శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 366-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 366-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 366-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 366-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 366-1. 'పరా' 🌻
శ్రీమాత పరతత్వమే అని అర్థము. సృష్టికి ఆవల యున్న తత్త్వమును 'పర' అందురు. దానిని గూర్చి వివరించుట శక్యము కాదు. ఆ తత్త్వ మెట్లున్నదో తెలుసుకొన గోరువాడు తెలుసుకొను ప్రయత్నమున దానిలో ఇమిడి పోవును గనుక తెలుసుకొన వీలుపడదు. ఈ తత్త్వము సృష్టి యున్ననూ లేకున్ననూ యుండును గనుక దీనిని 'సత్యము' అనిరి. ఎప్పుడునూ యుండునది గనుక వున్నది అని కూడ అందురు.
మనము “వున్నాము” అని భావించుట కూడ దాని వలననే. అదియే అన్నిటికీ మూలము. దీనినే మన వాఙ్మయమున 'పరబ్రహ్మము' అనిరి. అనగా బ్రహ్మమునకు కూడ పరమని అర్థము. అట్లే పరమశివుడు అనియు నారాయణు డనియు కూడా అందురు. సృష్టి సమస్తమునకు పరమైనటు వంటి తత్త్వమిది. ఈ తత్త్వము నుండి అనేకానేకములు పుట్టుచుండిననూ దానియందు మార్పు యుండదు. ఎట్టి మార్పునకు అది గురికాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 366-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 366-1. Parā परा 🌻
In the next few nāma-s Her Śabda (sound) Brahman form is going to be discussed. The literal meaning of ‘Brahman’ is growing, developing, swelling, expanding, evolving etc. This nāma refers Her un-manifested form (of the Brahman). In order to understand this nāma and the next few, origin and evolution of sound becomes a necessity.
Prakāśa and vimarśa form of the Brahman are quite frequently referred to while discussing the Supreme Reality or the Absolute. Generally it is to be understood that prakāśa form represent Śiva and vimarśa form represent Śakthī. Śiva or Parameśvara (parama means the highest) is pure and unblemished self-illuminating light and Śakthī or vimarśa is the realisation of this pure light.
Prakāśa and vimarśa cannot be separated. There is a Sanskrit saying that word and its meaning cannot be separated; in the same way Pārvatī or Śakthī and Parameśvaran or Śiva cannot be separated from each other. When there is a brilliant light, one needs to have knowledge to realise it as light. Suppose, there is a candle burning, and on seeing the candle with light, one can say that the candle gives light.
When one wants to see a candle light, he needs to have a lighted candle. The light and its visibility though separate, are interdependent. Visibility is the expression of light and without the source of the light, visibility becomes impossible. In the same way, light is of no use, if it is not reflected making the visibility possible. Both light and its expression together is known as light. This is called prakāśa vimarśa māyā or the Absolute. Sound originates from this Absolute form.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment