes and talked merrily.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 / Agni Maha Purana - 39 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 14*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. మహాభారత వాఖ్యానము - 2 🌻*
దుర్యోధనుడు శోకార్తు డయ్యెను అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున దృష్టద్యుమ్నుడు సేనాపతి అయ్యెను.
వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణుడను మహాసముద్రమునందు విరాట ద్రువదాదులు మునిగిపోయిరి. హస్త్యశ్వరథవదాతులు గల దుర్యోధనసేన కూడ పాండవసేనాపతియైన దృష్ఠద్యుమ్ముని చేత (చంపబడెను). ద్రోణుడు యుద్దమునందు యముడు వలె కన్పట్టెను. అశ్వత్థామ మరణించెను. అను మాట విని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని అతడు సర్వక్షత్రియులను సంహరించి ఐదవ దివసమున ధృష్టద్యుమ్నుని బాణములచే కొట్టబడి మరణించెను.
దుర్యధనుడు శోకార్తుడయ్యెను. అపుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను వారిరువురును శస్త్రములతో ఒకరి నొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసురయుద్ధతుల్య మగు యుద్ధము జరిగెను. కర్ణార్జునసంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను. శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ద దివనము యుద్దము చేసెను. యుధిష్ఠిరు డాతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది సైనికులు మొదలగు వారిని చంపి అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమసేనుడు గదతో యుద్ధము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదు నెనిమిదవ దినమున పడగొట్టెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -39 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 14*
*🌻 Story of the Mahābhārata - 2 🌻*
11. As Duryodhana was grief-stricken, Droṇa became the Commander. As the army of Pāṇḍavas was jubilant, Dhṛṣṭadyumna (was made) the Commander.
12. There was a fierce battle between the two which made the domain of Yama (the god of death) extensive. Virāṭa, Drupada and others were drowned in the ocean of (arrows of) Droṇa.
13. The huge army of Duryodhana (consisted of) elephant, horse, chariot and infantry. Droṇa became just like Kāla (death himself) for the (army) headed by Dhṛṣṭadyumna.
14- 15. When it was proclaimed that Aśvatthāman was killed, Droṇa abandoned his astras. Overcome by the arrow of Dhṛṣṭadyumna he fell on the earth on the fifth day, (himself being) unassailable and after having killed many warriors. As Duryodhana was grief-stricken, Karṇa became the commander.
16. And Arjuna (became the commander) of the Pāṇḍava forces. There was combat between them, between weapons and weapons, very fierce and resembling a war between devas and asuras.
17. In the war known as the Karṇārjuna, Karṇa killed the enemies with his arrows. On the second day, Karṇa was killed by Arjuna.
18. Śalya fought for a day and Yudhiṣṭhira killed him. Suyodhana (Duryodhana), whose army had been destroyed, fought with Bhīmasena.
19. Having killed many men (in their army) (he) challenged Bhīmasena. Bhīmasena killed him, who was attacking with the mace.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 174 / Osho Daily Meditations - 174 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 174. నిరర్థకత 🍀*
*🕉. అంతా వ్యర్థమే. దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకపోతే, మీరు ఎల్లప్పుడూ భ్రమలో ఉంటారు. ప్రతిదీ పనికిరానిది, మరియు జీవితంలో పురోగతి లేదు, మెరుగుదల లేదు, ఎందుకంటే జీవితం శాశ్వతంగా ఉంటుంది. జీవితం ఇప్పటికే పరిపూర్ణంగా ఉంది. 🕉*
*జీవితాన్ని మరింత పరిపూర్ణంగా మార్చుకోవడానికి మీరు చేసేదంతా వ్యర్థం. కానీ దానిని గ్రహించడానికి సమయం పడుతుంది. మీరు ఇరుక్కుపోయినట్లు అనిపించినప్పుడు, మీరు రెండు పనులు చేస్తారు. మీరు మీ జీవనశైలిని మార్చుకోవచ్చు, ఆపై మళ్లీ కొన్ని రోజులు మీరు కొత్త ఆశలు, కోరికలు మరియు ఆశయాలతో ఉన్నట్టు ఉంటారు. రేపటి అవకాశం మళ్లీ సజీవంగా మారుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత రేపు రాదని మీరు గ్రహిస్తారు, మళ్లీ మీరు ఇరుక్కుపోయారు అని అర్ధం చేసుకుంటారు. ఇలానే మొత్తం విషయం మళ్లీ మళ్లీ పునరావృత్తం అవుతూ ఉంటుంది.*
*ఇదెలాంటిదంటే మీరు ఒక స్త్రీని లేదా పురుషుడిని ప్రేమించినట్లే. ఆ కల ముగిసిందా, దానితో పాటే ఆ ప్రేమ ముగిసింది. అది ముగిసే సమయానికి, మీరు మళ్లీ మరొకరి కోసం వెతుకుతారు. మీరు ఒక జీవిత కాలం నుండి మరొక జీవిత కాలం వరకు ఈ విధంగా వెళ్ళవచ్చు, కానీ అది సహాయం చేయదు. జీవితంలో జీవితం కోసం సాధించేది ఏదీ లేదని గ్రహించాలి. జీవితం లక్ష్యం ఆధారితమైనది కాదు. జీవితం ఇప్పుడు ఇక్కడ శాశ్వతంగా ఉంది. ఇది ఇప్పటికే పరిపూర్ణంగా ఉంది. దీన్ని మెరుగుపరచడం సాధ్యం కాదు. మీరు దీనిని గ్రహించిన తర్వాత, భవిష్యత్తు లేదు, ఆశ లేదు, కోరిక లేదు, ఆశయం లేదు. మీరు ఈ క్షణంలో నివసిస్తున్నారు; మీరు దానిలో ఉండండి మరియు ఆనందించండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 174 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 174. FUTILITY 🍀*
*🕉 Everything is futile. One has to understand this. if you don 't understand it, you will always remain in illusion. Everything is futile, and in life there is no progress, no improvement, because life is eternally there. Life is already perfect. 🕉*
*All that you try to do to make life more perfect is futile, but it takes time to realize it. When you are feeling stuck, you do two things. You can change your lifestyle, and then for a few days again you will be on a honeymoon, with hopes and desires and ambitions, and the possibility of tomorrow again will become alive. But after a few days you realize that tomorrow never comes. Again you are stuck, and the whole thing again becomes a routine.*
*It is just like when you love a woman or a man. The honeymoon over, the love is over. By the end of the honeymoon, you are again seeking and searching for another. You can go on in this way from one honeymoon to another, but it is not going to help. You have to realize that there is nothing to achieve in life. Life is not goal oriented. Life is eternally here now. It is already perfect. It cannot be improved upon. Once you realize this, then there is no future, no hope, no desire, and no ambition. You live this moment; you enjoy and delight in it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 366-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 366-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*
*🌻 366-1. 'పరా' 🌻*
*శ్రీమాత పరతత్వమే అని అర్థము. సృష్టికి ఆవల యున్న తత్త్వమును 'పర' అందురు. దానిని గూర్చి వివరించుట శక్యము కాదు. ఆ తత్త్వ మెట్లున్నదో తెలుసుకొన గోరువాడు తెలుసుకొను ప్రయత్నమున దానిలో ఇమిడి పోవును గనుక తెలుసుకొన వీలుపడదు. ఈ తత్త్వము సృష్టి యున్ననూ లేకున్ననూ యుండును గనుక దీనిని 'సత్యము' అనిరి. ఎప్పుడునూ యుండునది గనుక వున్నది అని కూడ అందురు.*
*మనము “వున్నాము” అని భావించుట కూడ దాని వలననే. అదియే అన్నిటికీ మూలము. దీనినే మన వాఙ్మయమున 'పరబ్రహ్మము' అనిరి. అనగా బ్రహ్మమునకు కూడ పరమని అర్థము. అట్లే పరమశివుడు అనియు నారాయణు డనియు కూడా అందురు. సృష్టి సమస్తమునకు పరమైనటు వంటి తత్త్వమిది. ఈ తత్త్వము నుండి అనేకానేకములు పుట్టుచుండిననూ దానియందు మార్పు యుండదు. ఎట్టి మార్పునకు అది గురికాదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 366-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*
*🌻 366-1. Parā परा 🌻*
*In the next few nāma-s Her Śabda (sound) Brahman form is going to be discussed. The literal meaning of ‘Brahman’ is growing, developing, swelling, expanding, evolving etc. This nāma refers Her un-manifested form (of the Brahman). In order to understand this nāma and the next few, origin and evolution of sound becomes a necessity.*
*Prakāśa and vimarśa form of the Brahman are quite frequently referred to while discussing the Supreme Reality or the Absolute. Generally it is to be understood that prakāśa form represent Śiva and vimarśa form represent Śakthī. Śiva or Parameśvara (parama means the highest) is pure and unblemished self-illuminating light and Śakthī or vimarśa is the realisation of this pure light.*
*Prakāśa and vimarśa cannot be separated. There is a Sanskrit saying that word and its meaning cannot be separated; in the same way Pārvatī or Śakthī and Parameśvaran or Śiva cannot be separated from each other. When there is a brilliant light, one needs to have knowledge to realise it as light. Suppose, there is a candle burning, and on seeing the candle with light, one can say that the candle gives light.*
*When one wants to see a candle light, he needs to have a lighted candle. The light and its visibility though separate, are interdependent. Visibility is the expression of light and without the source of the light, visibility becomes impossible. In the same way, light is of no use, if it is not reflected making the visibility possible. Both light and its expression together is known as light. This is called prakāśa vimarśa māyā or the Absolute. Sound originates from this Absolute form.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. హృదయార్పణం అంటే !! ఎలా??? 🌹*
మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు.
పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించు కుంటూ ఉంటాడు.
ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమో గానీ.. అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా...
ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు... భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి...
అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు...
పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.
పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు...
"పరమేశ్వరా... నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు, కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి..
అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి..
నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు..
పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా..
నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి..
ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి..
గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా..
ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి..
నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు..
మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా..
నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా..
జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా..
నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు..
విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా..
అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి..
అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి..
వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి.."
...ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు, భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే...
వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది...
నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, వస్తువులు అంతకన్నా కావు...
ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు, భక్తితో స్మరిస్తే చాలునంటాడు, కానీ మనిషి మనసు చంచలం, చపలం.
స్థిరంగా ఒకచోట ఉండదు, లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. అందుకే... శంకరభగవత్పాదులు...
ఓ పరమేశ్వరా... నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది...
భార్యా పుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది...
క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది, అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను, దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు...
సామాన్య భక్తులను తరింప జేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది...
ఓ పరమేశ్వరా... బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది, అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు...
కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి, షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.
సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది.
కనుక నీకు నేనేమీ ఇవ్వలేను, నా దగ్గర ఉన్నది ఒక్క మనసే, అది నీకు సమర్పిస్తున్నాను..
అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.
అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.
అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు, హృదయార్పణమే పూజ, నిశ్చల ధ్యానమే భక్తి, అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు... ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి...
*_🌻శుభమస్తు🌻_*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment